Share News

అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..

ABN , Publish Date - Feb 26 , 2026 | 08:05 PM

కేరళం త్రిస్సూర్ జిల్లాలోని అన్నమనాడ గ్రామంలోని మహాదేవ ఆలయం వద్ద భయానక సంఘటన చోటు చేసుకుంది. ఆలయ ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా..

అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..

ఏనుగులు చూసేందుకు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంటాయి. కామ్‌గా ఉన్నాయి కదా అని.. దగ్గరికి వెళ్తే కొన్నిసార్లు అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంటుంది. అప్పటిదాకా కామ్‌గా ఉన్న ఏనుగులు.. హఠాత్తుగా బీభత్సం సృష్టించడం తరచూ చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు మావట్లు, మరికొన్నిసార్లు పర్యాటకుల ప్రాణాలు పోయిన సందర్భాలను కూడా చూశాం. ఇలాంటి విషాద సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం దర్శనమిస్తూనే ఉంటాయి. తాజాగా, కేరళలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆలయ ఉత్సవాల్లో ఓ ఏనుగు చేసిన పనికి.. పూజారి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కేరళం (Kerala) త్రిస్సూర్ జిల్లాలోని అన్నమనాడ గ్రామంలోని మహాదేవ ఆలయం వద్ద భయానక సంఘటన చోటు చేసుకుంది. ఆలయ ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తు్న్నారు. ఈ సందర్భంగా చాలా ఏనుగులను సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దేవతా విగ్రహాన్ని ఊరేగింపునకు సిద్ధం చేసే క్రమంలో ఏనుగును అందంగా అలంకరించారు.


ఓ పూజారి ఏనుగుపై కూర్చోగా.. పక్కన ఉన్న వారు ఏనుగు పక్కనే నిలబడ్డారు. అయితే అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఏనుగు.. ఒక్కసారిగా రెచ్చిపోయింది. పక్కనే నిలబడ్డ పూజారిని తొండంతో (Elephant-Attack on Priest) పట్టుకుని గాల్లోకి లేపింది. ఆ తర్వాత.. అంతా చూస్తుండగానే అతన్ని దూరంగా విసిరేసింది. దీంతో అక్కడున్న వారంతా గట్టిగా కేకలు వేస్తూ దూరంగా పారిపోయారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తీవ్రగాయాలపాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


అయితే ప్రమాదం జరిగిన వెంటనే మావటిలు స్పందించి ఏనుగును నియంత్రించారు. లేదంటే మరింత మంది భక్తులు ప్రమాదంలో పడేవారు. ఏనుగుల ఊరేగింపులు కేరళలోని ఆలయాల్లో సంప్రదాయంగా నిర్వహిస్తుంటారు. అయితే ప్రస్తుతం చోటు చేసుకున్న ఘటన.. ఇలాంటి సమాయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. గాయపడ్డ పూజారి త్వరగా కోలుకోవాలని అంతా దేవుడిని ప్రార్థిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

పూరీలు చేయడం ఇంత ఈజీనా.. ఇతడి అతి తెలివి చూస్తే.. వావ్ అనాల్సిందే..

ఓరి మీ దుంపతెగా.. చైనా వాళ్లు పిస్తా పప్పుతో ఎలా మోసం చేస్తున్నారో చూడండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 26 , 2026 | 08:06 PM