Share News

కుక్కతో పెద్ద చిక్కే వచ్చిందిగా.. వాకింగ్‌కు తీసుకెళ్లిన యజమాని పరిస్థితి చివరకు..

ABN , Publish Date - Mar 07 , 2026 | 11:23 AM

ఓ వ్యక్తి. తన పెంపుడు కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లాడు. అదే సమయంలో అపార్ట్‌మెంట్‌ ముందు ఖాళీ స్థలంలో సీనియర్ సిటిజన్లు వ్యాయామం చేస్తున్నారు. తరుణ్ తన కుక్కను వారు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లాడు. అదే సమయంలో..

కుక్కతో పెద్ద చిక్కే వచ్చిందిగా.. వాకింగ్‌కు తీసుకెళ్లిన యజమాని పరిస్థితి చివరకు..

ప్రస్తుతం ప్రతి ఇంట్లో పెంపుడు కుక్క ఉండడం సర్వసాధారణమైంది. పెంపుడు కుక్కల కారణంగా యజమానులకు అనేక రకాల లాభాలు ఉన్నా.. కొన్నిసార్లు ఊహించని సమస్యలు వచ్చి పడుతుంటాయి. తాజాగా, బెంగళూరులో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ వ్యక్తి తన కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లాడు. ఇదే అతడికి సమస్యలు తెచ్చి పెట్టింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బెంగళూరు (Bangalore) వర్తూరు ప్రాంతంలోని బ్రిగేడ్ యుటోపియా అపార్ట్‌మెంట్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. తరుణ్ అరోరా అనే వ్యక్తి.. తన పెంపుడు కుక్కను(man taking pet dog for walk) వాకింగ్‌కు తీసుకెళ్లాడు. అదే సమయంలో అపార్ట్‌మెంట్‌ ముందు ఖాళీ స్థలంలో సీనియర్ సిటిజన్లు వ్యాయామం చేస్తున్నారు. తరుణ్ తన కుక్కను వారు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లాడు. అదే సమయంలో ఆ కుక్క మూత్ర విసర్జన చేసింది. ఇది గమనించిన సీనియర్ సిటిజన్లు.. ఈ ప్రాంతంలోకి కుక్కను ఎందుకు తీసుకొచ్చావ్.. నీకు అనుమతి ఎవరిచ్చారంటూ అతడితో గొడవకు దిగారు. దీంతో ఆ వ్యక్తి వారిని తన ఫోన్‌తో వీడియో తీయడం స్టార్ట్ చేశాడు.


అప్పటికే ఆగ్రహంతో ఉన్న సీనియర్ సిటిజన్లు.. అతడి ఫోన్‌ను విసిరేసి, (Senior citizens attacked man) మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ క్రమంలో కొందరు కాళ్లతో తన్నగా.. మరికొందరు ఆ వ్యక్తిపై పిడిగుద్దులు కురిపించారు. వారి నుంచి తప్పించుకుని వెళ్లిన తరుణ్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అతడిపై కూడా సీనియర్ సిటిజన్లు ఫిర్యాదు చేశారు. కుక్క మూత్ర విసర్జన చేయడంతో తాము ప్రశ్నించామని, అయితే తమ పట్ల అతను దురుసుగా ప్రవర్తించాడంటూ ఆరోపించారు. ఇరువైపు ఫిర్యాదులు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


కాగా, దాడి ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘కుక్క మూత్ర విసర్జన చేసిందని.. దాడులు చేయడం కరెక్ట్ కాదు’.. అంటూ కొందరు, ‘మీకు ఇబ్బంది అనిపిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి గానీ.. ఇలా దాడులకు దిగకూడదు’.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 155 మందికి పైగా లైక్ చేయగా.. 29 వేలకు పైగా వీక్షించారు.


ఇవి కూడా చదవండి..

వీధిలో తాపీగా నడుస్తున్న పెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు..

రీల్ కోసం ప్రాణాలతో చెలగాటం.. రన్నింగ్ రైల్లో స్టంట్.. రెప్పపాటు కాలంలో..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 07 , 2026 | 11:24 AM