Share News

అటుకులను ఇలా ప్యాకింగ్ చేస్తున్నారేంటీ.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Mar 06 , 2026 | 09:07 AM

ఇటీవల వివిధ రకాల ఆహార పదార్థాల తయారీకి సంబంధించిన వీడియోలు చూస్తూనే ఉన్నాం. కొన్నింటిని తయారు చేసే విధానం చూసినప్పుడు.. వామ్మో ఇన్నాళ్లూ వీటినేనా మనం తిన్నది.. అని అనిపిస్తుంటుంది. తాజాగా..

అటుకులను ఇలా ప్యాకింగ్ చేస్తున్నారేంటీ.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..

బయటి మార్కెట్లో ఏదైనా వంటకాలకు సంబంధించిన ప్యాకెట్లను చూస్తే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. చూడగానే కొనేద్దాం అనిపించేలా వాటిని తీర్చిదిద్ది ఉంటారు. అయితే కొన్ని ప్యాకేజింగ్‌ల వెనుక కార్మికులు చేసే పనులు చూస్తే.. వాటి తినాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. పైగా వాటిని ఎప్పుడు చూసినా అదే సీన్ గుర్తుకొస్తుంటుంది. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇటీవల వివిధ రకాల ఆహార పదార్థాల తయారీకి సంబంధించిన వీడియోలు చూస్తూనే ఉన్నాం. కొన్నింటిని తయారు చేసే విధానం చూసినప్పుడు.. వామ్మో ఇన్నాళ్లూ వీటినేనా మనం తిన్నది.. అని అనిపిస్తుంటుంది. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు కార్మికులు అటుకులను ప్యాకింగ్ చేసే విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు.


గుట్టగా పోసిన అటుకులను ఇద్దరు కార్మికులు ప్యాకింగ్ చేస్తున్నారు. అయితే వారిద్దరూ ఏకంగా అటుకులపై కూర్చుని మరీ ప్యాక్ చేస్తున్నారు. అటుకుల్లో కూర్చొన్న వ్యక్తి.. వాటిని కవర్‌లో వేసి, పక్కనే ఉన్న వ్యక్తికి ఇవ్వగా.. అతను దాన్ని తూకం వేసి ఆ వెంటనే మిషిన్ సాయంతో ప్యాక్ చేస్తున్నాడు. ప్యాక్ చేసే సమయంలో వారు ఇలా వాటిని తొక్కుతూ, వాటిపైనే కూర్చోవడం.. చూసేవారికి నచ్చడం లేదు.


ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘చూసినా నమ్మలేకపోతున్నాను, FSSAI ఏం చేస్తోంది?’ అంటూ కొందరు, ‘ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతోంది’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 680కి పైగా లైక్‌లు, లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..

కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 06 , 2026 | 09:10 AM