Share News

ఫరూఖ్‌ అబ్దుల్లాపై కాల్పులకు యత్నం?

ABN , Publish Date - Mar 12 , 2026 | 06:05 AM

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా, జమ్మూకశ్మీర్‌ డిప్యూటీ సీఎం సురీందర్‌ చౌదరి త్రుటిలో కాల్పుల నుంచి తప్పించుకున్నారు...

ఫరూఖ్‌ అబ్దుల్లాపై కాల్పులకు యత్నం?

జమ్మూ, మార్చి 11: నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా, జమ్మూకశ్మీర్‌ డిప్యూటీ సీఎం సురీందర్‌ చౌదరి త్రుటిలో కాల్పుల నుంచి తప్పించుకున్నారు. జమ్మూ గ్రేటర్‌ కైలాశ్‌ ప్రాంతంలోని హోటల్‌ రాయల్‌ పార్క్‌లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైనప్పుడు ఈ ఘటన జరిగింది. కమల్‌ సింగ్‌ జమ్వాల్‌ అనే వృద్ధుడు ఫరూఖ్‌పై అతి సమీపం నుంచి కాల్పులు జరిపేందుకు యత్నించాడు. అప్రమత్తమైన సిబ్బంది అడ్డుకోవడంతో తూటాలు గాల్లోకి దూసుకుపోయాయి. వారిద్దరూ బుల్లెట్ల నుంచి తప్పించుకోగలిగారు. కాల్పులు జరిపిన కమల్‌ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సాయుధుడు తాగిన మైకంలో కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి..

సీఈసీ అభిశంసనకు నోటీసుపై 180 మంది ఎంపీల సంతకం

స్పీకర్‌ ఓంబిర్లాపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

Updated Date - Mar 12 , 2026 | 06:05 AM