మోదీ వల్లే వాణిజ్య బంధం బలపడింది: పుతిన్
ABN , Publish Date - Aug 24 , 2026 | 09:42 PM
ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన వల్లే భారత్, రష్యా మధ్య వాణిజ్య బంధం బలపడిందని అన్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన వల్లే భారత్, రష్యా మధ్య వాణిజ్య బంధం బలపడిందని తెలిపారు. అలాగే వ్యాపారం కూడా వృద్ధి చెందిందని చెప్పారు. సోమవారం రాజధాని మాస్కోలో అధ్యక్షుడు పుతిన్‌తో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పుతిన్‌పై విధంగా స్పందించారు. త్వరలో ప్రధాని మోదీతో భేటీ అవుతానని పుతిన్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను పుతిన్ గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ, పార్లమెంటరీ, ఆర్థిక రంగాల్లో సహకారం విస్తరించిందని వివరించారు. ఈ ఏడాది మన వాణిజ్య టర్నోవర్ పెరిగిందని పేర్కొన్నారు. గతేడాది కాస్తా తగ్గిందని.. కానీ ఈ ఏడాది పెరుగుతోందన్నారు. అందుకు రష్యా, భారత్ సంబంధాల అభివృద్ధికి వ్యక్తిగతంగా శ్రద్ద వహిస్తున్న ప్రధాని మోదీయే కారణమని పుతిన్ అభిప్రాయపడ్డారు. షాంఘై సహకార సంస్థ సదస్సులో భారత ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉందని పుతిన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కొండా సురేఖ అంశం క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది: సీఎం రేవంత్
నా పర్యటనను అడ్డుకోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమే: సీఎం రేవంత్ రెడ్డి
Read Latest National News And Telugu News