పూరీలు చేయడం ఇంత ఈజీనా.. ఇతడి అతి తెలివి చూస్తే.. వావ్ అనాల్సిందే..
ABN , Publish Date - Feb 22 , 2026 | 05:24 PM
మహిళలు విచిత్రంగా వంట చేయడం, వింత వింత చిట్కాలను ట్రై చేయడం చూసి ఓ వ్యక్తి బాగా ఇన్‌స్పైర్ అయినట్లున్నాడు. పూరీలు చేయడంలో మహిళలను మించి ఏదైనా కొత్తగా చేయాలని ఫిక్స్ అయ్యాడు. చివరకు..
వంట గదిలో మహిళలు చిత్రవిచిత్ర ప్రయోగాలు చేయడం తరచూ చూస్తుంటాం. కొందరు మహిళలు వంట చేసే సమయంలో తెలివిగా వ్యవహరిస్తుంటారు. వంటను కష్టపడి కాకుండా సులభంగా చేసేందుకు ఏవేవో చిట్కాలు ట్రై చేస్తుంటారు. ఇలాంటి చిట్కాలు ఒకరిని మించి మరొకరు ట్రై చేస్తుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా, ఓ వ్యక్తి పూరీలు చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. తెలివిలో మహిళలకే షాకిచ్చాడుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మహిళలు విచిత్రంగా వంట చేయడం, వింత వింత చిట్కాలను ట్రై చేయడం చూసి ఓ వ్యక్తి బాగా ఇన్‌స్పైర్ అయినట్లున్నాడు. పూరీలు చేయడంలో (Puri making) మహిళలను మించి ఏదైనా కొత్తగా చేయాలని ఫిక్స్ అయ్యాడు. చివరకు అతడికి ఓ బంపర్ ఐడియా వచ్చింది. ఆలోచన వచ్చిందో తడవుగా ఆచరణలో పెట్టేశాడు. గోధుమ పిండిని ఉండలుగా చేసి సిద్ధంగా ఉంచుకున్నాడు.
సాధారణంగా ఎవరైనా పూరీలను చేసే సమయంలో పిండి ఉండలను కర్ర సాయంతో రుద్దుతూ వెడల్పు చేస్తుంటారు. అయితే ఇతడి దగ్గర పూరీల కర్ర లేకపోవడంతో దాని స్థానంలో గిన్నెను వాడేశాడు. గిన్నె అడుగు భాగాన్ని పిండి ఉండపై పెట్టి అటూ, ఇటూ తిప్పుతూ గట్టిగా నొక్కేశాడు. గిన్నెను పక్కకు తీసి చూడగా.. పిండి ఉండ కాస్తా పూరీలా వెడల్పుగా మారిపోయిందన్నమాట. ఇలా గిన్నె సాయంతో పూరీలను చకచకా చేసేశాడు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. ఐడియా మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘పూరీలను ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.5 మిలియన్లకు పైగా లైక్‌లు, 73 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
దాహం తీర్చుకోవడానికి వెళ్లి ప్రాణాలే పోగొట్టుకుందిగా..
ఓరి మీ దుంపతెగా.. చైనా వాళ్లు పిస్తా పప్పుతో ఎలా మోసం చేస్తున్నారో చూడండి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..