Share News

మత్స్యకారులు భద్రతా నియమావళి పాటించాలి

ABN , Publish Date - Nov 28 , 2026 | 06:41 AM

సముద్రంలో చేపల వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడు ప్రభుత్వం నిర్ధేశించిన భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

మత్స్యకారులు భద్రతా నియమావళి పాటించాలి

  • ప్రతి ఒక్కరూ బీమా పరిధిలోకి రావాలి

  • మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): సముద్రంలో చేపల వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడు ప్రభుత్వం నిర్ధేశించిన భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మత్స్యకారుల భద్రత, ట్రాన్స్‌పాండర్ల ఏర్పాటు, బోట్ల ఫిట్‌నెస్‌, బీమా సౌకర్యం తదితర అంశాలపై శుక్రవారం విజయవాడ క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడారు.

‘మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణశాఖ, ఆర్టీజీఎస్‌ జారీచేస్తున్న హెచ్చరికలను పట్టించుకోకుండా కొందరు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లడం ఆందోళనకరం. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించడం మత్స్యకారుల ప్రాణాలను కాపాడటానికే’ అని మంత్రి అన్నారు. రాష్ట్రంలో మత్స్యకారుల బోట్లలో 80శాతం ట్రాన్స్‌పాండర్లు అమర్చగా, మిగిలిన వాటిని త్వరగా అమర్చాలని మత్స్యశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ప్రతి మత్స్యకారుడిని భీమా పరిధిలోకి తీసుకురావాలని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 06:43 AM