Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Aug 24 , 2026 | 06:36 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Aug 24, 2026 21:24 IST

    ప్రధాని మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రశంసలు

    • మోదీ వల్లే ఇరుదేశాల వాణిజ్య బంధం బలపడింది: పుతిన్‌

    • భారత్‌, రష్యా మధ్య వ్యాపారం వృద్ధి చెందింది: పుతిన్‌

    పూర్తి కథనం..

  • Aug 24, 2026 21:16 IST

    నెల్లూరు: వెంకటాచలం మండలం చౌటపాలెం కోదండరామ ఆలయంలో‌ కల్యాణోత్సవం

    • పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, MLA సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

  • Aug 24, 2026 20:16 IST

    అమరావతి: వైసీపీ హయాంలో రూ.3,500 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది: మంత్రి పార్థసారథి

    • మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చాక వేల కోట్ల దోపిడీ

    • దోపిడీ కోసమే మద్యం పాలసీని మార్చారు: మంత్రి పార్థసారథి

    పూర్తి కథనం..

  • Aug 24, 2026 20:14 IST

    హాకీ ప్రపంచ కప్: సెమీస్ రేసు నుంచి భారత్ ఔట్

    • అర్జెంటీనాపై 5-3 తేడాతో భారత్ ఓటమి

    • పూల్-ఈలో చివరి స్థానంలో టీమిండియా

    పూర్తి కథనం..

  • Aug 24, 2026 20:12 IST

    కడప బేసిన్‌లో లక్షల కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలు: మంత్రి కొల్లు రవీంద్ర

    • CSIR-NGRIతో ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందం: మంత్రి కొల్లు

    • క్రిటికల్ మినరల్స్ వెలికితీత ఒప్పందం చారిత్రాత్మకం: మంత్రి కొల్లు రవీంద్ర

  • Aug 24, 2026 19:39 IST

    స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ జీఓపై ఏపీ హైకోర్టులో పిల్‌

    • సంబంధిత జీఓలను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్‌

    • రిజర్వేషన్లు 50 శాతానికి మించడం చట్టవిరుద్ధం: పిటిషనర్‌

    • పిల్‌పై రేపు విచారణ జరుపుతామన్న హైకోర్టు ధర్మాసనం

  • Aug 24, 2026 19:36 IST

    విజయవాడ: రేపు లోక్‌భవన్‌కు సీఎం చంద్రబాబు

    • లోకాయుక్త ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

  • Aug 24, 2026 19:35 IST

    అల్లూరి: అరకులోయ బైపాస్ రోడ్డులో ప్రమాదం

    • ఆటో-కారు-బైక్ ఢీకొన్న ప్రమాదంలో కొత్తవలస యువకుడి మృతి, నలుగురికి గాయాలు

    • కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Aug 24, 2026 19:33 IST

    మంత్రి కొండా సురేఖ అంశంపై నేతలకు సీఎం రేవంత్‌ దిశానిర్దేశం

    • కొండా సురేఖ అంశంపై ఎవరూ మాట్లాడొద్దు: సీఎం రేవంత్‌

    • సురేఖ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుంది: సీఎం రేవంత్‌ రెడ్డి

  • Aug 24, 2026 19:33 IST

    జూనియర్ డాక్టర్ల సమ్మెపై ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం

    • అత్యవసర విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ధర్మాసనం

    • సమ్మె విరమింపచేసేందుకు ఏమి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

    • జూడాల సంఘం అధ్యక్షుడు ఈశ్వర్‌కు హైకోర్టు నోటీసులు

    • తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

  • Aug 24, 2026 19:05 IST

    సెప్టెంబర్‌ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

    • మంత్రులు, MLAలతో సీఎం రేవంత్‌ సమావేశంలో నిర్ణయం

    • ఎన్ని రోజుల పాటు నిర్వహణ అనేది BACలో నిర్ణయం

  • Aug 24, 2026 19:04 IST

    హైదరాబాద్: శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద రోడ్డు ప్రమాదం

    • గుర్తుతెలియని ట్యాంకర్ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు వెంకట్ వాల్మీకి మృతి

    • కార్తీక్ రెడ్డికి అనే వ్యక్తికి తీవ్ర గాయాలు

    • KTM బైక్‌పై శంషాబాద్ నుంచి జడ్చర్ల వెళ్తుండగా ప్రమాదం

    • ప్రమాదంతో రహదారిపై ట్రాఫిక్ అంతరాయం

    • ట్రాఫిక్‌ని క్లియర్ చేసిన ట్రాఫిక్ పోలీసులు

  • Aug 24, 2026 19:02 IST

    హైదరాబాద్: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం

    • నిర్మాణంలో ఉన్న భవనం మొదటి అంతస్తు నుంచి కిందపడి యువకుడి మృతి

    • ఆర్ కే కన్‌స్ట్రక్షన్స్ సైట్‌లో పని చేస్తున్న జగ్గిశెట్టి సాయి తేజ (25)

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న నార్సింగి పోలీసులు

  • Aug 24, 2026 19:01 IST

    అంబేద్కర్ కోనసీమ: అంబాజీపేట మండలం తొండవరంలో వ్యక్తి అనుమానాస్పద మృతి

    • రొయ్యల చెరువులో మృతదేహం లభ్యం

    • మృతుడు బోడసకుర్రు గ్రామం పల్లిపాలెంకు చెందిన ఓలేటి రాజు (40)గా గుర్తింపు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Aug 24, 2026 18:59 IST

    ఢిల్లీలో మరో ర్యాలీకి సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీ

    • సెప్టెంబర్ 5న మరో నిరసన ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటన

    • ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకూ ర్యాలీ

    • జెన్ జీకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆరోపణ

  • Aug 24, 2026 18:36 IST

    భారత్-శ్రీలంక టెస్టు: రెండో రోజు ముగిసిన ఆట

    • తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేసిన భారత్

    • ఆట ముగిసే సమయానికి శ్రీలంక స్కోర్ 8/2

  • Aug 24, 2026 18:15 IST

    అన్నమయ్య జిల్లా: మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు

    • రెండు బృందాలుగా 12మంది ఏసీబీ అధికారుల దాడులు

    • కార్యాలయంలోని సామాగ్రి సీజ్ చేసి, తనిఖీలు చేస్తున్న అధికారులు

  • Aug 24, 2026 18:13 IST

    ఎన్నికల్లో ఓటమి.. రీకౌంటింగ్‌ను కోరుతూ హైకోర్టులో స్టాలిన్ పిటిషన్

    • ఇటీవల ఎన్నికల్లో కొళత్తూర్ నియోజకవర్గంలో స్టాలిన్ ఓటమి

    • ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపణ

    • రీకౌంటింగ్‌కు ఆదేశించాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్

    పూర్తి కథనం..

  • Aug 24, 2026 18:00 IST

    ఛత్తీస్‌గఢ్‌: సుక్మా జిల్లాలో భద్రతాబలగాల కూంబింగ్

    • బెజ్జి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంప్‌ స్వాధీనం

    • భారీగా ఆయుధాలు, పేలుడు సామగ్రి స్వాధీనం

  • Aug 24, 2026 17:45 IST

    డాక్‌ మిత్ర, డాక్‌ సేవ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం

    • దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆధునీకరించిన 14 పోస్టాఫీస్‌ల ప్రారంభం

    • పోస్టాఫీస్‌లను ప్రారంభించిన కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని

  • Aug 24, 2026 17:38 IST

    కొండా సురేఖ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్

    • కొండా సురేఖ అంశం క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది: సీఎం రేవంత్‌ రెడ్డి

    • ఆ నిర్ణయాన్ని అందరూ అంగీకరించాల్సిందే: రేవంత్‌

    • అధిష్టానం నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే: రేవంత్

    • అంతర్గత వ్యవహారాలపై మాట్లాడను: సీఎం రేవంత్

    • ఊహాజనిత కథనాలపై స్పందించను: సీఎం రేవంత్ రెడ్డి

  • Aug 24, 2026 17:37 IST

    మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు రిమాండ్‌

    • సెప్టెంబర్‌ 7 వరకూ రిమాండ్‌ విధించిన నాంపల్లి ED కోర్టు

    • ED వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు

    • ఏపీ లిక్కర్‌ రవాణా స్కాం కేసులో నిన్న కారుమూరి అరెస్టు

    • కారుమూరి నాగేశ్వరరావును చంచల్‌గూడ జైలుకు తరలింపు

  • Aug 24, 2026 17:34 IST

    విజయనగరం: పైడితల్లి అమ్మవారి ఉత్సవ తేదీల ఖరారు

    • అక్టోబర్ 26 సోమవారం తొలేళ్ల మహోత్సవం

    • 27 మంగళవారం సిరిమాను ఉత్సవం

    • నవంబర్ 3 మంగళవారం తెప్పోత్సవం

  • Aug 24, 2026 17:27 IST

    భారతీయులకు మరో షాకిచ్చేందుకు సిద్ధమవుతున్న యూఎస్

    • హెచ్-1బీ, ఓపీటీపై నూతన ఫీజులు విధించేందుకు ప్రతిపాదనలు

    • ఓపీటీకి లక్ష డాలర్ల ఫీజును విధించే ఛాన్స్

    • ప్రతిపాదనలకు ఇప్పటికే వైట్‌హౌస్ అనుమతులు

    పూర్తి కథనం..

  • Aug 24, 2026 17:08 IST

    కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ విషయంలో దివ్యాంగ వధువులకు ఊరట

    • స్టే ఎత్తివేసిన హైకోర్టు

    • వాదనలు వినిపించడానికి 2 వారాలు గడువు కోరిన ప్రభుత్వం

    • దివ్యాంగులకు మినహా మిగతా వారికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ స్టే కొనసాగింపు

  • Aug 24, 2026 16:57 IST

    శ్రీలంకతో రెండో టెస్టు: ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్

    • 503/9 స్కోర్ వద్ద భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్

  • Aug 24, 2026 16:48 IST

    శ్రీలంకతో రెండో టెస్టు: భారత్ 9వ వికెట్ డౌన్

    • మహ్మద్ సిరాజ్(3) ఎల్బీడబ్ల్యూ

    • ప్రభాత్ జయసూర్యకు రెండో వికెట్

    • క్రీజులోకి ప్రసిద్ధ్ కృష్ణ, మరో ఎండ్‌లో ధ్రువ్ జురెల్(106*)

    • ప్రస్తుతం భారత్ స్కోర్ 489/9

  • Aug 24, 2026 16:41 IST

    శ్రీలంకతో రెండో టెస్టు: ధ్రువ్ జురెల్ సెంచరీ

    • వర్షం తర్వాత తిరిగి ప్రారంభమైన ఆట

    • 171 బంతుల్లో సెంచరీ చేసిన ధ్రువ్ జురెల్(100)

    • ప్రస్తుతం భారత్ స్కోర్ 482/8

  • Aug 24, 2026 16:37 IST

    నా పర్యటనను అడ్డుకోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమే: సీఎం రేవంత్‌

    • ఇంగ్లండ్‌ పర్యటనకు అనుమతి ఇచ్చారు.. అమెరికా పర్యటనను ఎందుకు తిరస్కరించారు?

    • గుజరాత్‌ సీఎంకి అమెరికా, కెనడా పర్యటనలకు అనుమతిచ్చారు: సీఎం రేవంత్

    • నాపర్యటన తిరస్కరణకు రాజకీయ కారణాలు చెబుతున్నారు: సీఎం రేవంత్

  • Aug 24, 2026 16:35 IST

    నల్లగొండ : డిండి పట్టణంలోని శ్రీశైలం -హైదరాబాద్ రహదారిపై ప్రమాదం

    • కారు, బైక్ ఢీ.. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం

    • మృతులు నాగరాజు, చంద్రకళగా గుర్తింపు

    • హైదరాబాద్ నుంచి అచ్చంపేటకు వెళ్తుండగా ప్రమాదం

  • Aug 24, 2026 16:28 IST

    హైదరాబాద్: తెలంగాణ రైజింగ్‌ 2047 భాగంగా ముందుకెళ్తున్నాం: సీఎం రేవంత్‌ రెడ్డి

    • ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్‌

    • తెలంగాణ ఆర్థిక పురోభివృద్ధి దిశగా వెళ్లాలనేదే మా యోచన: రేవంత్‌

    • పెట్టుబడుల సాధన కోసమే విదేశీ పర్యటనకు సంకల్పించాం: సీఎం రేవంత్‌ రెడ్డి

  • Aug 24, 2026 16:10 IST

    కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషికి CJP కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కే లేఖ

    • ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి: అభిజీత్‌ దీప్కే

    • పాఠశాలల పూర్తి వివరాలను బహిర్గతం చేయాలి: అభిజీత్‌ దీప్కే

    • ఎన్ని పాఠశాలలకు మరమ్మతులు అవసరమో చెప్పాలి: దీప్కే

    • ఉపాధ్యాయ పోస్టులు, ఖాళీల వివరాలను ప్రకటించాలి: దీప్కే

    • పాఠశాలలకు కేటాయించిన నిధులపై శ్వేతపత్రం ఇవ్వాలి: అభిజీత్‌ దీప్కే

  • Aug 24, 2026 15:41 IST

    నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 172 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

    • 33 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ

  • Aug 24, 2026 15:33 IST

    హైదరాబాద్: కారుమూరి రిమాండ్‌పై నాంపల్లి ED కోర్టులో వాదనలు పూర్తి

    • రెండు గంటలకుపైగా సాగిన వాదనలు, కాసేపట్లో ఉత్తర్వులు

    • ఏపీ లిక్కర్‌ రవాణా స్కాం కేసులో అరెస్టయిన కారుమూరి

  • Aug 24, 2026 15:26 IST

    కారుమూరి రిమాండ్‌పై ఇరువర్గాల వాదనలు పూర్తి

    • మరికాసేపట్లో రిమాండ్‌పై తీర్పు ఇవ్వనున్న జడ్జి

    • సుమారు రెండు గంటలకు పైగా సాగిన వాదనలు

  • Aug 24, 2026 15:13 IST

    ఉబెర్‌పై 9 వేల కోట్ల పైచిలుకు జరిమానా!

    • డచ్‌ డేటా రెగ్యులేటరీ అథారిటీ సంచలన నిర్ణయం

    • ఏఐతో డ్రైవర్లపై వేటు వేసినందుకు భారీ జరిమానా

    • ఈ నిర్ణయంపై అప్పీలుకు సిద్ధమవుతున్న ఉబెర్

  • Aug 24, 2026 15:12 IST

    జైస్వాల్‌, అసిత ఫెర్నాండోకు ఐసీసీ జరిమానా

    • ఇద్దరికీ మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత

    • కొలంబో టెస్టులో ఘర్షణపై చర్యలు

    • జైస్వాల్‌, అసితకు ఐసీసీ షాక్‌

    • మైదానంలో గొడవపై ఇద్దరికీ జరిమానా

    • కొలంబో టెస్ట్‌ ఘటనపై ఐసీసీ చర్యలు

  • Aug 24, 2026 15:01 IST

    హైదరాబాద్: జలసౌధలో ముగిసిన KRMB త్రిసభ్య కమిటీ భేటీ

    • సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోని కమిటీ

    • సెప్టెంబర్‌ 4న మరోసారి భేటీ కావాలని నిర్ణయం

    • భేటీలో పాల్గొన్న ఏపీ, తెలంగాణ అధికారులు

  • Aug 24, 2026 14:55 IST

    హైదరాబాద్: నాంపల్లి ED కోర్టుకు మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు

    • ఏపీ లిక్కర్‌ రవాణా స్కాం కేసులో అరెస్టయిన కారుమూరి

  • Aug 24, 2026 14:50 IST

    22Aపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

    • ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు: మంత్రి పొంగులేటి

    • 22A బాధితులకు న్యాయం చేస్తాం: మంత్రి పొంగులేటి

    • ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు: మంత్రి పొంగులేటి

    • అధికారులతో తరచూ రివ్యూ చేస్తున్నాం: పొంగులేటి

    • 22A జాబితా సహా అన్ని ఆర్డర్ల వివరాలూ అప్‌లోడ్‌: మంత్రి పొంగులేటి

  • Aug 24, 2026 14:45 IST

    సోషల్‌ మీడియా ప్రచారంపై ఏపీ SEC అనిల్‌చంద్ర పునేఠా స్పందన

    • ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై వైరల్ అవుతున్న వార్తలు ఫేక్: SEC

    • వాట్సాప్‌ ప్రచారంలో ఉన్న ఎన్నికల తేదీలు, షెడ్యూల్ నకిలీ: SEC

    • అనుమతి లేకుండా ఎన్నికల సంఘం పేరు, లోగో దుర్వినియోగం చట్టరీత్యా నేరం: SEC

    • అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు.. షేర్‌ చేయొద్దు: SEC అనిల్‌చంద్ర పునేఠా

  • Aug 24, 2026 14:30 IST

    విశాఖ: జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీ యునైటెడ్ స్కూల్ వర్కర్స్ యూనియన్ నిరసన

    • స్కూళ్లలో ఆయాలు, కుకింగ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని నిరసన

    • సిబ్బందికి పెండింగ్ జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్

  • Aug 24, 2026 14:17 IST

    శ్రీలంక-భారత్ రెండో టెస్టు: వర్షం కారణంగా ఆగిన ఆట

    • రెండో రోజు వర్షం కారణంగా నిలిచిన ఆట

    • సెంచరీకి చేరువలో ధ్రువ్ జురెల్(95*)

    • మరో ఎండ్‌లో క్రీజులో మహ్మద్ సిరాజ్(0*)

    • టీ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ 475/8

  • Aug 24, 2026 14:15 IST

    గుంటూరు: గుంటూరు నగర పాలక సంస్థలో ఏసీబీ సోదాలు

    • ఇంజినీరింగ్ విభాగంలో అక్రమాలపై విచారణ చేపట్టిన ఏసీబీ

  • Aug 24, 2026 14:14 IST

    ద్రోణాచార్య అవార్డు గ్రహీతపై పోక్సో కేసు

    • 45 ఏళ్ల జిమ్నాస్టిక్స్ కోచ్‌పై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

    • 16 ఏళ్ల బాలికను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు

    పూర్తి కథనం..

  • Aug 24, 2026 14:00 IST

    ఖమ్మం: వేంసూరు మండలం మర్లపాడు జడ్పీ హైస్కూల్‌లో ఫుడ్‌ పాయిజన్

    • 8 మంది విద్యార్థులకు అస్వస్థత

    • వేంసూర్ పీఎహెచ్‌సీలో విద్యార్థులకు చికిత్స

  • Aug 24, 2026 13:50 IST

    శ్రీకాకుళం: సారోకోట మండలం కిన్నెర వాడ వద్ద ప్రమాదం

    • కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరి గల్లంతు

    • వివరాలు సేకరిస్తున్న పోలీసులు

  • Aug 24, 2026 13:45 IST

    తెలంగాణకు భారీ వర్ష సూచన

    • రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం

    • ఇవాళ, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం

  • Aug 24, 2026 13:30 IST

    KBR పార్క్ ప్రాంతంలో చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టులో విచారణ

    • KBR పార్క్‌లో తాము చెట్లు నరకడం లేదని కోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది

    • తెలంగాణ అఫిడవిట్‌పై కౌంటర్ దాఖలుకు గడువు కోరిన పిటిషనర్

    • తదుపరి విచారణ వచ్చే నెల 7కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు

  • Aug 24, 2026 13:20 IST

    హైదరాబాద్: జలసౌధలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

    • పాల్గొన్న ఏపీ, తెలంగాణ ఇంజినీర్ ఇన్‌చీఫ్‌లు

    • శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లోని నీటి పంపిణీపై చర్చ

  • Aug 24, 2026 13:19 IST

    కావేరీ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

    • నీటి పంపిణీ అంశంపై CWMAనే ఆశ్రయించాలన్న సుప్రీం

    • వర్షాభావంతో నీటి నిల్వలు తగ్గాయన్న కర్ణాటక

  • Aug 24, 2026 13:18 IST

    సంగారెడ్డి: తెల్లాపూర్‌లో దారి దోపిడీ

    • మహేశ్ అనే వ్యక్తిని అడ్డగించి రూ.4,700 లాక్కెళ్లిన 9 మంది నిందితులు

    • కొల్లురూ పీఎస్‌లో బాధితుడు ఫిర్యాదు, ఏడుగురి అరెస్ట్

    • నిందితుల్లో నలుగురు మైనర్లు

  • Aug 24, 2026 13:13 IST

    హైదరాబాద్: 121 రకాల మద్యం బ్రాండ్స్‌కు నోటిఫికేషన్ ఇవ్వడంపై BRS MLA హరీశ్ రావు ఆగ్రహం

    • జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు మాత్రం ఫుల్: హరీశ్ రావు

    • యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వని మీకు మద్యం వ్యాపారానికి మాత్రం ఇంత తొందరెందుకు?: హరీశ్ రావు

    • లిక్కర్ అమ్మకాలపైనే కాంగ్రెస్‌కు ఎక్కువ శ్రద్ధ: హరీశ్ రావు

  • Aug 24, 2026 13:11 IST

    హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై CMC కమిషనర్ కీలక ఆదేశాలు

    • సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అనధికార భవనాలపై కఠిన చర్యలు

    • అనుమతులు లేని నిర్మాణాలను గుర్తించి కూల్చివేయాలని ఆదేశం

    • 75 చదరపు గజాలలోపు స్థలంలో భవనం ఎత్తు 7 మీటర్లు దాటితే కూల్చివేత

    • నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని అధికారులకు స్పష్టం

  • Aug 24, 2026 13:01 IST

    IND vs SL: రిషభ్ పంత్(63) ఔట్

    • లంచ్‌ బ్రేక్‌ తర్వాత తొలి బంతికే పంత్ ఔట్

    • కేశర నువాంత బౌలింగ్‌లో లాహిరు‌ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగిన పంత్

    • ఏడో వికెట్‌కు112 పరుగుల భాగస్వామ్యం

  • Aug 24, 2026 12:58 IST

    వ్యాఖ్యాత హర్షా భోగ్లే కామెంట్‌కు స్పందించిన యశస్వి జైస్వాల్

    • భారత్ పోరాటం చేస్తుంది.. సరైన సమాధానం ఇస్తుంది: జైస్వాల్

    • ఏం జరిగిందో తెలియకుండా కామెంట్లు చేస్తున్నారు: జైస్వాల్

  • Aug 24, 2026 12:39 IST

    తిరుపతి: అమరావతి ఛాంపియన్‌షిప్ ప్రారంభ వేడుకల్లో అపశృతి

    • బ్యాటరీ లాస్‌తో హోంమంత్రి అనితపై కూలిన డ్రోన్

    • మంత్రి కుడిచేతికి స్వల్ప గాయం, వెంటనే చికిత్స చేసిన వైద్య సిబ్బంది

  • Aug 24, 2026 12:33 IST

    ఏలూరు: తక్కువ కాలంలో విజయం సాధించడం గొప్ప విషయం: చంద్రబాబు

    • ఈ ప్లాంట్ 29 టన్నుల సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద పాప్‌కార్న్ ప్రాసెసింగ్ కేంద్రం: చంద్రబాబు

    • భవిష్యత్తులో పాప్‌కార్న్ అంటే గుర్తొచ్చేది ముసునూరు: చంద్రబాబు

    • 11 ఏళ్లలో మొక్కజొన్న ఉత్పత్తి వాటా 65శాతానికి పెరిగింది

  • Aug 24, 2026 12:33 IST

    ఏలూరు జిల్లాలో ఉపరాష్ట్రపతి, సీఎం పర్యటన

    • నూతన పాప్‌కార్న్ సీడ్‌ ఆవిష్కరణ కార్యక్రమం

    • ఉపరాష్ట్రపతితో కలిసి ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

    • దేశంలో తొలి నాన్-GMO పాప్‌కార్న్ హైబ్రిడ్ విత్తనం

    • ముసునూరులో పాప్‌కార్న్ మెయిజ్ విత్తనం ఆవిష్కరణ

  • Aug 24, 2026 12:24 IST

    హైదరాబాద్: రేవంత్ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టే కుట్ర చేస్తోంది: కల్వకుంట్ల కవిత

    • స్మార్ట్ మీటర్లతో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే ఫ్రీ కరెంట్ ఎత్తివేసే కుట్ర

    • స్మార్ట్ మీటర్లు పెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోం: కవిత

  • Aug 24, 2026 12:19 IST

    IND vs SL: టెస్టుల్లో అరుదైన ఘనత సాధించిన రిషభ్‌ పంత్

    • మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని అధిగమించిన పంత్

    • విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్‌ కీపర్‌గా రికార్డ్

  • Aug 24, 2026 12:11 IST

    విజయవాడ: ఉద్యమ కార్యచరణ పోస్టర్ ఆవిష్కరించిన ఏపీ అమరావతి జేఏసీ నేతలు

    • ఈ నెల 28 వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామన్న నేతలు

    • 28న రాష్ట్ర సదస్సులో ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామన్న జేఏసీ నేతలు

  • Aug 24, 2026 12:06 IST

    హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి కీలక సమావేశం

    • హాజరైన సీఎస్ సంజయ్ జాజు, CMO అధికారులు

  • Aug 24, 2026 12:05 IST

    మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ నివేదిక

    • మీనాక్షి, మహేశ్ గౌడ్‌కు నివేదిక ఇవ్వనున్న క్రమశిక్షణ కమిటీ

    • కొండా సురేఖతో పాటు మరో ఇద్దరి వ్యవహారంపై కఠిన నిర్ణయాలకు క్రమశిక్షణ కమిటీ సిఫార్సు

    • సాయంత్రం AICCకి నివేదిక పంపనున్న మహేశ్ గౌడ్

  • Aug 24, 2026 12:05 IST

    తిరుపతి: గొడ్డలి పార్టీ క్రీడాకారులను అవమానిస్తోంది: మంత్రి అనగాని సత్యప్రసాద్

    • గతంలో 'ఆడుదాం ఆంధ్రా' పేరుతో దోచుకుందాం ఆంధ్ర చేశారు: మంత్రి

    • క్రీడాకారులను ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు చేస్తుంటే గొడ్డలి పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారు: మంత్రి

  • Aug 24, 2026 11:51 IST

    ఏపీలో 15వ రోజుకు చేరిన జూనియర్ డాక్టర్ల సమ్మె

    • స్టైపండ్ పెంచే వరకు సమ్మె విరమించబోమంటున్న జూడాలు

    • ఇవాళ ప్రభుత్వంతో మరోసారి చర్చించే అవకాశం

  • Aug 24, 2026 11:45 IST

    హైదరాబాద్: ఫీజు బకాయి-బీజేపీ లడాయి పేరుతో టీబీజేపీ దీక్ష

    • పాల్గొన్న టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు

  • Aug 24, 2026 11:37 IST

    ఢిల్లీ: ఇస్రోను మోదీ సర్కార్ బలహీనపరుస్తోంది: కాంగ్రెస్ సీనియర్ జైరామ్‌ రమేశ్

    • ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం దూకుడుగా అడుగులేస్తోంది: జైరామ్ రమేశ్

    • ఇస్రో స్వతంత్రతను, ఉనికిని దెబ్బతీస్తున్నారు: జైరామ్‌ రమేశ్

    • రోదసి ప్రయోగాల్లో ఇస్రో పాత్రను తీవ్రంగా పరిమితం చేస్తున్నారు: జైరామ్ రమేశ్

    • అనిశ్చితితో 120 మంది కీలక నిపుణులు ఇస్రోను వీడారు: జైరామ్‌ రమేశ్

  • Aug 24, 2026 11:33 IST

    విజయవాడ: 'స్వర' ఆస్పత్రిపై క్రిమినల్ కేసు

    • కోర్టు ఆదేశాలతో 9 మంది వైద్యులపై కేసు నమోదు

    • 2023లో 'స్వర' ఆస్పత్రిలో అప్పాయమ్మ అనే మహిళ మృతి

    • తన తల్లి మృతికి అర్హత లేని వైద్యులే కారణమని కోర్టుకెళ్లిన మృతురాలి కుమారుడు

    • ఫోర్జరీ, కుట్ర, బెదిరింపుల ఆరోపణలపై కేసులు నమోదు చేసిన సత్యనారాయణపురం పోలీసులు

  • Aug 24, 2026 11:27 IST

    యూపీ: మేరఠ్‌లో పోలీసులపై గో స్మగ్లర్ల కాల్పులు

    • ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులకు దిగిన పోలీసులు

    • ఇద్దరు గో స్మగ్లర్లకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

  • Aug 24, 2026 11:11 IST

    హైదరాబాద్: గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో హైడ్రా-CMC సంయుక్త ఆపరేషన్

    • కుప్పకూలిన భవనం పక్కనే ఉన్న మరో ఏడంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

    • బిల్డింగ్ ప్రమాదకరంగా మారడంతో వనం తొలగింపు

    • పక్కనే ఉన్న భవనాలకు ముప్పు లేకుండా చర్యలు

    • బాహుబలి JCB తో తొలగింపు పనులు

    • CMC అధికారుల ఫిర్యాదు మేరకు హైడ్రా చర్యలు

  • Aug 24, 2026 11:09 IST

    హైదరాబాద్: చికెన్ వ్యర్థాల మాఫియాపై సైబరాబాద్ పోలీసుల దాడులు

    • 100 టన్నుల వ్యర్థాలు పట్టుకున్న అధికారులు

    • ఏపీలోని చేపల చెరువు యజమానులకు వ్యర్థాల విక్రయం

    • అత్తాపూర్, మియాపూర్, అమీన్‌పూర్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, చింతల్‌లో లారీల్లో డంప్ చేస్తుండగా దాడులు

  • Aug 24, 2026 11:04 IST

    CPM నేత సారంపల్లి మల్లారెడ్డి మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

    • రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడిన వ్యక్తి సారంపల్లి మల్లారెడ్డి: రేవంత్

    • రైతు సంఘం నేతగా ఆయన సేవలు చిరస్మరణీయం: రేవంత్‌రెడ్డి

  • Aug 24, 2026 10:57 IST

    ఆంక్షలపై అమెరికాకు ఇరాన్‌ వార్నింగ్‌

    • ఆర్థిక యుద్ధం కొనసాగితే హోర్ముజ్‌ నుంచే కాదు.. పర్షియన్‌ గల్ఫ్‌ నుంచీ చుక్క చమురు బయటకు వెళ్లదు: ఇరాన్

    • US ఆర్థిక చర్యలకు మద్దతిచ్చే దేశాలపై కూడా ఆంక్షలు: ఇరాన్‌

    • మా ఆదేశాలు వినని నౌకలను జప్తు చేస్తాం.. వాటికి సహకరించే నౌకలపైనా చర్యలు తీసుకుంటాం: ఇరాన్

  • Aug 24, 2026 10:53 IST

    మహబూబాబాద్: కేసముద్రంలో SI పేరుతో మోసం

    • డ్రైవర్‌తో డబ్బు పంపిస్తానని నమ్మించి క్యూఆర్ కోడ్‌తో రూ.78,500 కాజేసిన కేటుగాడు

    • పోలీసులకు బాధితుడి ఫిర్యాదు, కేసు నమోదు

  • Aug 24, 2026 10:48 IST

    తమిళనాడు సీఎం విజయ్ కీలక ప్రకటన

    • మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం: సీఎం విజయ్

    • మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు: విజయ్

    • పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు రద్దు: సీఎం విజయ్

  • Aug 24, 2026 10:47 IST

    పెద్దపల్లి: రామగుండంలో ఉగ్ర లింకుల కలకలం

    • రామగుండం అయోధ్య నగర్‌లో NIA దాడులు

    • NIA అదుపులో ఇంజినీరింగ్ విద్యార్థి ముజామిల్‌ ఖాన్

    • ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని సమాచారం

    • NTPC పీఎస్‌లో ముజామిల్‌ ఖాన్‌ను ప్రశ్నిస్తున్న NIA

  • Aug 24, 2026 10:38 IST

    చెన్నై: అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన సీఎం విజయ్

    • పరాందూర్‌లో రెండో విమానాశ్రయం నిర్మించాలనే నిర్ణయం వెనక్కి

    • గత ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రకటన చేసిన సీఎం విజయ్

    • విమానాశ్రయం వద్దని తెలిపిన నిరసనకారులకు అండగా సీఎం విజయ్

  • Aug 24, 2026 10:25 IST

    విశాఖ: గాజువాకలో రవాణా శాఖ బ్రేక్ ఇన్‌స్పెక్టర్ డ్రైవర్ వీరంగం

    • షీలా నగర్ మారుతి జంక్షన్ వద్ద ఆపకుండా వెళ్లిపోయిన లారీ డ్రైవర్

    • లారీని ఓవర్‌టేక్ చేసి పట్టుకున్న ఇన్‌స్పెక్టర్ పార్వతి

    • లారీ డ్రైవర్‌పై పిడిగుద్దులతో ఇన్‌స్పెక్టర్ డ్రైవర్ దాడి

    • ఘటనపై ధర్నాకు సిద్ధమైన ఏపీ లారీ అసోసియేషన్ సభ్యులు

  • Aug 24, 2026 10:24 IST

    హైదరాబాద్: గచ్చిబౌలిలో భవనం కూలిన ఘటనలో యజమాని సాజిద్ అరెస్ట్

    • శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సయ్యద్ సాజిద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

    • మున్సిపల్ అనుమతులు లేకుండానే జీ+6 భనవం నిర్మించిన సాజిద్

    • భవనం కూలిన ఘటనలో ఇద్దరు కార్మికుల మృతి

    • భవన నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన కాంట్రాక్టర్ ఖాజా కోసం గాలింపు

  • Aug 24, 2026 10:23 IST

    ఏపీలో అరాచక పాలన సాగుతోంది: మాజీమంత్రి కారుమూరి

    • నాకు ఏ కన్‌స్ట్రక్షన్ కంపెనీ తెలియదు: కారుమూరి నాగేశ్వరరావు

    • నా అకౌంట్‌లో ఎటువంటి డబ్బులు జమ కాలేదు: కారుమూరి

    • సుదర్శన్ కన్‌స్ట్రక్షన్ నుంచి నాకు డబ్బులు వచ్చాయన్నది అవాస్తవం: కారుమూరి

  • Aug 24, 2026 10:22 IST

    ఇరాన్ పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ హెచ్చరిక

    • మా ఆదేశాలు వినని నౌకలను జప్తు చేస్తాం: ఇరాన్ పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్

    • వాటికి సహకరించే నౌకలపై కూడా చర్యలు తీసుకుంటాం: ఇరాన్ పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్

  • Aug 24, 2026 10:13 IST

    హరియాణాలో ఓ మహిళ దారుణం

    • భర్తను చంపి పేగులు బయటకు తీసిన భార్య

    • అనంతరం ఇంటి పైకప్పు మీది నుంచి దూకి ఆత్మహత్య

  • Aug 24, 2026 10:11 IST

    బిహార్: పశ్చిమ చంపారన్ జిల్లాలో బస్సు బీభత్సం

    • హైవే దగ్గర సంగీత విభావరిపైకి దూసుకెళ్లిన బస్సు

    • ఐదుగురి దుర్మరణం

  • Aug 24, 2026 10:01 IST

    హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో కారుమూరికి వైద్య పరీక్షలు పూర్తి

    • కారుమూరిని నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్న ఈడీ

    • ఏపీ లిక్కర్‌ రవాణా కేసులో అరెస్టైన కారుమూరి నాగేశ్వరరావు

  • Aug 24, 2026 09:23 IST

    అయోధ్య విరాళాల చోరీ బయటపెట్టిన జర్నలిస్ట్‌ అభిషేక్‌పై FIR

    • సుప్రీంకోర్టును ఆశ్రయించిన జర్నలిస్ట్‌ అభిషేక్‌ ఉపాధ్యాయ్

    • తనపై యూపీ పోలీసులు నమోదు చేసిన FIRను రద్దు చేయాలని పిటిషన్

    • అయోధ్య విరాళాల చోరీని బయటపెట్టినందుకు తనపై తప్పుడు కేసు బనాయించారని అభిషేక్ ఆరోపణ

    • యూపీ పోలీసులతో కాకుండా CBI లేదా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టును కోరిన అభిషేక్ ఉపాధ్యాయ్

  • Aug 24, 2026 09:22 IST

    హైదరాబాద్: నేడు, రేపు టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు దీక్ష

    • ఫీజు బకాయి-బీజేపీ లడాయి పేరుతో టీబీజేపీ దీక్ష

    • బీజేపీ దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ

    • పార్టీ ఆఫీస్ లోపల దీక్ష చేయాలని టీబీజేపీ నిర్ణయం

    • దీక్షలో పాల్గొననున్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు

  • Aug 24, 2026 09:22 IST

    ట్రైనీ IPS ఉదయ్‌కృష్ణారెడ్డి పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

    • పోటెన్సీ టెస్ట్ నిర్వహించేందుకు రాజేంద్రనగర్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేసిన ఉదయ్

    • ఈనెల 17న రాజేంద్రనగర్ కోర్టు ఆదేశాలు

    • తాను ఎలాంటి నేరం చేయలేదని, పోటెన్సీ టెస్ట్ అవసరం లేదని పిటిషన్

  • Aug 24, 2026 09:11 IST

    హైదరాబాద్: డ్రగ్స్ నిరోధక ఈగల్ శాఖలో ఇంటి దొంగలు

    • కానిస్టేబుళ్లు నరహరి, స్వామిని విధులకు దూరం పెట్టిన అధికారులు

    • రూ.50లక్షల విలువైన ఎక్ట్ససీ పిల్స్ స్వాధీనం చేసుకుని అధికారులకు సమాచారం ఇవ్వని కానిస్టేబుళ్లు నరహరి, స్వామి

    • డ్రగ్ పెడ్లర్ అరెస్టుతో ఇంటి దొంగల బాగోతం బట్టబయలు

  • Aug 24, 2026 09:03 IST

    ఢిల్లీ: దేశ ప్రయోజనాల దృష్ట్యా 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' అత్యంత ఆవశ్యకం: జేపీసీ ఛైర్మన్ పీపీ చౌదరి

    • 1983లోనే జమిలి ఎన్నికలు నిర్వహించాలని ఈసీ స్పష్టం చేసింది: చౌదరి

    • జమిలి ఎన్నికల బిల్లుపై ముమ్మరంగా అధ్యయన పర్యటనలు, నిపుణులతో సంప్రదింపులు జరుగుతున్నాయి: జేపీసీ ఛైర్మన్

  • Aug 24, 2026 08:58 IST

    వరంగల్: వర్ధన్నపేటలో భారీగా గంజాయి పట్టివేత

    • 120 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం

    • ఒడిశా నుంచి కేరళకు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పట్టుకున్న పోలీసులు

    • త్రిపురకు చెందిన కారులో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తింపు

    • పట్టుబడిన గంజాయి విలువ రూ.60 లక్షల వరకు ఉంటుందని అంచనా

  • Aug 24, 2026 08:37 IST

    తిరుపతి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత

    • మంత్రితో పాటు శ్రీవారిని దర్శించుకున్న ఎంపీలు సానా సతీశ్, భాష్యం రామకృష్ణ, సింగర్ మంగ్లీ

  • Aug 24, 2026 08:32 IST

    నంద్యాల: ప్రొటోకాల్ విషయంలో జడ్పీ ఛైర్మన్ సహా 14 మందిపై కేసు నమోదు

    • ప్రొటోకాల్ పాటించకుండా డోన్ నూతన ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రారంభించారని పోలీసులకు ఎంపీడీవో వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు

    • జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతు పాపిరెడ్డితో పాటు మరో 14 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు

  • Aug 24, 2026 08:24 IST

    నల్లగొండ: జిల్లాలోని వెంకట రమణ బైక్ షోరూమ్‌లో అగ్ని ప్రమాదం

    • అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌‌తో చెలరేగిన మంటలు

    • మంటల్ని ఆర్పివేసిన ఫైర్ సిబ్బంది

  • Aug 24, 2026 08:18 IST

    తిరుపతి: గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్

    • 6 కేజీల గంజాయి స్వాధీనం

    • నిందితులు ధనలక్ష్మి నగర్‌కు చెందిన విక్రమ్‌రెడ్డి, తిరుచానూరుకు చెందిన మురుగన్‌గా గుర్తింపు

  • Aug 24, 2026 08:05 IST

    ఎన్టీఆర్ జిల్లా: మైలవరంలోని ఓ హోటల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారి పేరుతో హడావుడి

    • హోటల్‌ను సీజ్ చేయడం సహా సోషల్ మీడియాలో వీడియోలు ప్రచారం చేస్తామని బెదిరింపులు

    • డబ్బులు డిమాండ్ చేయడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

    • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కారు గుర్తింపు

    • బొమ్మ తుపాకీ స్వాధీనం, నిందితుడు గోవిందు కోసం గాలింపు

  • Aug 24, 2026 08:03 IST

    నంద్యాల: శ్రీశైలం శ్రీభ్రమరాంబికా దేవి అమ్మవారికి లక్కతో కూడిన బంగారు గోపురం విరాళం

    • దేవస్థాన అధికారులకు 47 గ్రాముల బంగారు గోపురం కలశం అందజేసిన ఓ కర్ణాటక భక్తుడు

  • Aug 24, 2026 07:53 IST

    కాకినాడ: AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు

    • పోలీస్ విచారణలో సాదిక్‌లో కనిపించని పశ్చాత్తాపం

    • పోలీసుల ప్రశ్నలకు తలబిరుసు సమాధానాలు

    • కుటుంబం ఆత్మహత్యతో తనకు సంబంధం లేదంటూ బుకాయింపు

  • Aug 24, 2026 07:52 IST

    మహారాష్ట్ర: నాగ్‌పూర్ వాటర్ ప్లాంట్‌లో కోరిన్ గ్యాస్ లీక్

    • 40 మందికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

    • NDRF, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు

    • ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు

  • Aug 24, 2026 07:46 IST

    కర్నూలు: నేడు ఆలూరులో మంత్రులు నిమ్మల రామానాయుడు, సవిత పర్యటన

    • మినిస్టర్స్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు

  • Aug 24, 2026 07:45 IST

    మహారాష్ట్ర: అమరావతిలోని ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం

    • స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్‌లో చెలరేగిన మంటలు

    • ముగ్గురు నవజాత శిశువుల సజీవదహనం

    • ఆరుగురు శిశువులకు తీవ్రగాయాలు, మరో ఆస్పత్రికి తరలింపు

    • ప్రమాద సమయంలో వార్డులో 39 మంది శిశువులు

    • 36 మంది శిశువులను రక్షించిన వైద్య సిబ్బంది

    పూర్తి కథనం

  • Aug 24, 2026 07:33 IST

    న్యూఢిల్లీ: రెండు కార్లు ఢీకొని ఇద్దరు ఎమ్మెల్యేలు సహా ఆరుగురికి గాయాలు

    • దేశ రాజధాని ఢిల్లీలోని ఐటీవో ప్రాంతంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం

    • ఢిల్లీలోని కిరారి ఎమ్మెల్యే అనిల్ ఝా, కర్ణాటక ఎమ్మెల్యే అభయ్ పటేల్‌కు గాయాలు

    • మరో కారులో ప్రయాణిస్తున్న నలుగురు కుటుంబ సభ్యులకూ గాయాలు

    పూర్తి కథనం

  • Aug 24, 2026 07:21 IST

    • చండీగఢ్ భారీ ఉగ్ర కుట్ర భగ్నం

    • ముగ్గురు అరెస్ట్, IEDతో పాటు ఆయుధాల సీజ్

    • సెక్టార్-36 పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు

    • చండీగఢ్‌లో ఉగ్రదాడికి కుట్ర చేసినట్టు అనుమానం

    • ప్రాథమిక దర్యాప్తులో కీలక ఆధారాల గుర్తింపు

  • Aug 24, 2026 07:14 IST

    తిరుపతి: జీవకోన అంబేడ్కర్ విగ్రహం వద్ద దారుణం

    • బాలికపై విచక్షణారహితంగా బ్లేడ్‌ బ్యాచ్ దాడి

    • బాలికను రక్షించి రుయా ఆస్పత్రికి తరలించిన స్థానికులు

  • Aug 24, 2026 07:05 IST

    హైదరాబాద్: నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం

    • శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లోని నీటి పంపిణీపై చర్చ

    • హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో భేటీ

    • హాజరుకానున్న ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ ESCలు

  • Aug 24, 2026 07:03 IST

    గినియాలో ఘోర ప్రమాదం.. 30 మంది మృతి

    • కొనక్రిలో డంపింగ్ యార్డ్ కూలడంతో ఘటన

    • మరో ఆరుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

    • భారీ వర్షాలతో కుప్పకూలిన డంపింగ్ యార్డ్

  • Aug 24, 2026 07:00 IST

    నేడు ఏలూరు జిల్లాలో ఉపరాష్ట్రపతి, సీఎం పర్యటన

    • ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు స్వాగతం పలకనున్న సీఎం చంద్రబాబు

    • నూతన పాప్‌కార్న్ సీడ్‌ ఆవిష్కరణ కార్యక్రమం

    • ఉపరాష్ట్రపతితో కలిసి ఆవిష్కరించనున్న ఏపీ ముఖ్యమంత్రి

  • Aug 24, 2026 06:59 IST

    కాకినాడ: AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు

    • నిందితుడు సాదిక్‌ను సర్పవరం పీఎస్‌కు తీసుకొచ్చిన పోలీసులు

    • ఇవాళ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్న పోలీసులు

  • Aug 24, 2026 06:56 IST

    తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం

    • హైదరాబాద్ సహా 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్

    • పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం

  • Aug 24, 2026 06:54 IST

    వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

    • నేడు, రేపు ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు

    • పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం

  • Aug 24, 2026 06:54 IST

    హైదరాబాద్: నేటి బీజేపీ దీక్షకు అనుమతి నిరాకరణ

    • ఫీజు బకాయి-బీజేపీ లడాయి పేరుతో టీబీజేపీ దీక్ష

    • పార్టీ ఆఫీస్ దగ్గర రెండు రోజుల దీక్షకు ప్లాన్

    • శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందని దీక్షకు అనుమతి నిరాకరించిన పోలీసులు

    • అయినప్పటికీ దీక్ష చేపడతామంటున్న బీజేపీ నేతలు

  • Aug 24, 2026 06:53 IST

    నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రుల పర్యటన

    • అచ్చంపేట, వనపర్తి, కొల్లాపూర్‌లో రహదారి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు

  • Aug 24, 2026 06:45 IST

    నేడు అనంతపురం జిల్లాలో మంత్రులు పయ్యావుల, టీజీ భరత్ పర్యటన

    • కనేకల్‌లో సోలార్ పవర్, విండ్ పవర్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించనున్న మంత్రులు

  • Aug 24, 2026 06:45 IST

    స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

    • 24క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,63,080

    • 22క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,49,490

    • కిలో వెండి ధర రూ.2,69,900

  • Aug 24, 2026 06:39 IST

    నేడు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

    • ముసునూరు మండలం కాట్రేనిపాడుకు చంద్రబాబు

    • గౌర్మెట్ పాప్‌కోర్నియా ఫ్యాక్టరీలో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు

  • Aug 24, 2026 06:38 IST

    హైదరాబాద్‌: నేడు టీపీసీసీ ముఖ్యనేతల జూమ్‌ సమావేశం

    • టీపీసీసీ చీఫ్‌ మహేశ్ గౌడ్‌ నేతృత్వంలో జూమ్‌ మీటింగ్‌

    • పాల్గొననున్న DCC అధ్యక్షులు, MLAలు, SIR కోఆర్డినేటర్లు

    • తెలంగాణలో 27న గ్రామ, వార్డు సభల ఏర్పాట్లపై సమీక్ష

    • SIR ఫేజ్-2 పురోగతి సహా బూత్ స్థాయి అంశాలపై చర్చ