స్పీకర్ ఓంబిర్లాపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
ABN , Publish Date - Mar 11 , 2026 | 06:54 PM
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో బుధవారంనాడు వీగిపోయింది. విపక్ష ఎంపీల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహమ్మద్ జావేద్ ఈ తీర్మానాన్ని తొలి దఫా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టగా, రెండో దఫా బడ్జెట్ సమావేశాల్లో దీనిపై చర్చను ప్యానల్ స్పీకర్ జగదంబిక పాల్ చేపట్టారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla)పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో బుధవారంనాడు వీగిపోయింది. విపక్ష ఎంపీల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహమ్మద్ జావేద్ ఈ తీర్మానాన్ని తొలి దఫా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టగా, రెండో దఫా బడ్జెట్ సమావేశాల్లో దీనిపై చర్చను ప్యానల్ స్పీకర్ జగదంబిక పాల్ చేపట్టారు. రాహుల్ గాంధీ, అమిత్‌షా, రవిశంకర్ ప్రసాద్ తదితరులు చర్చలో పాల్గొన్నారు. అనంతరం ఓటింగ్ చేపట్టగా... మూజువాణి ఓటుతో ప్రతిపక్షాల తీర్మానం వీగిపోయింది. ఆ వెంటనే లోక్‌సభను గురువారంనాటికి ప్యానెల్ స్పీకర్ వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి..
స్పీకర్‌పై అవిశ్వాసం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు: కేంద్ర హోంమంత్రి
ప్రధాని ఎప్పటికీ రాజీపడరు.. రాహుల్‌పై విరుచుకుపడిన రవిశంకర్ ప్రసాద్