తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. శిలాతోరణం వరకు క్యూ
ABN , Publish Date - Nov 28 , 2026 | 06:59 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లలో, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోగా క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచి వున్నారు.
బుధవారం హుండీ ఆదాయం: రూ.4.30 కోట్లు
గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 57,756
తలనీలాలు సమర్పించినవారు: 21,917
ఈ వార్తలు కూడా చదవండి:
మత్స్యకారులు భద్రతా నియమావళి పాటించాలి
Read Latest AP News And Telangana News And International News And Telugu News