జనవరి 2నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Nov 28 , 2026 | 08:27 AM
శబరిమల అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నగరం నుంచి మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
హైదరాబాద్ సిటీ: శబరిమల అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నగరం నుంచి మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 2నుంచి 23వరకు ప్రతి శనివారం 07193 ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి కొల్లాంకు రాత్రి 11.10గంటలకు, జనవరి 4నుంచి 25వరకు 07194 ప్రత్యేక రైలు ప్రతి సోమవారం ఉదయం 10.55గంటలకు కొల్లాం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరుతుందని సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు.
ఈ ప్రత్యేక రైళ్లకు మార్గమధ్యంలో సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, ఎర్నాకుళం, కొట్టాయం తదితర స్టేషన్లలో హాల్ట్ ఉంటుందని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం ధర
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. శిలాతోరణం వరకు క్యూ
Read Latest AP News And Telangana News And International News And Telugu News