Share News

మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై కేంద్రం కీలక నిర్ణయం

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:16 PM

మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గాల పునర్విభజన కంటే ముందే మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై కేంద్రం కీలక నిర్ణయం
Womens Reservation

ఢిల్లీ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గాల పునర్విభజన కంటే ముందే మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 2023లో పార్లమెంట్ ఆమోదించిన చట్టంలో సవరణలకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపింది.


ఏప్రిల్ 2వ తేదీ వరకూ జరగనున్న బడ్జెట్ మలి విడత సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జనగణన, పునర్విభజన ప్రక్రియ కోసం వేచి చూడకుండానే కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. రాజ్యాంగ సవరణ ద్వారా అమలు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

రైతు భూమిని కాజేస్తారా.. బుగ్గనపై సీఎం చంద్రబాబు ధ్వజం

జగన్ హయాంలో ఐదేళ్లపాటు చెత్తపాలన సాగించారు.. మంత్రి నారాయణ ధ్వజం

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 11 , 2026 | 12:30 PM