Share News

వీధిలో తాపీగా నడుస్తున్న పెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Mar 06 , 2026 | 11:36 AM

ఓ పెద్ద పులి ఇళ్ల ముందు రోడ్డుపై తాపీగా నడుస్తూ వెళ్తోంది. ఇళ్ల ముందుకు పులి రావడాన్ని చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు దానికి దూరంగా పరుగెత్తారు. మరికొందరు..

వీధిలో తాపీగా నడుస్తున్న పెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు..

అడవుల్లో ఉండాల్సిన పులులు, సింహాలు.. అప్పుడప్పుడూ జనావాసాల్లోకి వస్తుంటాయి. కొన్నిసార్లు జంతువులపై దాడి చేసి వెళ్తే.. మరికొన్నిసార్లు ఏకంగా మనుషులపై కూడా దాడి చేస్తుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఎవరూ ఊహించని విధంగా విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పెద్ద పులి ఇళ్ల మధ్యలోకి వచ్చేసింది. అయితే చివరకు చోటు చేసుకున్న ఘటన చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన మెక్సికోలో (Mexico) చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ పెద్ద పులి ఇళ్ల ముందు రోడ్డుపై (Tiger walking in front of houses) తాపీగా నడుస్తూ వెళ్తోంది. ఇళ్ల ముందుకు పులి రావడాన్ని చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు దానికి దూరంగా పరుగెత్తారు. మరికొందరు దూరంగా నిలబడి.. ఈ దృశ్యాలను తమ ఫోన్లతో వీడియోలు తీసుకున్నారు. అయితే మనుషులను చూసినా కూడా ఆ పులి ఏమీ చేయకుండా తన దారిన తాను నడుస్తూ వెళ్తోంది.


కొంత దూరం వెళ్లిన తర్వాత.. రోడ్డు పక్కన చెట్టు కింద పడుకుంది. పులి ప్రవర్తన చూసి అక్కడున్న వారు షాక్ అయ్యే లోపు.. అంతా అవాక్కయ్యే ఘటన చోటు చేసుకుంది. కాసేపటి తర్వాత ఓ వ్యక్తి చేతిలో తాడుతో అక్కడికి వచ్చాడు. పులి వద్దకు రాగానే.. తన చేతిలోని తాడును దాని మెడకు తగిలించి లాక్కెళ్లాడు. పులి కూడా అతడిపై దాడి చేయాల్సింది పోయి.. వెనుకే పెంపుడు కుక్క తరహాలో నడుచుకుంటూ వెళ్లింది. ఈ సీన్ చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. చూస్తుంటే ఆ వ్యక్తి పులిని పెంచుకుంటున్నాడేమో అని అనిపిస్తోంది.


ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఎంత పెంపుడు పులి అయినా.. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి’.. అంటూ కొందరు, ‘పెంపుడు కుక్కలా మారిపోయిందిగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8,700కి పైగా లైక్‌లు, 5.98 లక్షలకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..

కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 06 , 2026 | 11:51 AM