పారిస్‌లో ఇలాక్కూడా ఉంటుందా.. ఈ యువతి పాట్లు చూస్తే కళ్లు తేలేస్తారు..
ABN , Publish Date - Feb 28 , 2026 | 06:35 PM
పారిస్‌కు చెందిన ఓ యువతి మార్కెట్‌లో కూల్ డ్రింక్‌తో పాటూ కొన్ని కూరగాయలు కూడా కొనింది. ఒక చేత్తో వాటిని పట్టుకుని, ఇంకో చేత్తో ఫోన్ కెమెరా ఆన్ చేసి తన ఇంటికి బయలుదేరింది. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది..
పారిస్ నగరం అంటేనే మనకు రొమాంటిక్, ఫ్యాషన్, ఐఫెల్ టవర్ తదితర ప్రాంతాలు గుర్తుకొస్తాయి. దీన్ని బట్టి ఆ ప్రాంతాల్లో అంతా లగ్జరీ లైఫ్‌ను అనుభవిస్తుంటారని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అక్కడ కూడా అనేక మంది అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి కొన్ని వస్తువులు కొనుక్కుని తన ఇంటికి బయలుదేరింది. అయితే ఇంటికి చేరుకోవడంలో ఆమెకు ఎదురైన ఇబ్బందులు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పారిస్‌కు (Paris women) చెందిన ఓ యువతి మార్కెట్‌లో కూల్ డ్రింక్‌తో పాటూ కొన్ని కూరగాయలు కూడా కొనింది. ఒక చేత్తో వాటిని పట్టుకుని, ఇంకో చేత్తో ఫోన్ కెమెరా ఆన్ చేసి తన ఇంటికి బయలుదేరింది. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. అపార్ట్‌మెంట్‌కు చేరుకున్న ఆ యువతి.. తన ఇంట్లోకి వెళ్లేందుకు (Narrow staircase in apartment) సన్నటి మార్గంలో చాలా ఎత్తుకు నడిచింది. అప్పటికీ తన ఇల్లు రాదు.
ఆ సన్నటి మెట్ల మార్గం మొత్తం పాము తరహాలో మెలికలు తిరిగినట్లు ఉంటుంది. దానిపై ఆమె ఎంతో ఓపిగ్గా నడుస్తూ వెళ్తుంది. ఇలా చాలా సేపు నడిచిన తర్వాత తన ఎట్టకేలకు తన ఇల్లు వస్తుంది. ఆ ఇల్లు కూడా ఎంతో ఇరుగ్గా ఉంటుంది. అతి కష్టం మీద డోరు తెరిచి ఇంట్లోకి వెళ్లింది. పారిస్‌లో అపార్ట్‌మెంట్ జీవితం, అక్కడి ఇళ్ల పరిస్థితికి ఈ వీడియో అద్దం పడుతున్నట్లుగా ఉంది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘హాస్యాస్పదంగా ఉంది.. కానీ రియల్ లైఫ్ స్ట్రగుల్ అంటే ఇదేనేమో’.. అంటూ కొందరు, ‘పారిస్‌లో ఇలాంటి పరిస్థితి ఉంటుందని ఊహించలేదు’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో ప్రస్తుతం 27 వేలకు పైగా లైక్‌లు, 4.1 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..
కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..