వామ్మో.. జేబులు ఇంత ఈజీగా కత్తిరిస్తారా.. లైవ్‌లో డెమో చేసి చూపించాడుగా..
ABN , Publish Date - Mar 06 , 2026 | 10:31 AM
ఓ దొంగ పోలీసులకు దొరికిపోయాడు. అయితే స్టేషన్‌లో ఉన్న ఆ దొంగకు పోలీసులు ఓ పరీక్ష పెట్టారు. జేబులు ఎలా కత్తిరిస్తావో.. ఇక్కడ చేసి చూపించు అని ఆదేశించారు. దీంతో ఆ దొంగ తన వద్ద ఉన్న చిన్న కత్తిని బయటికి తీశాడు. అక్కడే ఉన్న..
రద్దీ ప్రదేశాల్లో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కూడా కొందరు దొంగలు.. జేబుల్లో పర్సులు మాయం చేస్తుంటారు. మన పక్కనే ఉంటూ ఏమాత్రం అనుమానం రాకుండా కత్తిరించేస్తుంటారు. తీరా డబ్బులు ఇద్దామని జేబులో చేయి పెడితే.. లోపల రంధ్రం తప్ప పర్సు కనిపించదు. అప్పటికి కానీ తెలీదు.. మన జేబు లూటీకి గరైందని. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడం వల్ల ఇలాంటి జేబు కటింగ్ చోరీలు వీడియోల రూపంలో నెట్టింట్లో దర్శనమిస్తుంటాయి. అయితే తాజాగా, ఓ దొంగ జేబులు ఎలా కత్తిరిస్తారో లైవ్‌లో చేసి చూపించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ముంబైలో (Mumbai) చోటు చేసుకుంది. ఓ దొంగ పోలీసులకు దొరికిపోయాడు. అయితే స్టేషన్‌లో ఉన్న ఆ దొంగకు పోలీసులు ఓ పరీక్ష పెట్టారు. జేబులు ఎలా కత్తిరిస్తావో.. ఇక్కడ చేసి చూపించు అని ఆదేశించారు. దీంతో ఆ దొంగ తన వద్ద ఉన్న చిన్న కత్తిని బయటికి తీశాడు. అక్కడే ఉన్న ఇంకో యువకుడి ప్యాంట్ వెనుక జేబును మెల్లిగా కత్తిరించడం స్టార్ట్ చేశాడు.
చూస్తుండగానే.. అతను జేబును ఎంతో (Thief cuts young man's pocket) చాకచక్యంగా కోసేశాడు. ఆ తర్వాత అందులోని పర్సును ఎలా తీసుకుంటారో చూపించాడు. జేబు కత్తిరించే సమయంలో దొంగలు.. అనుమానం రాకుండా ఎలా కత్తిరిస్తారనే విషయాన్ని పోలీసులకు వివరిస్తూ చేసి చూపించాడు. దొంగ చేసిన ఈ చోరీ చూసి పోలీసులే అవాక్కయ్యారు. ఈ వీడియో సోషలో మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఈ దొంగ టాలెంట్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఇలాంటి ట్రిక్స్ తెలుసుకుంటే.. జాగ్రత్తగా ఉండేందుకు వీలు ఉంటుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11 వేలకు పైగా లైక్‌లు, 1.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..
కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..