ఆకట్టుకుంటున్న మహిళా పైలట్.. విమాన కాక్‌పిట్ డోరు తెరిచి మరీ..
ABN , Publish Date - Mar 07 , 2026 | 01:36 PM
ఓ విమానం రన్‌వేలో ఆగి ఉంది. ఈ క్రమంలో కాక్‌పిట్‌లో కూర్చున్న మహిళా పైలట్.. ఉన్నట్టుండి కిటికీ డోర్‌ను తెరిచింది. తర్వాత చేతులు బయటికి చాచి.. ప్రయాణికులను స్వాగతిస్తుంది. ఆ వెంటనే..
సోషల్ మీడియాలో వినోదం, వింతలకు కొదవే ఉండదు. కొన్ని వీడియోలు అందరినీ నవ్విస్తే.. మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలైతే.. ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఓ మహిళా పైలట్.. విమాన కాక్‌పిట్ కిటికీ నుంచి చేతులు బయటకి పెట్టి ప్రయాణికులను విష్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు పైలెట్‌పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ విమానం రన్‌వేలో ఆగి ఉంది. ఈ క్రమంలో కాక్‌పిట్‌లో కూర్చున్న (Female pilot in the airplane cockpit) మహిళా పైలట్.. ఉన్నట్టుండి కిటికీ డోర్‌ను తెరిచింది. తర్వాత చేతులు బయటికి చాచి.. ప్రయాణికులను స్వాగతిస్తుంది. ఆ వెంటనే చేతులతో హార్ట్ సింబల్ చూపిస్తూ.. ప్రయాణికులపై తన ప్రేమను వ్యక్త పరిచింది.
పైలట్‌ను చూసి ప్రయాణికులు, గ్రౌండ్ స్టాఫ్ మొత్తం సంతోషంగా చప్పట్లు కొట్టారు. చివరగా.. ఆమె కెమెరాకు ముద్దు పెడుతూ.. విమాన ప్రయాణాన్ని మరింత స్పెషల్‌గా మార్చింది. వృత్తి పట్ల అంకితభావం, ప్రయాణికుల పట్ల గౌరవం చూపిస్తూ.. ఈ పైలట్ చేసిన నిర్వాకం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలాంటి పైలట్‌లు ఉంటే ప్రయాణం ఎంతో ఎక్సైటింగ్‌గా ఉంటుంది’.. అంటూ కొందరు, ‘ఈ మహిళా పైలట్ హృదయాలు గెలుచుకుంది’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 27 వేలకు పైగా లైక్‌లు, 3.74 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
వీధిలో తాపీగా నడుస్తున్న పెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు..
రీల్ కోసం ప్రాణాలతో చెలగాటం.. రన్నింగ్ రైల్లో స్టంట్.. రెప్పపాటు కాలంలో..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..