Share News

తోడేళ్లకు చుక్కలు చూపించిన కుందేలు.. బతుకుపోరాటం అంటే ఇదేనేమో..

ABN , Publish Date - Feb 28 , 2026 | 04:28 PM

మంచుతో నిండిన మైదానంలో రెండు తోడేళ్లు ఆహారం కోసం వెతుకుతుంటాయి. ఈ క్రమంలో వాటికి ఓ కుందేలు కనిపించింది. కుందేలును చూడగానే తోడేళ్లు రెండూ దాడికి దిగేశాయి. అయితే తోడేళ్లు రావడం చూసి కుందేలు అలెర్ట్ అయింది. తోడేళ్లకు దొరక్కుండా..

తోడేళ్లకు చుక్కలు చూపించిన కుందేలు.. బతుకుపోరాటం అంటే ఇదేనేమో..

ప్రకృతి ఎంతో విచిత్రమైనది. ముఖ్యంగా అడవుల్లో జంతువుల మధ్య జరిగే సంఘటనలు చూసినప్పుడు ఇది నిజం అని అనిపిస్తుంటుంది. ఒక జంతువు మరో జంతువును వేటాడటం, తీరా నోటిదాకా వచ్చిన ఆహారం చేజారిపోవడం, కొన్ని చిన్న జంతువులు సైతం పెద్ద పెద్ద క్రూర మృగాల నుంచి తెలివిగా తప్పించుకోవడం.. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడం వల్ల ఇలాంటి సంఘటనలన్నీ వీడియోల రూపంలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా.. తోడేళ్లు, కుందేలుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మంచుతో నిండిన మైదానంలో రెండు తోడేళ్లు ఆహారం కోసం వెతుకుతుంటాయి. ఈ క్రమంలో వాటికి ఓ కుందేలు కనిపించింది. కుందేలును చూడగానే (wolves chasing the rabbit) తోడేళ్లు రెండూ దాడికి దిగేశాయి. అయితే తోడేళ్లు రావడం చూసి కుందేలు అలెర్ట్ అయింది. తోడేళ్లకు దొరక్కుండా పరుగులు తీసింది. తోడేళ్లు కూడా తమ శక్తికొద్దీ పరుగులు పెట్టి మరీ.. కుందేలును పట్టుకోవడానికి ప్రయత్నించాయి. అయినా కుందేలు వాటికి దొరక్కుండా అంతకంటే ఎక్కువ వేగంతో పరుగులు తీసింది.


ఈ క్రమంలో తోడేళ్లను తికమక పెట్టేందుకు.. కుందేలు జిగ్‌జాగ్ స్టైల్లో అటూ, ఇటూ పరుగెట్టింది. దీంతో దాన్ని పట్టుకోవడం తోడేళ్లకు ఎంతో కష్టమవుతుంది. అయినా కుందేలును పట్టుకోవడానికి అవి చాలా వరకూ ప్రయత్నించాయి. ఇలా వాటి మధ్య కిలోమీటర్ల మేర ఛేజింగ్ కొనసాగుతుంది. ఇలా చాలా దూరం వెళ్లిన తర్వాత.. కుందేలు తన వేగాన్ని మరింత పెంచుతుంది. ఈ క్రమంలో దాన్ని అందుకోవడం తోడేళ్లకు కష్టమవుతుంది. చివరకు ఈ బతుకు పోరాటంలో కుందేలుదే పైచేయి అవుతుంది. తోడేళ్లకు దూరంగా వెళ్లిపోయి.. (Rabbit that escaped from wolves) తన ప్రాణాలను కాపాడుకుంది.


ఈ ఛేజింగ్ సీన్‌ మొత్తం డ్రోన్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘కుందేలు బతుకుపోరాటం ఫలించింది’.. అంటూ కొందరు, ‘వావ్.. సినిమా సీన్‌కు మించిపోయేలా ఉంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 21 వేలకు పైగా లైక్‌లు, 1.8 మిలియన్లకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..

కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 28 , 2026 | 04:28 PM