Share News

దాహం తీర్చుకోవడానికి వెళ్లి ప్రాణాలే పోగొట్టుకుందిగా.. చిరుత పులి నీరు తాగుతుండగా సడన్‌గా ఏమైందో చూడండి..

ABN , Publish Date - Feb 14 , 2026 | 06:59 PM

ఓ చిరుత పులికి బాగా దాహం వేయడంతో నీళ్లు తాగేందుకు నది ఒడ్డుకు వెళ్లింది. రోజూ లాగానే ఒడ్డున నిలబడి నీళ్లు తాగుతోంది. తీరా గుక్కెడు నీళ్లు కూడా తాగకముందే.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

దాహం తీర్చుకోవడానికి వెళ్లి ప్రాణాలే పోగొట్టుకుందిగా.. చిరుత పులి నీరు తాగుతుండగా సడన్‌గా ఏమైందో చూడండి..

అడవిలో అప్పుడప్పుడూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు కొన్ని జంతువులు.. మిగతా జంతువులపై ఆధిపత్యం చెలాయిస్తుంటాయి. అయితే అంతలోనే వాటికి షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. అప్పుడప్పుడూ ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తుంటుంది. ఇదంతా సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియే అయినా కూడా.. ఇలాంటి ఘటనలు నెటిజన్లను షాక్‌కు గురి చేస్తుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి సంఘటనలన్నీ వీడియోల రూపంలో నెట్టింట దర్శనమిస్తున్నాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ చిరుత పులి నీరు తాగుతుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘గుక్క నీటి కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుందిగా’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ చిరుత పులికి బాగా దాహం వేయడంతో నీళ్లు తాగేందుకు నది ఒడ్డుకు వెళ్లింది. రోజూ లాగానే ఒడ్డున నిలబడి నీళ్లు తాగుతోంది. తీరా గుక్కెడు నీళ్లు కూడా తాగకముందే.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆహారం కోసం అప్పటికే అక్కడ పొంచి ఉన్న మొసలి.. (Crocodile attacks leopard) చిరుతపై అమాంతం దాడి చేసింది.


నీటిలో నుంచి ఒక్కసారిగా గాల్లోకి లేచి చిరుతపులి మెడను పట్టుకుంది. ఆ వెంటనే నీటిలోకి లాగేసింది. మొసలి దాడితో ఉలిక్కిపడిన చిరుత.. తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ దానివల్ల సాధ్యం కాలేదు. ఈ ఘటన చూస్తుంటే.. మొసలి దాడిలో చిరుత ప్రాణాలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన పర్యాటకుల సమక్షంలోనే జరిగింది. కొందరు దీన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అడవిలో జంతువులు ఒకదానిపై ఒకటి వేటాడతాయి’., ‘ప్రశాంతమైన నీటి అడుగున ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది’.., ‘ప్రాణాలను ఫణంగా పెట్టి నీరు తాగాల్సిన పరిస్థితి’.. అంటూ కొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. వార్త రాస్తున్న సమాయానికి ఈ వీడియో 130కి పైగా లైక్‌లు, 14 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

మందు కొడితే ఇలాగే ఉంటుందేమో.. సముద్రంలో చనిపోయిన తిమింగలంతో..

గేదెను చుట్టుముట్టిన సింహాల గుంపు.. ప్రాణం తీసే సమయంలో షాకింగ్ ట్విస్ట్..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 14 , 2026 | 07:03 PM