ఓరి మీ దుంపతెగా.. చైనా వాళ్లు పిస్తా పప్పుతో ఎలా మోసం చేస్తున్నారో చూడండి..
ABN , Publish Date - Feb 20 , 2026 | 09:09 PM
పిస్తా పప్పును ఎంతో కలర్‌ఫుల్‌గా ప్యాక్ చేశారు. ఈ ప్యాకింగ్ చూస్తే.. వెంటనే కొనేయాలి అనిపించేలా సెట్ చేశారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. దీని మాటున పెద్ద మోసం బయటపడింది. ప్యాకింగ్ ఓపెన్ చేయగానే..
చైనా అంటేనే వింత వింత ఆహారాలు, విచిత్ర రోగాలు గుర్తుకొస్తుంటాయి. ఇందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో నిత్యం ఇలాంటి వీడియోలు దర్శనమిస్తుంటాయి. అయితే అప్పుడప్పుడూ ఇంతకంటే విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చైనాకు సంబంధించిన ఓ పిస్తా పాకెట్ చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘ఓరి మీ దుంపలు తెగా.. ఇలాక్కూడా మోసం చేస్తున్నారా’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో చైనాకు సంబంధించిన పిస్తా ప్యాకెట్ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పిస్తా పప్పును (pistachio nut) ఎంతో కలర్‌ఫుల్‌గా ప్యాక్ చేశారు. ఈ ప్యాకింగ్ చూస్తే.. వెంటనే కొనేయాలి అనిపించేలా సెట్ చేశారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. దీని మాటున పెద్ద మోసం బయటపడింది. ప్యాకింగ్ ఓపెన్ చేయగానే.. లోపల ప్లాస్టిక్ బాక్స్‌లో (Pistachio packing box) పిస్తా పప్పును పెట్టారు. పైకి చూసేందుకు మాత్రం బాక్స్ మొత్తం పిస్తా పప్పు ఉందేమో అని అనుకుంటారు.
తీరా బాక్సును బయటికి తీసి చూస్తే.. పిస్తా పప్పును కేవలం పైన మాత్రమే అలంకరించారు. బాక్స్ కింద మొత్తం ఖాళీగా ఉంది. ఈ విషయం బాక్స్ మొత్తం బయటికి తీసి చూస్తే గానీ తెలీదు. ఇలా అందమైన ప్యాకింగ్ లోపల.. తమ మోసాన్ని దాచి పెట్టారన్నమాట. ఈ ప్యాకింగ్ ఓపెన్ చేసిన వారు షాకయ్యారు. అందరికీ ఈ విషయం తెలియాలనే ఉద్దేశంతో వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘చైనా మొత్తం నకిలీ, చౌక వస్తువులతో జీవిస్తోంది’.. అంటూ కొందరు, ‘ఇన్నాళ్లూ బిస్కట్లు, చాక్లెట్లే అనుకున్నాం.. ఇప్పుడు పిస్తా రూపంలో కూడా మోసం చేస్తు్న్నారన్నమాట’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్త రాసే సయమానికి వీడియో 190కి పైగా లైక్‌లు, 9 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
మందు కొడితే ఇలాగే ఉంటుందేమో.. సముద్రంలో చనిపోయిన తిమింగలంతో..
గేదెను చుట్టుముట్టిన సింహాల గుంపు.. ప్రాణం తీసే సమయంలో షాకింగ్ ట్విస్ట్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..