Share News

కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..

ABN , Publish Date - Feb 22 , 2026 | 08:33 PM

పంజాబ్‌లోని లూథియానా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన మహిళ తన స్నేహితులతో కలిసి రాత్రి వేళ కారులో వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బైకుపై వచ్చిన దొంగలు.. కారు అద్దంపై గుడ్లు వేసి దోచుకోవాలని చూశారు. చివరకు ఏం జరిగిందంటే..

కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..

ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ఒంటి మీద వస్తువులను కూడా మాయం చేసే దొంగలు మన చుట్టూనే ఉంటారు. సులభంగా డబ్బులు దోచుకునేందుకు దొంగలు.. ఇటీవల వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. రాత్రి వేళల్లో వాహనాల అద్దాలపై గుడ్లు విసిరి దోచుకునే వాళ్లను కూడా మనం తరచూ చూస్తున్నాం. తాజాగా, పంజాబ్‌లో విదేశీ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. అయితే ఆమె ఏమాత్రం భయపడకుండా దొంగలను తరిమికొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. సదరు మహిళను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పంజాబ్‌లోని (Punjab) లూథియానా జిల్లాలోని డెహ్లాన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన 40 ఏళ్ల హర్జిందర్ కౌర్ (Australian woman) .. ఖన్నా ప్రాంత పరిధి దోరాహాలోని రాజ్‌గఢ్ గ్రామంలో ఉన్న తమ బంధువుల ఇంటికి.. తన స్నేహితులతో కలిసి రాత్రి వేళ కారులో బయలుదేరింది. అయితే మార్గ మధ్యలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బైకుపై వేగంగా వచ్చిన ఇద్దరు దొంగలు.. కారు విండ్‌షీల్డ్‌పై (Thieves threw eggs on car mirror) గుడ్లు విసిరి ఆపడానికి ప్రయత్నించారు.


కారు అద్దంపై గుడ్లు పడగానే లోపల ఉన్న వారంతా ఒక్కసారిగా భయపడిపోయారు. అయితే కారు నడుపుతున్న హర్జిందర్ కౌర్ మాత్రం ఏమాత్రం భయపడకుండా.. పక్కనే ఉన్న కత్తి తీసుకుంది. కారు ముందు వైపు బైకు ఆపుకొని ఉన్న దొంగల దగ్గరికి కత్తి పట్టుకుని ధైర్యంగా వెళ్లింది. దీంతో లోపల ఉన్న ఆమె స్నేహితులు.. వద్దు వద్దు అని గట్టిగా అరుస్తూ వారిస్తున్నారు. అయినా ఆమె మాత్రం భయపడకుండా కత్తితో వారి ముందుకు వెళ్లి బెదిరించింది. ఆమె చేతిలో కత్తి చూసి దొంగలు జడుసుకున్నారు. ఏమనుకున్నారో ఏమో గానీ.. కాసేపటి తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.


ఈ ఘటన మొత్తం వారి ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగల కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈమె ధైర్యానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే’.. అంటూ కొందరు, ‘ఇలాంటి దొంగలను కఠినంగా శిక్షించాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

దాహం తీర్చుకోవడానికి వెళ్లి ప్రాణాలే పోగొట్టుకుందిగా..

ఓరి మీ దుంపతెగా.. చైనా వాళ్లు పిస్తా పప్పుతో ఎలా మోసం చేస్తున్నారో చూడండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 22 , 2026 | 08:33 PM