ప్రధాని ఎప్పటికీ రాజీపడరు.. రాహుల్‌పై విరుచుకుపడిన రవిశంకర్ ప్రసాద్
ABN , Publish Date - Mar 11 , 2026 | 02:51 PM
పార్లమెంటు గౌరవాన్ని నిలబెట్టడంలో విపక్ష నేత విఫలమయ్యారని రాహుల్ గాంధీపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా విమర్శించారు. ప్రధాని రాజీ పడ్డారంటూ రాహుల్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని అన్నారు.
న్యూఢిల్లీ: పార్లమెంటు గౌరవాన్ని నిలబెట్టడంలో విపక్ష నేత విఫలమయ్యారని రాహుల్ గాంధీపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ (Ravishankar Prasad) ఘాటుగా విమర్శించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా బుధవారంనాడు జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ, సహేతుక కారణాలతో కాకుండా ఒకరి ఈగోను తృప్తిపరచడం కోసమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని పరోక్షంగా రాహుల్ గాంధీని ప్రస్తావిస్తూ అన్నారు.
రాజీపడే వ్యక్తి కాదు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రవిశంకర్ ప్రసాద్ సమర్ధిస్తూ, ప్రధాని రాజీ పడ్డారంటూ రాహుల్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని అన్నారు. 'లోక్‍సభలో విపక్ష నేతకు ఒకమాట చెప్పదలచుకున్నాను. ఈ దేశ ప్రధాని ఎన్నడూ రాజీపడరు' అని పేర్కొన్నారు. వ్యక్తిగత రాజకీయ పోరాటాల కోసం పార్లమెంటును ఉపకరణం చేసుకోవద్దని సూచించారు. ఎవరో ఒక నేతనో, ఒక గ్రూపునో సంతృప్తి పరచేందుకు స్పీకర్‌పై విపక్షాలు ఆయుధాన్ని ఎక్కుపెట్టడం సరికాదన్నారు.
రాహుల్ ఏమన్నారు?
దీనికి ముందు, రాహుల్ గాంధీ చర్చలో పాల్గొంటూ గత సమావేశాల్లో తనను మాట్లాడనీయలేదని, చాలా అంశాల్లో మోదీ రాజీ పడ్డారని అన్నారు. మోదీ వైఫల్యాలపై మాట్లాడటానికి స్పీకర్ తనను అనుమతించడం లేదని అన్నారు. విపక్ష నేతను లోక్‌సభలో మాట్లాడకుండా స్పీకర్ అడ్డుకోవడం అసాధారణమైన విషయమని పేర్కొన్నారు. పార్లమెంటు ప్రజలదని, ఒక రాజకీయ పార్టీకే పరిమితం కాదని అన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రధాని మోదీ వైఫల్యాలపై మాట్లాడడానికి స్పీకర్ అనుమతివ్వలేదు: రాహుల్ గాంధీ
స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు!