Share News

ఈ వధువు వెరీ స్మార్ట్ గురూ.. పక్కనే ప్రమాదం జరిగినా ఎంత కూల్‌గా తప్పించుకుందంటే..

ABN , Publish Date - Mar 05 , 2026 | 08:44 AM

ఓ వివాహ కార్యక్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బంధువులంతా వధువును పెళ్లి మంటపంలోకి తీసుకొస్తున్నారు. వధువు చుట్టూ నిలబడిన యువకులు.. ప్రత్యేకంగా తయారు చేసిన పూలతో పందిరిని గొడుగులా పట్టుకుని తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో..

ఈ వధువు వెరీ స్మార్ట్ గురూ.. పక్కనే ప్రమాదం జరిగినా ఎంత కూల్‌గా తప్పించుకుందంటే..

పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు దీన్ని దృష్టిలో ఉంచుకుని పెళ్లిలో వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు. కొన్నిసార్లు ప్లాన్ చేసుకుని మరీ వీడియోలు చేస్తే.. మరికొన్నిసార్లు అనుకోకుండా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కళ్యాణ మంటపంలోకి వధువు వస్తుండగా.. పక్కనే ప్రమాదం జరిగింది. దీంతో చివరకు ఆమె ఏం చేసిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బంధువులంతా వధువును పెళ్లి మంటపంలోకి తీసుకొస్తున్నారు. వధువు చుట్టూ నిలబడిన యువకులు.. ప్రత్యేకంగా తయారు చేసిన పూలతో పందిరిని గొడుగులా పట్టుకుని తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో నలువైపులా క్రాకర్స్ పేలుస్తున్నారు. మూడు వైపులా క్రాకర్స్ సక్సెస్‌ఫుల్‌గానే పేలాయి. అయితే వెనుక ఓ మూల ఉన్న క్రాకర్ మాత్రం పేలలేదు. దీంతో అక్కడున్న యుువకుడు.. దాన్ని పరిశీలిస్తున్నాడు.


ఈ క్రమంలో ఆ క్రాకర్ పైకి కాకుండా కిందకు పేలడంతో (firecracker exploded next to the bride) ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడున్న వారు ఉలిక్కిపడి దూరంగా పరుగులు తీశారు. అంత జరిగినా కూడా మధ్యలో ఉన్న వధువులో ఏమాత్రం భయం కనిపించలేదు. పైగా రెండు అడుగులు వేగంగా ముందుకు వేసి, ఆ నిప్పు రవ్వల నుంచి చాకచక్యంగా తప్పించుకుంది.


ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.‘ఈ వధువు చాలా స్మార్ట్ గురూ’.. అంటూ కొందరు, ‘ప్రమాదం నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకుందిగా’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్త రాసే సమయానికి ఈ వీడియో 1400కి పైగా లైక్‌లు, 2.35 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..

కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 05 , 2026 | 08:48 AM