కుందేలు కోసం చిరుత మాస్టర్ ప్లాన్.. ఎంత తెలివిగా దాడి చేసిందో చూస్తే..
ABN , Publish Date - Mar 08 , 2026 | 01:32 PM
ఆకలితో ఉన్న ఓ చిరుత పులి.. వేట కోసం వేచి చూస్తుంటుంది. ఇంతలో దానికి దూరంగా ఓ కుందేలు కనిపించింది. ఎలాగైనా ఈ పూటకు ఈ కుందేలుతో సరిపెట్టుకోవాలి.. అని అనుకుంటూ ఫిక్స్ అయింది. అయితే..
అడవుల్లో నిరంతరం చావుబతుకుల పోరాటం నడుస్తుంటుంది. ఆకలి తీర్చుకునే క్రమంలో క్రూర జంతువులన్నీ మిగతా జంతువులను టార్గెట్ చేస్తుంటాయి. కొన్నిసార్లు నేరుగా వెళ్లి దాడి చేస్తే.. మరికొన్నిసార్లు పొదల మాటున దాక్కుని మరీ ఎంతో తెలివిగా దాడి చేస్తుంటాయి. కొన్నిసార్లు వాటి వేట విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ చిరుత పులి వేటకు సంబంధించిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ చిరుత పులి.. వేట కోసం వేచి చూస్తుంటుంది. ఇంతలో దానికి దూరంగా ఓ కుందేలు కనిపించింది. ఎలాగైనా ఈ పూటకు ఈ కుందేలుతో సరిపెట్టుకోవాలి.. అని అనుకుంటూ ఫిక్స్ అయింది. అయితే నేరుగా పరుగెత్తుతూ వెళ్లి దాడి చేస్తే.. కుందేలు పారిపోతుందనే ఉద్దేశంతో బుర్రకు పదును పెట్టింది. చిన్న అనుమానం కూడా రాకుండా నేలపై పడుకుని పాకుతూ.. పాకుతూ ముందుకు వెళ్లింది.
అడవుల్లో ప్రతి క్షణం జీవన్మరణ పోరాటమే. బలం మాత్రమే కాదు, తెలివి, ఓర్పు, సరైన సమయాన్ని గుర్తించే నైపుణ్యం కూడా అక్కడ జీవించడానికి అత్యంత అవసరం. ఇటీవల ఒక స్త్రీ చిరుతపులి తన అద్భుతమైన వేటా విధానాన్ని చూపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలా గడ్డి పొదల మాటున నక్కి నక్కి ముందుకు పాకుతూ వెళ్లింది. కుందేలుకు దగ్గరగా వెళ్లిన చిరుత.. కాసేపు ఆగి అదును కోసం వేచి చూసింది.
కుందేలు ఏమరపాటులో ఉన్న సమయంలో చిరుత.. (Leopard attacking a rabbit) ఒక్కసారిగా మెరుపు దాడి చేసింది. నేరుగా వెళ్లి కుందేలు మెడ పట్టుకుంది. దీంతో కుందేలుకు పారిపోయే అవకాశం కూడా రాలేదు. చిరుత నోట చిక్కిన కుందేలు.. తప్పించుకునేందుకు చాలా సేపు ప్రయత్నించింది. కానీ ఒక్కసారి చిరుత నోటికి చిక్కిన జంతువు.. తప్పించుకోవడం అసాధ్యం. ఇలా ఆ కుందేలుకు చిరుతకు ఆహారమవ్వాల్సి వచ్చింది. ఆ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరిగింది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘చిరుత తెలివి మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘కుందేలు చనిపోవడం బాధగా ఉన్నా.. అడవిలో ఇలాంటివి సర్వసాధారణం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4.3 లక్షలకు పైగా వ్యూస్, 6,800కి పైగా లైక్స్, 1000కి పైగా రీపోస్టులను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
వీధిలో తాపీగా నడుస్తున్న పెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు..
రీల్ కోసం ప్రాణాలతో చెలగాటం.. రన్నింగ్ రైల్లో స్టంట్.. రెప్పపాటు కాలంలో..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..