వావ్..! వాట్ ఎ టాలెంట్.. ఈ డ్రైవర్ పనితనం చూస్తే శభాష్ అనాల్సిందే..
ABN , Publish Date - Mar 08 , 2026 | 04:03 PM
హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లాలోని ఒక పర్వత మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దారి మధ్యలో 50 అడుగుల లోయ అడ్డుగా ఉంది. ఈ మార్గంలో బొలేరో వాహనంలో వెళ్లిన వారు.. లోయను విధిగా దాటాల్సి వచ్చింది. లోయ వద్దకు రాగానే వాహనం ఆగిపోయింది. చివరకు ఏమైందో చూడంది..
డ్రైవింగ్ అంటే ఓ కళ. ఇది అందరికీ సాధ్యం కాదు. కొందరు ఏమాత్రం అవగాహన లేకుండా వాహనాలు తీసుకుని రోడ్ల పైకి వస్తుంటారు. ఇంకొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ వారు ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. అయితే కొద్ది మంది మాత్రం డ్రైవింగ్‌లో అద్భుతాలు సృష్టిస్తుంటారు. వాహనాలను ఎంతో చాకచక్యంగా నడుపుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ డ్రైవర్ కొండపై వాహనాన్ని లోయ దాటించడాన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. డ్రైవర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
సోషల్ మీడియలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) మండి జిల్లాలోని ఒక పర్వత మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దారి మధ్యలో 50 అడుగుల లోయ అడ్డుగా ఉంది. ఇక్కడ బ్రిడ్జి నిర్మించాల్సి ఉండడంతో 8 నెలలుగా ఈ రోడ్డును మూసేశారు. ఈ మార్గంలో బొలేరో వాహనంలో వెళ్లిన వారు.. లోయను విధిగా దాటాల్సి వచ్చింది. లోయ వద్దకు రాగానే వాహనం ఆగిపోయింది. ఎలాగైనా అవతలి వైపునకు తీసుకెళ్లాలనే ఉద్దే్శంతో వారంతా కలిసి రెండు పొడవాటి ఇనుప కమ్మీలను లోయకు రెండు వైపులా జాయింట్ చేశారు.
ఆ ఇనుప కమ్మీలపై బొలేరో వాహనం ప్రయాణించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఏమాత్రం అదుపు తప్పినా నేరుగా లోయలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే ఆ డ్రైవర్ మాత్రం ధైర్యంగా ముందుకు కదిలించాడు. రెండు ఇనుప కమ్మీలపై సరిగ్గా టైర్లను ఎక్కించి.. అటూ, ఇటూ పోకుండా చాకచక్యంగా వ్యవహరించాడు. ఎంతో బ్యాలెన్స్‌గా మెల్లిగా అవతలి వైపు నుంచి (jeep traveled on iron rails) ఇవతలి వైపునకు చేరుకున్నాడు. ఓ వ్యక్తి డ్రైవర్‌కు దిశానిర్దేశం చేసినా కూడా అతడికి ఎంతో అనుభవం ఉండడం వల్ల ఇది సాధ్యమైంది.
ఇలా చూస్తుండగానే ఆ వాహనం లోయను సులభంగా దాటేసిందన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ డ్రైవర్‌ను హార్ట్‌ఫెల్ట్ కాంగ్రాట్స్! అతని స్కిల్స్ చూసి మా ఊపిరి ఆగిపోయింది’.. అంటూ కొందరు, ‘హిమాచల్ లేదా ఉత్తరాఖండ్ డ్రైవర్ అయితేనే ఇలా టాలెంట్‌గా నడుపగలడు’.. అంటూ మరికొందరు, ‘ఇలాంటి మార్గాల్లో బ్రడ్జి పనులు ఇంత ఆలస్యం చేయడం దారుణం’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 33 వేలకు పైగా లైక్‌లు, 7.8 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
వీధిలో తాపీగా నడుస్తున్న పెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు..
రీల్ కోసం ప్రాణాలతో చెలగాటం.. రన్నింగ్ రైల్లో స్టంట్.. రెప్పపాటు కాలంలో..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..