నీటి ఒడ్డుకు వెళ్లిన బాలిక.. సమీపానికి వచ్చిన మొసలి.. చివరకు..
ABN , Publish Date - Mar 05 , 2026 | 09:51 AM
ఓ బాలిక నది ఒడ్డుకు వెళ్లి నీటిలో అడుగు పెట్టింది. ఇంతలో నీటిలో నుంచి ఓ మొసలి రయ్యిన బాలిక వద్దకు దూసుకొచ్చింది. మొసలి సమీపానికి రావడం చూసి భయంతో పారిపోవాల్సిన బాలిక.. అందుకు విరుద్ధంగా..
చిన్న పిల్లలు కొన్నిసార్లు పెద్ద పెద్ద పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇంకొన్నిసార్లు పెద్ద వారు కూడా చేయలేని పనులను ఎంతో సులభంగా చేసేస్తుంటారు. సోషల్ మీడియా ప్రపంచంలో ఇలాంటి వీడియోలు అనేకం దర్శనమిస్తుంటాయి. తాజాగా, ఓ బాలిక వీడియో.. అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. సదరు బాలిక నీటి ఒడ్డుకు వెళ్లగానే.. ఓ మొసలి వేగంగా ఈదుకుంటూ అక్కడికి వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మెక్సికోలోని గ్రామీణ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక నది ఒడ్డుకు వెళ్లి నీటిలో అడుగు పెట్టింది. ఇంతలో నీటిలో నుంచి ఓ మొసలి రయ్యిన బాలిక వద్దకు దూసుకొచ్చింది. మొసలి సమీపానికి రావడం చూసి భయంతో పారిపోవాల్సిన బాలిక.. అందుకు విరుద్ధంగా అక్కడే నిలబడింది. మొసలి కూడా ఆమెపై దాడి చేయాల్సింది పోయి విచిత్రంగా ప్రవర్తించింది.
మొసలి వద్ద నిలబడ్డ బాలిక అంతటితో ఆగకుండా.. దాని తలపై చేయి పెట్టి ప్రేమగా నిమిరింది. ఇలా ఆ బాలిక చాలా సేపు అక్కడే నిలబడి మొసలిపై (girl who bathed the crocodile) నీళ్లు పోస్తూ స్నానం చేయించింది. మొసలి కూడా ఆ బాలికను తన సంరక్షకురాలిగా అనుకుందే ఏమో గానీ.. ఎంతో కామ్‌గా ఉండిపోయింది. ఈ దృశ్యం చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ బాలిక చిన్నప్పటి నుంచి మొసలితో స్నేహం చేసినట్లు ఉంది’.. అంటూ కొందరు, ‘స్నానం చేయించిన తర్వాత మొసలిని భోజనానికి ఇంటికి తీసుకెళ్తుందేమో’.. అంటూ మరికొందరు, ‘మొసలితో చాలా జాగ్రత్తగా ఉండాలి’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.63 లక్షలకు పైగా లైక్‌లు, 10.2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..
కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..