హుందాగా వెళ్లి చివరకు ఇలాంటి పనులేంటీ.. వీళ్ల నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Mar 08 , 2026 | 09:31 AM
ఉత్తరప్రదేశ్ నోయిడా నగరంలోని శివాలిక్ పార్క్‌లో అంతా అవాక్కయ్యే ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న పార్క్‌లో పూల ప్రదర్శన నిర్వహించారు. పూలను చూసేందుకు చాలా మంది తరలివచ్చారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..
కొందరు పైకి హుందాగా కనిపించినా.. పెళ్లిళ్లు తదితర శుభకార్యాల్లో తమ కక్కుర్తిని బయటపెడుతుంటారు. భోజనాల కోసం ఎగబడడం, ప్లేట్లు గ్లాసులను చోరీ చేయడం, కార్లు ఆపి మరీ రోడ్ల పక్కన పూల కుండీలను చోరీ చేయడం తదితర సంఘటలను చూస్తుంటాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పూల ప్రదర్శనను చూడటానికి వచ్చిన పర్యాటకులు.. చివరకు ఏం చేశారో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) నోయిడా నగరంలోని శివాలిక్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా జరుగుతున్న బహిరంగ పూల ప్రదర్శనలో కొన్ని వందల రకాల పూలను ప్రదర్శనగా ఉంచారు. వీటిని చూసేందుకు చాలా మంది తరలివచ్చారు. అంతా పార్క్‌లో కలియ తిరుగుతూ పూలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. అంతవరకూ పూలను ఆసక్తిగా తిలకించినా వారంతా.. కార్యక్రమం చివర్లో దొంగల్లా మారిపోయారు.
అంతా ఎవరికి దొరికిన పూలను వారు లాక్కెళ్లిపోయారు. కొందరైతే చెట్ల పైకి ఎక్కి మరీ... వాటికి వేలాడదీసిన పూలను (People stole flowers) లాగేసుకున్నారు. విచిత్రం ఏంటంటే... మంచి దుస్తులు ధరించి, హుందాగా కనిపించిన వారు సైతం.. పూలను చోరీ చేయడం చూసి అంతా అవాక్కయ్యారు. వీరే కాదు.. ఖరీదైన కార్లలో వచ్చిన వారు కూడా దొరికిన మేరకు పూలు లాక్కునిపోయారు. వీరి కక్కుర్తిని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘డబ్బుతో లగ్జరీ కార్లు కొనవచ్చు కానీ.. బాధ్యతను కొనలేరు’... అంటూ కొందరు, ‘వాళ్లు పూలను చోరీ చేయలేదు.. సేకరణ చేస్తున్నారు.. అపార్థం చేసుకుంటే ఎలా’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1400కి పైగా లైక్‌లు, 1.56 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
వీధిలో తాపీగా నడుస్తున్న పెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు..
రీల్ కోసం ప్రాణాలతో చెలగాటం.. రన్నింగ్ రైల్లో స్టంట్.. రెప్పపాటు కాలంలో..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..