రైలు పట్టాల వద్ద ఆకతాయిల పిచ్చి చేష్టలు.. రైలు దగ్గరికి రాగానే..
ABN , Publish Date - Mar 07 , 2026 | 10:23 AM
హోలీ అంటే సాధారణంగా ఎవరైనా తమ స్నేహితులు, బంధుమిత్రులతో కలిసి రంగులు చల్లుకుని సరదాగా గడుపుతారు. అయితే ఇటీవల ఈ వేడుకలు కొందరు ఆకతాయిల వల్ల పైశాచికత్వానికి దారి తీస్తున్నాయి. తాజాగా..
ప్రస్తుతం చాలా మంది యువత చెడు వ్యసనాలకు బానిసై తప్పు దారి పడుతున్నారు. కొందరైతే మరీ దారుణంగా ఎదుటి వారిని ఇబ్బంది పెడుతూ రాక్షసానందం పొందుతుంటారు. ఇంకొందరైతే ఇలాంటి ఘటనలను వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేసి మరీ పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, కొందరు ఆకతాయిలు రైలు పట్టాల పక్కన నిలబడి చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బీహార్‌లో (Bihar) చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. హోలీ అంటే సాధారణంగా ఎవరైనా తమ స్నేహితులు, బంధుమిత్రులతో కలిసి రంగులు చల్లుకుని సరదాగా గడుపుతారు. అయితే ఇటీవల ఈ వేడుకలు కొందరు ఆకతాయిల వల్ల పైశాచికత్వానికి దారి తీస్తున్నాయి. తాజాగా, బీహార్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. హోలీ పండుగ రోజు కొందరు ఆకతాయిలు కలిసి రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. వారి వద్ద ఆవు పేడతో పాటూ రంగు నీళ్ల బకెట్లు పెట్టుకున్నారు.
రైలు దగ్గరికి రాగానే అంతా ప్రయాణికులపై రంగు నీళ్లు పోశారు. ఒకరి తర్వాత ఒకరు బకెట్లలో నీళ్లు తీసుకుని, (Youths throw colored water on train passengers) నేరుగా రైల్లోని ప్రయాణికులపై పోశారు. మరికొందరు ఆవు పేడ తీసుకుని వారిపై విసిరేస్తున్నారు. ఇలా చేయడం తప్పు అని తెలిసి కూడా వారంతా ఏమాత్రం లెక్కచేయకుండా ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బీహార్‌లోని నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (NCIB) కూడా స్పందించింది. ‘రైళ్లపై బురద, మురికి నీరు, ఆవు పేడ విసిరేయడం నేరం. అధికారులు వారిని గుర్తించి జైలు శిక్షలు విధించాలి.. ఇలాంటి చర్యలు ప్రయాణికులు, రైల్వే సిబ్బందికి ప్రమాదాలు తెచ్చిపెడతాయి. పండుగలను ఆస్తి నష్టానికి సాకుగా ఉపయోగించకూడదు’.. అని పేర్కొంది.
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’.. అంటూ కొందరు, మరికొందరు ఈ పోస్ట్‌లో రైల్వే మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేసి.. ‘అధికారులు వారిని గుర్తించి అరెస్టు చేయాలి’.. అని కోరారు. ఇంకొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4300కి పైగా లైక్‌లు, 2.88 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
వీధిలో తాపీగా నడుస్తున్న పెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు..
రీల్ కోసం ప్రాణాలతో చెలగాటం.. రన్నింగ్ రైల్లో స్టంట్.. రెప్పపాటు కాలంలో..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..