ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్‌లో నిలిచిపోయిన భోజన సదుపాయం
ABN , Publish Date - Mar 11 , 2026 | 01:39 PM
ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్‌లో భోజన సదుపాయం తాత్కాలికంగా నిలిచిపోయింది. LPG గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా వంట ప్రక్రియకు అంతరాయం ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్యాంటీన్ నిర్వాహకులు తెలిపారు.
ఢిల్లీ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) క్యాంటీన్‌లో భోజన సదుపాయం తాత్కాలికంగా నిలిచిపోయింది. LPG గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా వంట ప్రక్రియకు అంతరాయం ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్యాంటీన్ నిర్వాహకులు తెలిపారు.
క్యాంటీన్ నిర్వహకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో మెయిన్ కోర్స్ భోజనం తయారు చేయడం సాధ్యం కావడం లేదు. సాధారణంగా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, సందర్శకులకు అందించే పూర్తి భోజనం ప్రస్తుతం అందుబాటులో లేదు. గ్యాస్ సరఫరా ఎప్పుడు పునరుద్ధరిస్తారో.. ఇప్పటికీ తమకు స్పష్టత లేదని నిర్వాహకులు వెల్లడించారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి ఇవే..
గ్యాస్ లేకపోవడంతో వంట చేయలేని పరిస్థితి ఉండటంతో ప్రస్తుతం క్యాంటీన్‌లో కేవలం కొన్ని తేలికపాటి ఆహార పదార్థాలనే అందిస్తున్నారు. వాటిలో శాండ్‌విచ్‌లు, ఫ్రూట్ సలాడ్లు, ఫ్రూట్ చాట్, ఇతర తేలికపాటి అల్పాహారాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పరిమిత ఆహారంతోనే క్యాంటీన్ సేవలు కొనసాగుతున్నాయి.
న్యాయవాదులకు అసౌకర్యం..
ఈ పరిస్థితి కారణంగా కోర్టుకు వచ్చే న్యాయవాదులు, సిబ్బంది కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ విషయంపై క్యాంటీన్ మేనేజ్‌మెంట్ స్పందిస్తూ.. న్యాయవాదులకు కలిగిన ఇబ్బందులకు క్షమాపణలు కోరింది. గ్యాస్ సరఫరా పునరుద్ధరించిన వెంటనే క్యాంటీన్‌లో పూర్తిస్థాయి భోజన సేవలు తిరిగి ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు. అప్పటి వరకు తాత్కాలికంగా అల్పాహారాలతోనే సేవలు కొనసాగనున్నాయని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైతు భూమిని కాజేస్తారా.. బుగ్గనపై సీఎం చంద్రబాబు ధ్వజం
జగన్ హయాంలో ఐదేళ్లపాటు చెత్తపాలన సాగించారు.. మంత్రి నారాయణ ధ్వజం
Read Latest International News And Telangana News And AP News And Telugu News