Share News

స్పీకర్‌ నిర్ణయాన్ని సుప్రీం కూడా ప్రశ్నించలేదు

ABN , Publish Date - Mar 12 , 2026 | 06:18 AM

అనుకున్న విధంగానే లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై ఇతర ప్రతిపక్షాలతో కలిసి కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఈ తీర్మానంపై మంగళ, బుధవారాల్లో...

స్పీకర్‌ నిర్ణయాన్ని సుప్రీం కూడా ప్రశ్నించలేదు

  • కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

  • ఓం బిర్లాపై వీగిన అవిశ్వాస తీర్మానం

న్యూఢిల్లీ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): అనుకున్న విధంగానే లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై ఇతర ప్రతిపక్షాలతో కలిసి కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఈ తీర్మానంపై మంగళ, బుధవారాల్లో పది గంటలకుపైగా వాడివేడి చర్చ జరిగిన తర్వాత మూజువాణి ఓటుతో లోక్‌సభ తిరస,్కరించింది. స్పీకర్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా దేశ ప్రజాస్వామ్య పునాదినే ప్రశ్నించారని చివరిగా చర్చలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తీవ్రంగా విమర్శించారు. స్పీకర్‌ నిర్ణయాన్ని ప్రశ్నించడానికి సుప్రీంకోర్టును కూడా రాజ్యాంగం అనుమతించలేదని ఆయన అన్నారు. ముందుగా నిర్ణయించిన ఎజెండా, నిబంధనల ప్రకారం సభ నడుస్తుందని, వాటిని ఉల్లంఘిస్తే స్పీకర్‌ అడ్డుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కాగితాలను చించి స్పీకర్‌పైకి విసిరేందుకు ఎంపీలను అనుమతిస్తారా అని ప్రశ్నించారు. ఎవరి మాటలను రికార్డుల నుంచి తొలగించేందుకైనా స్పీకర్‌కు హక్కు ఉంటుందని, పార్లమెంటరీ భాష ఉపయోగించకపోతే తొలగించక ఏమి చేస్తారని ప్రశ్నించారు. గతంలో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టినపుడు స్పీకర్‌ తనపై తీర్మానం చర్చకు వచ్చే వరకు సభకు హాజరయ్యేవారని, కానీ ఓం బిర్లా తనపై తీర్మానం ప్రవేశపెట్టిన వెంటనే సభకు రాకూడదని నిర్ణయించుకున్నారని, అది ఆయన నైతిక ప్రమాణాలను సూచిస్తోందని అమిత్‌ షా అన్నారు. అటువంటి వ్యక్తికి ప్రతిపక్షాలు నైతిక పాఠాలు చెప్పకూడదని హితవు పలికారు.

ఇవి కూడా చదవండి..

సీఈసీ అభిశంసనకు నోటీసుపై 180 మంది ఎంపీల సంతకం

స్పీకర్‌ ఓంబిర్లాపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

Updated Date - Mar 12 , 2026 | 06:18 AM