ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా.. ఈ ఇంటి యజమాని ఏం చేశాడో చూడండి..
ABN , Publish Date - Feb 28 , 2026 | 07:41 PM
పంజాబ్‌కు చెందిన ఓ ఇంటి యజమాని చేసిన పని చూసి అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘ఈయన చేసిన పని ఎంతో గ్రేట్’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈయన చేసిన పనేంటో మీరే చూడండి..
ఇప్పుడిప్పుడే ఎండలు మొదలవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే అప్పుడే వేసవిని తలపించేలా ఎండలు మండిపోతున్నాయి. ఇంకొన్నిచోట్ల వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని చలివేంద్రాలు కూడా వెలుస్తు్న్నాయి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. పంజాబ్‌కు చెందిన ఓ ఇంటి యజమాని చేసిన పని చూసి అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘ఈయన చేసిన పని ఎంతో గ్రేట్’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పంజాబ్‌కు (Punjab) చెందిన ఓ ఇంటి యజమాని నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నాడు. వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని తన వంతు సాయంగా.. (Installing a water tap outside the house) ఇంటి బయట గోడ ముందు నీటి కుళాయి ఏర్పాటు చేశాడు. అందులో చల్లని నీళ్లు వచ్చేలా ఏర్పాట్లు చేశాడు.
దారిన వెళ్లే వాళ్లు ఆ కుళాయి వద్ద చల్లని నీళ్లు తాగి, బాటిళ్లలో కూడా పట్టుకెళ్లేలా వీలు కల్పించాడు. పంజాబ్‌లో ఉష్ణోగ్రతలు 40°C కి చేరిన ఈ సమయంలో ఇతను చేసిన ఈ పని ఎందరికో సాయంగా మారింది. దారిన వెళ్లే వాళ్తంతా చల్లని నీళ్లు తాగి, ఈ ఇంటి యజమానిని అభినందిస్తూ వెళ్తున్నారు. అందరూ ఇలాగే ఆలోచిస్తే.. వేసవిలో వాహనదారులు, పాదచారులకు నీటి ఇబ్బందులు ఉండవని మాట్లాడుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.‘ఈ ఇంటి యజమాని 7–8 సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నాడు’.. అంటూ కొందరు, ‘ఈయనను అంతా ఆదర్శంగా తీసుకోవాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6.47 లక్షలకు పైగా లైక్‌లు, 8.9 మిలియన్లకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..
కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..