Share News

వరుడి సహనానికి పరీక్ష.. గిఫ్ట్ ప్యాక్ తెరవాలని చూడగా.. చివరకు ఏమైందో చూడండి..

ABN , Publish Date - Feb 28 , 2026 | 09:23 PM

వీడియో ప్రారంభంలో పెళ్లి వేదికపై వధూవరులు కూర్చుని ఉండగా.. అంతా సంతోషంగా జోకులు వేసుకుంటుంటారు. ఇంతలో కొందరు యువతులు అక్కడికి వచ్చి.. వరుడికి ఓ గిఫ్ట్ బాక్స్ అందించి, అక్కడే ఓపెన్ చేయమని పట్టుబట్టారు. దీంతో..

వరుడి సహనానికి పరీక్ష.. గిఫ్ట్ ప్యాక్ తెరవాలని చూడగా.. చివరకు ఏమైందో చూడండి..

పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలతో పాటూ వీడియోలు, రీల్స్ తప్పనిసరి అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఎక్కడ వివాహమైనా అందులో ఏదో ఒక సంఘటన వీడియో రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. వాటిలో కొన్ని నవ్విస్తే.. మరికొన్ని అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు యువతులు వరుడికి గిఫ్ట్ ఇచ్చి, అతడి సహనాన్ని పరీక్షించారు. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వీడియో ప్రారంభంలో పెళ్లి (marriage) వేదికపై వధూవరులు కూర్చుని ఉండగా.. అంతా సంతోషంగా జోకులు వేసుకుంటుంటారు. ఇంతలో కొందరు యువతులు అక్కడికి వచ్చి.. వరుడికి ఓ గిఫ్ట్ బాక్స్ అందించి, అక్కడే ఓపెన్ చేయమని పట్టుబట్టారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వరుడు గిఫ్ట్ బాక్స్‌ను ఓపెన్ చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే బాక్స్ ఓపెన్ చేసే కొద్దీ.. అందులో మరిన్ని ప్యాకింగ్‌లు బయటికి వస్తుంటాయి. ఇలా ఎన్ని తీసి చూసినా అందులో మరో ప్యాకింగ్ ఉంటుంది.


ఇలా చాలా సేపు ఆ వరుడు.. ఎంతో ఓపిగ్గా (Groom tries to open gift pack) గిఫ్ట్ ప్యాక్‌లు తెరిచాడు. అయితే ఎన్ని పొరలు చించేసినా కూడా అందులో ఉన్న గిఫ్ట్ ఏంటో కనిపించదు. దీంతో అప్పటిదాకా నవ్వుతూ ఉన్న ఆ వరుడి మొఖంలో ఒక్కసారిగా చిరాకు కనిపిస్తుంది. ‘ఛీ ఇదేం గిఫ్ట్‌రా నాయనా.. వీళ్లు నా ప్రాణం తీసేలా ఉన్నారు’.. అని మనసులో అనుకుంటూ దాన్ని దూరంగా విసిరి పడేశాడు. దీంతో అక్కడున్న వారంతా పగలబడి నవ్వుకున్నారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బహుమతి ఏముందో చూడకుండానే దాన్ని విసిరేయడం నెటిజన్లకు కూడా తెగ నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వరుడి సహనానికి ఇది పెద్ద పరీక్ష’.. అంటూ కొందరు, ‘ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 23 వేలకు పైగా లైక్‌‌లు, 2.8 మిలియన్లకు పైగా వ్యూ్‌స్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..

కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 28 , 2026 | 09:24 PM