Share News

శభాష్ చిన్నారీ.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న పిల్లలను ఎలా కాపాడిందో చూడండి..

ABN , Publish Date - Feb 21 , 2026 | 03:44 PM

ఓ అపార్ట్‌మెంట్‌లో నలుగురు పిల్లలు ఆడుకుంటున్నారు. వారిలో ఇద్దరు పిల్లలు అనుకోకుండా లిఫ్ట్‌లోకి వెళ్లారు. వారు లోపలికి వెళ్లగానే లిఫ్ట్ తలుపులు మూసుకుపోయాయి. అయితే అక్కడే ఉన్న బాలిక.. ఇది గమనించి వెంటనే..

శభాష్ చిన్నారీ.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న పిల్లలను ఎలా కాపాడిందో చూడండి..

సాటి మనిషి చచ్చిపోతున్నా కూడా కన్నెత్తి కూడా చూడని సమాజంలో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు పిల్లలు పెద్దవారికి కనువిప్పు కలిగిస్తుంటారు. అభంశుభం తెలియని చిన్న పిల్లలు కూడా.. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తుంటారు. కొందరైతే తమ ప్రాణాలకు తెగించి ఇతరుల ప్రాణాలను కాపాడుతుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ బాలిక ఇలాంటి పనే చేసింది. లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఇద్దరు చిన్నారులను.. తన ప్రాణాలకు తెగించి కాపాడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. శభాష్ చిన్నారీ.. అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు..


ఎక్కడ జరిగిందో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ అపార్ట్‌మెంట్‌లో నలుగురు పిల్లలు ఆడుకుంటున్నారు. వారిలో ఇద్దరు పిల్లలు అనుకోకుండా (Children stuck in the elevator) లిఫ్ట్‌లోకి వెళ్లారు. వారు లోపలికి వెళ్లగానే లిఫ్ట్ తలుపులు మూసుకుపోయాయి. అయితే అక్కడే ఉన్న బాలిక.. ఇది గమనించి వెంటనే తన కాలు, చేయిని లిఫ్ట్ డోర్ల మధ్యలో పెట్టింది. డోర్లు మూసుకుపోకుండా తన శాయశక్తులా ప్రయత్నించింది. లోపల ఉన్న ఇద్దరు చిన్నారుల్లో ఓ బాలిక.. తలుపులు తీయాలని ప్రయత్నించింది. కానీ చిన్న పిల్ల కావడంతో సాధ్యం కాలేదు.


ఇలా వారంతా తలుపులు తీసేందుకు ప్రయత్నించే క్రమంలో ప్రమాదాన్ని గమనించిన ఇద్దరు మహిళలు.. పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. చివరకు వారు లిఫ్ట్ డోర్స్‌ను నెట్టడంతో లోపల ఉన్న పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. అయితే మహిళలు వచ్చే వరకూ.. బాలిక ప్రయత్నించి ఉండకపోయి ఉంటే.. పెద్ద ప్రమాదం జరిగేది. ఎట్టకేలకు ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తన ప్రాణాలకు తెగించి చిన్నారులను కాపాడిన బాలికను అంతా అభినందిస్తున్నారు.


ఈ ఘటన మొత్తం లిఫ్ట్‌లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ బాలిక చేసిన సాహసానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే’.. అంటూ కొందరు, ‘లిఫ్ట్ తయారీలో లోపం ఉంది.. తయారీదారులను శిక్షించాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 30 వేలకు పైగా లైక్‌లు, 4.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

దాహం తీర్చుకోవడానికి వెళ్లి ప్రాణాలే పోగొట్టుకుందిగా..

ఓరి మీ దుంపతెగా.. చైనా వాళ్లు పిస్తా పప్పుతో ఎలా మోసం చేస్తున్నారో చూడండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 21 , 2026 | 03:44 PM