బావిలో పడిపోయిన ఏనుగు.. చివరకు ఏమైందో మీరే చూడండి..

ABN, Publish Date - Mar 06 , 2026 | 12:41 PM

సోషల్ మీడియాలో ఏనుగు వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒడిశా రాష్ట్రంలోని కియోంఝర్ జిల్లా సదర్ బ్లాక్‌లోని బనజోడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద ఏనుగు అటవీ ప్రాంతం నుంచి బుధవారం రాత్రి ఈ గ్రామంలోకి వచ్చింది. అయితే ..

సోషల్ మీడియాలో ఏనుగు వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఒడిశా (Odisha) రాష్ట్రంలోని కియోంఝర్ జిల్లా సదర్ బ్లాక్‌లోని బనజోడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద ఏనుగు అటవీ ప్రాంతం నుంచి బుధవారం రాత్రి ఈ గ్రామంలోకి వచ్చింది. అయితే ప్రమాదవశాత్తు (elephant fell into well) లోతైన బావిలో పడిపోయింది. దాన్నుంచి బయటపడే వీలు లేకపోవడంతో రాత్రంతా అందులోనే అటూ, ఇటూ తిరుగుతోంది.


ఉదయం ఏనుగును గమనించిన స్థానికులు.. అటవీ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వారు.. బావిని పరిశీలించారు. బావి సుమారు 20 నుంచి 30 అడుగుల లోతు ఉండడంతో ఏనుగును బయటికి తీయడం కష్టంగా మారింది. చివరకు జేసీబీని తెప్పించి బావి పక్కనే 10 అడుగుల లోతులో ఒక కందకం తవ్వించారు. సుమారు 6 గంటల పాటు శ్రమించి.. చివరకు ఎలాగోలా ఏనుగును బావి నుంచి బయటికి తీశారు.


అయితే ఏనుగు అటవీ ప్రాంతంలోకి వెళ్లే క్రమంలో వాహనాలపై దాడి చేసింది. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు గాయపడ్డారు. చివరకు ఏనుగు అడవిలోకి వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలాఉండగా, బావికి సంబంధించిన యజమానుల ఇంట్లో గురువారం వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఏనుగు తమ బావి వద్దకు రావడాన్ని శుభ సంకేతంగా భావిస్తున్నారు. కాగా, ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..

కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 06 , 2026 | 01:03 PM