స్థిరంగా బంగారం, స్వల్పంగా తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Mar 12 , 2026 | 06:29 AM
గురువారం వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ ఏర్పడింది.
గురువారం వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ ఏర్పడింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత మార్గాల వైపు చూస్తుండడంతో ధరలు పెరుగుతున్నాయి (Gold prices).
ఈ రోజు (మార్చి 12న) ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,63,320 దగ్గర ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,710 దగ్గర ఉంది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,63,470కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,49,860కి చేరుకుంది.
మరోవైపు వెండి ధర స్వల్పంగా తగ్గింది. గురువారం కిలోకు వంద రూపాయల మేర తగ్గుదల నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ.1,63,320, రూ.1,49,710
విజయవాడలో రూ.1,63,320, రూ.1,49,710
ఢిల్లీలో రూ.1,63,470, రూ.1,49,860
ముంబైలో రూ.1,63,320, రూ.1,49,710
వడోదరలో రూ.1,63,370, రూ.1,49,760
కోల్‌కతాలో రూ.1,63,320, రూ.1,49,710
చెన్నైలో రూ.1,63,320, రూ.1,49,710
బెంగళూరులో రూ.1,63,320, రూ.1,49,710
కేరళలో రూ.1,63,320, రూ.1,49,710
పుణెలో రూ.1,63,320, రూ.1,49,710
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ.2,99,900
విజయవాడలో రూ.2,99,900
ఢిల్లీలో రూ.2,89,900
చెన్నైలో రూ.2,99,900
కోల్‌కతాలో రూ.2,89,900
కేరళలో రూ.2,99,900
ముంబైలో రూ.2,89,900
బెంగళూరులో రూ.2,89,900
వడోదరలో రూ.2,89,900
అహ్మదాబాద్‌లో రూ.2,89,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి..
వీరి తెలివి మామూలుగా లేదుగా.. రైల్వే ఏసీ కోచ్‌ను ఎలా మార్చారో చూడండి..
వావ్..! వాట్ ఎ టాలెంట్.. ఈ డ్రైవర్ పనితనం చూస్తే శభాష్ అనాల్సిందే..