Share News

ఏవమ్మా రైల్లో ఏంటా పని.. ఈమె నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Feb 28 , 2026 | 05:45 PM

రైళ్లలో సాధారణంగా చాలా మంది సీట్ల కోసం పడరాని పాట్లన్నీ పడుతుంటారు. కొందరు తోసుకుంటూ తొక్కుకుంటూ సీట్లు సంపాదిస్తే.. మరికొందరు తాళ్లతో సొంతంగా ఊయల కట్టేసి అందులో నిద్రపోతుంటారు. అయితే ఇంకొందరు మాత్రం ప్రమాదకర పనులు చేస్తూ అందరికీ కోపం తెప్పిస్తుంటారు. తాజాగా,

ఏవమ్మా రైల్లో ఏంటా పని.. ఈమె నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..

రైళ్లలో చిత్రవిచిత్ర సంఘటనలు చోటు చేసుకోవడం ప్రస్తుతం సర్వసాధారణమైంది. కొందరు సీట్ల కోసం కుస్తీలు పడుతుంటే.. మరికొందరు స్టంట్స్ చేస్తూ చూపరులకు నవ్వు తెప్పిస్తుంటారు. ఇంకొందరు ప్రమాదకర పనులు చేస్తూ అందరికీ ఆగ్రహం తెప్పిస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఈ తరహా సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ రైల్లో చేసిన నిర్వాకం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారి వల్లే ప్రమాదాలు జరిగేది.. అంటూ మండిపడుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైళ్లలో సాధారణంగా చాలా మంది సీట్ల కోసం పడరాని పాట్లన్నీ పడుతుంటారు. కొందరు తోసుకుంటూ తొక్కుకుంటూ సీట్లు సంపాదిస్తే.. మరికొందరు తాళ్లతో సొంతంగా ఊయల కట్టేసి అందులో నిద్రపోతుంటారు. అయితే ఇంకొందరు మాత్రం ప్రమాదకర పనులు చేస్తూ అందరికీ కోపం తెప్పిస్తుంటారు. చార్జింగ్ పాయింట్ ఫోన్ల కోసం పెడితే.. చాలా మంది దాన్ని మిగతా పనులకు వాడుతుంటారు. తాజాగా ఓ మహిళ ఇలాగే చేసింది.


చార్జింగ్ పాయింట్‌‌ను నీరు వేడి చేసుకునేందుకు, (Woman boiling water in an electric kettle) టీ తయారు చేసేందుకు వాడింది. తన వెంట తెచ్చుకున్న ఎలక్ట్రిక్ కెటిల్‌ను బయటికి తీసి, దాని వైరును చార్జింగ్ పాయింట్‌కు కనెక్ట్ చేసింది. ఎంచక్కా అందులో నీళ్లు వేడి చేయడం, కాఫీ చేయడం వంటి పనులు చేసేసింది. ఫోన్ చార్జింగ్ పెట్టడానికి బదులుగా ఈమె చేసిన పని చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలాంటి వారి వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి’.. అంటూ కొందరు, ‘ఇలాంటి పనులు చేయడం అగ్నిప్రమాదానికి దారి తీస్తుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1,500కి పైగా లైక్‌లు, 40 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..

కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 28 , 2026 | 05:46 PM