Share News

వీరి తెలివి మామూలుగా లేదుగా.. రైల్వే ఏసీ కోచ్‌‌ను ఎలా మార్చారో చూడండి..

ABN , Publish Date - Mar 08 , 2026 | 02:23 PM

ఓ కుటుంబం రైల్లోని ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తోంది. ఈ సందర్భంగా వారంతా కలిసి ఓ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. సినిమా చూడడంలో వింతేమీ లేకున్నా..

వీరి తెలివి మామూలుగా లేదుగా.. రైల్వే ఏసీ కోచ్‌‌ను ఎలా మార్చారో చూడండి..

రైలు అనగానే.. సీటు కోసం తొక్కిసలాటలు, తోసుకోవడం, తన్నుకోవడం, ప్రయాణికులతో కిక్కిరిసిన బోగీలు.. ఇలాంటి సీన్లే గుర్తుకొస్తాయి. కొందరు కొన్నిసార్లు ప్రమాదకర విన్యాసాలు చేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, రైలు బోగీలో ఓ కుటుంబం చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. బోగీలో వారు సినిమాను ఎలా ప్రదర్శించారో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కుటుంబం రైల్లోని ఏసీ కోచ్‌లో (AC coach in train) ప్రయాణిస్తోంది. ఈ సందర్భంగా వారంతా కలిసి ఓ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. సినిమా చూడడంలో వింతేమీ లేకున్నా.. సినిమా ప్రదర్శించిన తీరు చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమ వెంట తెచ్చుకున్న మినీ ప్రొజెక్టర్ సాయంతో బోగీలోని గోడపై బాలీవుడ్ సినిమాను ప్రదర్శించారు.


కర్టన్లు మొత్తం మూసేయడంతో లోపల సినిమా క్లారిటీగా కనిపించింది. తెల్లటి ఆ గోడపై సినిమా పడగానే (Family watches movie with projector in railway coach) థియేటర్ ఫీలింగ్ వచ్చేసింది. ఇలా ఆ కుటుంబం మొత్తం థియేటర్‌లో సినిమా చూసినట్లుగా.. బోగీలో ఎంజాయ్ చేశారు. ‘యాత్ర కా ఆనంద్’.. అని పేర్కొంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


‘ప్రయాణ సమయంలో టైమ్ పాస్ చేయడానికి ఇది అద్భుతమైన ఐడియా’.. , ‘రైలు బోగీని సినిమా థియేటర్‌గా మార్చేశారుగా’.., ‘ఫ్యామిలీతో కలిసి ట్రైన్‌లో మూవీ చూడటం చాలా ఫన్‌గా ఉంటుంది’.. అంటూ కొందరు తమ కామెంట్స్ చేయగా.. కొందరు భద్రతాపరమైన అంశాలపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకొందరు ‘వాల్యూమ్ ఎక్కువగా ఉంటే ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగొచ్చు’.., ‘ట్రైన్‌లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు ఉపయోగించడం వల్ల షార్ట్ సర్క్యూట్ వంటి సమస్యలు రావచ్చు’.. అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం 19 వేలకు పైగా లైక్‌లు, 1.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

వీధిలో తాపీగా నడుస్తున్న పెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు..

రీల్ కోసం ప్రాణాలతో చెలగాటం.. రన్నింగ్ రైల్లో స్టంట్.. రెప్పపాటు కాలంలో..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 08 , 2026 | 02:25 PM