Share News

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే

ABN , Publish Date - Mar 12 , 2026 | 10:17 AM

అంతర్జాతీయంగా అనిశ్చితి కారణంగా గత రెండు రోజులు పెరిగిన బంగారం, వెండి ధరలు యూటర్న్ తీసుకున్నాయి. గురువారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే
gold and silver rates today

అంతర్జాతీయంగా అనిశ్చితి కారణంగా గత రెండు రోజులు పెరిగిన బంగారం, వెండి ధరలు యూటర్న్ తీసుకున్నాయి. గురువారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడమే దీనికి కారణంగా కనిపిస్తోంది (Gold prices).


ఈ రోజు (మార్చి 12న) ఉదయం 10:10 గంటల సమయంలో హైదారాబాద్ బులియన్ మార్కె‌ట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,62,220కు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే దాదాపు రూ.1090 మేర తగ్గుదల నమోదు చేసింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,700 దగ్గర ఉంది (live gold rates). నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.1000 మేర తగ్గింది.


మరోవైపు వెండి ధరలు కూడా గురువారం భారీగా తగ్గాయి. కిలోకు రూ.10 వేల మేర తగ్గుదల నమోదు చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.80 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.9 లక్షలుగా ఉంది.

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి..

స్థిరంగా బంగారం, స్వల్పంగా తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..


ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు.. కూతురితో కలిసి వీక్షించిన కిమ్..

Updated Date - Mar 12 , 2026 | 10:39 AM