మండుటెండలో రోడ్డుపై షాకింగ్ సీన్.. మొసళ్ల నిర్వాకం చూసి అంతా షాక్..
ABN , Publish Date - Mar 07 , 2026 | 09:33 AM
గుజరాత్‌లోని వడోదరలో హోలీ పండుగ రోజున ఈ ఘటన చోటు చేసుకుంది. ఎండలు మండుతుండడంతో రోడ్డుపై జనాల రద్దీ తక్కువైంది. కనీసం పాదచారులు కూడా కనిపించలేదు. అయితే ఈ సమయంలో అనుకోకుండా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
జన సంచార ప్రాంతాల్లో అప్పుడప్పుడూ పులులు, సింహాలు, ఏనుగులు సంచరించడం సర్వసాధారణం. కొన్నిసార్లు సంచరించడమే కాకుండా దాడులు చేస్తూ అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తుంటాయి. మరికొన్నిసార్లు కామ్‌గా ఉంటూ అందరికీ షాక్ ఇస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మండుటెంలో రెండు మొసళ్లు రోడ్డుపై కనిపించాయి. తాపీగా పాకుతూ వెళ్లడాన్ని చూసి అంతా షాక్ అయ్యారు. చివరకు ఏమైందంటే.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని (Gujarat) వడోదరలో హోలీ పండుగ రోజున ఈ ఘటన చోటు చేసుకుంది. ఎండలు మండుతుండడంతో రోడ్డుపై జనాల రద్దీ తక్కువైంది. కనీసం పాదచారులు కూడా కనిపించలేదు. అయితే ఈ సమయంలో అనుకోకుండా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో గానీ.. హఠాత్తుగా రెండు మొసళ్లు రోడ్డు పైకి వచ్చాయి. ఒకదాని తర్వాత మరోటి రావడం అందరినీ ఆశ్చర్యానిరికి గురి చేసింది.
రెండూ కలిసి రోడ్డుపై పాదయాత్ర తరహాలో (Crocodiles crawling on the road) తాపీగా పాకుతూ వెళ్తున్నాయి. ఇలా చాలా దూరం వరకూ వెళ్లాయి. రోడ్డుపై వాహనాలకు బదులుగా భారీ మొసళ్లు కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. అక్కడికి చేరుకుని వాటిని సురక్షితంగా నీటిలో వదిలేశారు. మొసళ్ల కారణంగా ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘గుజరాత్‌లో మొసళ్లు, సింహాలు.. ధైర్యంగా వీధుల్లోనే తిరుగుతంటాయి’.. అంటూ కొందరు, ‘వడోదరలో మొసళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. దీన్ని బట్టి వడోదర పేరును మార్చాలి’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 499కి పైగా లైక్‌లు, 30 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
వీధిలో తాపీగా నడుస్తున్న పెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు..
రీల్ కోసం ప్రాణాలతో చెలగాటం.. రన్నింగ్ రైల్లో స్టంట్.. రెప్పపాటు కాలంలో..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..