రీల్ కోసం ప్రాణాలతో చెలగాటం.. రన్నింగ్ రైల్లో స్టంట్.. రెప్పపాటు కాలంలో..
ABN , Publish Date - Mar 06 , 2026 | 01:57 PM
రన్నింగ్ రైల్లో డోర్ దగ్గర ఓ యువకుడు నిలబడి ఉన్నాడు. అతడి స్నేహితుడు ఫోన్ ఆన్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఆకట్టుకునే రీల్ చేయాలనే ఉద్దేశంతో ఆ యువకుడు రైలు డోర్ దగ్గర నిలబడి స్టైలిష్‌గా పోజ్ ఇస్తూ..
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కొన్ని క్షణాల ఫేమ్ కోసం.. యువత తమ ప్రాణాలనే ఫణంగా పెడుతోంది. ఇటీవల చాలా మంది బస్సులు, రైళ్లలో చేసే స్టంట్లు చివరకు విషాదాంతం అవుతున్నాయి. ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తున్నాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రన్నింగ్ రైల్లో ఓ యువకుడు వినూత్నంగా రీల్ చేయాలని ప్రయత్నించాడు. చివరికి ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రన్నింగ్ రైల్లో (Running train) డోర్ దగ్గర ఓ యువకుడు నిలబడి ఉన్నాడు. అతడి స్నేహితుడు ఫోన్ ఆన్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఆకట్టుకునే రీల్ చేయాలనే ఉద్దేశంతో ఆ యువకుడు రైలు డోర్ దగ్గర నిలబడి స్టైలిష్‌గా పోజ్ ఇస్తూ.. బయటికి వేలాడుతూ ఫోజులు ఇచ్చాడు.
వీడియో మరింత ఆకర్షణీయంగా ఉండాలనే ఉద్దేశంతో కాసేపటి తర్వాత చేతులూ ఊపుతూ మరింత కిందకు వేలాడాడు. ఈ క్రమంలో ఇనుప స్తంభం తలకు తగిలి ధబేల్‌మని కిందపడిపోయాడు. ఈ దృశ్యం వీడియోలో రికార్డ్ అయింది. స్నేహితుడు పడిపోవడంతో (Young man falls from running train) వీడియో తీస్తు్న్న వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇంతటితో ఈ వీడియో ముగిసింది. కిందపడ్డ వ్యక్తికి గాయాలేమైనా అయ్యాయా.. అతడి పరిస్థితి ఎలా ఉంది.. అనేది మాత్రం తెలియరాలేదు.
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘కొన్ని సెకన్ల వీడియో కోసం ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం అవసరమా’.. అంటూ కొందరు, ‘వీడియోల కోసం ఇలాంటి స్టంట్స్ ఎవరూ చేయకండి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 59 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..
కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..