Share News

స్పీకర్‌పై అవిశ్వాసం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు: కేంద్ర హోంమంత్రి

ABN , Publish Date - Mar 11 , 2026 | 06:30 PM

పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళితే..

స్పీకర్‌పై అవిశ్వాసం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు: కేంద్ర హోంమంత్రి
Amit Shah statement parliament

ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాపై (Om Birla) ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒక స్పీకర్ పై ఇలాంటి తీర్మానం రావడం దురదృష్టకరమని, ఇది పార్లమెంటరీ సంప్రదాయాలను కించపరచడమే అని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ స్థానాన్ని రాజకీయ కోణంలో చూడటం తగదని అమిత్ షా స్పష్టం చేశారు. హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ‘స్పీకర్ పదవికి రాజకీయాలతో సంబంధం లేదు. సభలో ఆయన అందరివాడు, అన్ని పార్టీల ఏకాభిప్రాయంతోనే స్పీకర్ ఎంపిక జరిగింది. అటువంటి వ్యక్తి నిబద్ధతను, నిష్పక్షపాత వైఖరిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.


సభా నిబంధనలను కాంగ్రెస్ పార్టీ పదే పదే ఉల్లంఘిస్తోందని అమిత్ షా ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన గత చరిత్రను గుర్తు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం సభలో అమలవుతోన్న నిబంధనలు నెహ్రూ కాలంలో రూపొందబడ్డాయి, వాటిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. సభా మర్యాదలను కాపాడటంతో ప్రతిపక్షాలు విఫలమవుతున్నాయి, నిబంధనలను పాటించకుండా స్పీకర్ పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు’ అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నా: కడియం శ్రీహరి

ప్రధాని ఎప్పటికీ రాజీపడరు.. రాహుల్‌పై విరుచుకుపడిన రవిశంకర్ ప్రసాద్

For More National News And Telugu News

Updated Date - Mar 11 , 2026 | 06:30 PM