ఇలాంటి వాడిని ఏమనాలి.. రైల్లో పైన కూర్చుని ఏం చేశాడో చూడండి..
ABN , Publish Date - Mar 05 , 2026 | 12:15 PM
రన్నింగ్ రైల్లో ఓ యువకుడు చేసిన పని.. అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. కదులుతున్న రైలులో పై బెర్త్‌పై ఓ యువకుడు కూర్చుని ఉన్నాడు. ఓ వ్యాపారి బోగీలో తినుంబండారాలు, వాటర్ బాటిల్స్ తదితరాలను విక్రయిస్తున్నాడు. ఇందులో విశేషమేమీ లేకున్నా కూడా..
రైలు ప్రయాణం ఎంత ఆహ్లాదాన్ని అందిస్తుందో.. జాగ్రత్తగా లేకపోతే అంతే స్థాయిలో ఛేదు అనుభవాన్ని కూడా మిగుల్చుతుంది. కొందరు తెలిసి, మరికొందరు తెలీక రైళ్లలో చిత్రవిచిత్రమైన పనులన్నీ చేస్తుంటారు. ఈ ఘటనలన్నీ వీడియోల రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతుంటాయి. వీటిలో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. కదులుతున్న రైల్లో పై బెర్త్‌లో కూర్చొన్న యువకుడు ఏం చేశాడో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రన్నింగ్ రైల్లో ఓ యువకుడు చేసిన పని.. అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. కదులుతున్న రైలులో పై బెర్త్‌పై ఓ యువకుడు కూర్చుని ఉన్నాడు. ఓ వ్యాపారి బోగీలో తినుబండారాలు, వాటర్ బాటిల్స్ తదితరాలను విక్రయిస్తున్నాడు. ఇందులో విశేషమేమీ లేకున్నా కూడా.. పై బెర్త్‌లో ఉన్న యువకుడు చేసిన పని.. వీడియో వైరల్ అవడానికి కారణమైంది.
పైకి అమాయకుడిగా కనిపిస్తున్న ఈ వ్యక్తి.. వ్యాపారి దగ్గరికి రాగానే పైనుంచి బుట్టలో చేయి పెట్టి కూల్‌డ్రింక్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత వ్యాపారి ముందుకు వెళ్లి.. కాసేపటి తర్వాత మళ్లీ వెనక్కు వచ్చాడు. దీంతో మళ్లీ అతను బుట్టలో (young man stole chips and cold drinks from merchant's basket) నుంచి ఆహారానికి సంబంధించిన బాక్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత వ్యాపారి అటుగా వచ్చినప్పుడల్లా చిప్స్ ప్యాకెట్, వాటర్ బాటిల్.. ఇలా తీసుకుంటూనే ఉన్నాడు. అతడి స్నేహితుడు ముందు బెర్త్‌పై కూర్చుని, మొత్తం సీన్‌ను వీడియో తీస్తున్నాడు. చివరగా ఆ యువకుడు కెమెరా వైపు చూసి.. ఏదో ఘన కార్యం చేసినట్లుగా స్మైల్ ఇచ్చాడు. ఇతడు చేసిన నిర్వాకం.. ప్రస్తుతం అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘పేద వ్యాపారిని ఇలా మోసం చేయడం అన్యాయం.. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’.. అంటూ కొందరు, ‘ఇలాంటి దొంగలను విడిచిపెట్టకూడదు.. రైల్వే అధికారులు ఏం చేస్తున్నారు?’ అంటూ మరికొందరు, ‘సోషల్ మీడియాలో వీడియోల కోసం ఇలాంటి దుర్మార్గులు.. ఎంతదూరమైనా వెళ్తారు’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం1600కి పైగా లైక్‌లు, 84 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..
కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..