Share News

అవి తేనెటీగలురా అయ్యా.. ఇతడి నిర్వాకం చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Mar 05 , 2026 | 07:38 AM

సాధారణంగా తేనెటీగలను చూస్తే ఒంట్లో వణుకు పుడుతుంది. వెంటనే వాటికి దూరంగా పారిపోతారు. అయితే ఈ యువకుడు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించాడు. పెద్ద తేనెటీగల తుట్ట దగ్గరికి వెళ్లిన అతను.. ఏకంగా..

అవి తేనెటీగలురా అయ్యా.. ఇతడి నిర్వాకం చూస్తే షాకవ్వాల్సిందే..

సోషల్ మీడియా అంటే ఓ వింత ప్రపంచం అని చెప్పొచ్చు. ఇందులో వింతలు, విశేషాలు, తమషాలు, షాకింగ్ ఘటనలకు కొదవే ఉండదు. వీడియోను మించి మరో వీడియో కనిపిస్తుంటుంది. ఇలా.. స్క్రోల్ చేసే కొద్దీ వీడియోలు వస్తూనే ఉంటాయి. ఈ ప్రపంచంలోకి ఒక్కసారి అడుగుపెట్టిన వారు.. తిరిగి వెనక్కు వెళ్లడం చాలా కష్టమని చెప్పొచ్చు. ఈ క్రమంలో కొందరు ఎలాగైనా నెటిజన్ల దృష్టిని ఆకర్షించేందుకు ఏవేవో విన్యాసాలు చేస్తుంటారు. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు తేనెటీగలతో చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘వామ్మో.. ఇతడి విన్యాసాలు మామూలుగా లేవుగా’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా తేనెటీగలను చూస్తే ఒంట్లో వణుకు పుడుతుంది. వెంటనే వాటికి దూరంగా పారిపోతారు. అయితే ఈ యువకుడు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించాడు. పెద్ద తేనెటీగల తుట్ట దగ్గరికి వెళ్లిన అతను.. ఏకంగా చేత్తో ఈగలను పట్టుకున్నాడు. పట్టుకోవడమే కాదు.. తేనెటీగలను చేతినిండా తీసుకుని తలపై పోసుకున్నాడు.


ఈగలు తల చుట్టూ తిరుగుతున్నా కూడా అతడిలో (Bees circling around the head) మాత్రం కొంచెం కూడా భయం కనిపించలేదు. పైగా తలపై పూలు చల్లుకున్నట్లుగా నవ్వుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. ఇలా అతను తేనెటీగలతో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘భాయ్.. నీ కంటెంట్‌ను ఎవరూ కాపీ చేయలేరు’.. అంటూ కొందరు, ‘తేనెటీగలు అతడికి స్నేహితులేమో’.., ‘ఇతడి కంటెంట్ చాలా ఉన్నత స్థాయిలో ఉంది’.., ‘వామ్మో.. ఇది మామూలు స్టంట్ కాదుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 600కి పైగా లైక్‌లు, లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..

కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 05 , 2026 | 07:39 AM