Share News

రూ.581 కోట్ల రిలయన్స్‌ గ్రూప్‌ ఆస్తులు జప్తు

ABN , Publish Date - Mar 13 , 2026 | 02:28 AM

రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌హెచ్‌ఎ్‌ఫఎల్‌), రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎ్‌ఫఎల్‌) కంపెనీలపై...

రూ.581 కోట్ల రిలయన్స్‌ గ్రూప్‌ ఆస్తులు జప్తు

న్యూఢిల్లీ: రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌హెచ్‌ఎ్‌ఫఎల్‌), రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎ్‌ఫఎల్‌) కంపెనీలపై జరుగుతున్న దర్యాప్తు లో భాగంగా తాజాగా రూ.581 కోట్లకు పైబడిన విలువ గల ఆస్తులు జప్తు చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రకటించింది. గోవా, కర్ణాటక, కేరళ, పంజాబ్‌, తమిళనాడు, యూపీ, హరియాణా, జార్ఖండ్‌ , మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ఆ గ్రూప్‌ భూములను జప్తు చేయాలంటూ ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ (పీఎంఎల్‌ఏ) చట్టం కింద ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్‌హెచ్‌ఎ్‌ఫఎల్‌, ఆర్‌సీఎ్‌ఫఎల్‌ కంపెనీలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా జప్తు చేసిన ఈ ఆస్తుల విలువ రూ.581.65 కోట్లని ఈడీ తెలిపింది. గతం లో కూడా ఈడీ.. రిలయన్స్‌ గ్రూప్‌ ఆస్తులను జప్తు చేసిం ది. వాటిని కూడా కలిపితే జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.16,310 కోట్లకు చేరినట్టు ఈడీ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి..

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు.. కూతురితో కలిసి వీక్షించిన కిమ్..

Updated Date - Mar 13 , 2026 | 02:28 AM