Share News

సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలి

ABN , Publish Date - Nov 28 , 2026 | 06:48 AM

‘దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను తిప్పికొట్టేందుకు అన్ని దళాలు సంసిద్ధంగా ఉండాలి. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ వంటి ప్రత్యేక దళాలు నిరంతర శిక్షణ, నైపుణ్యాల మెరుగుదలతో ఈ సవాళ్లను మరింత సమర్థంగా ఎదుర్కోవాలి’

సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలి

  • అంతర్జాతీయ స్థాయిలో ఆక్టోపస్‌ అగ్రగామిగా నిలవాలి

  • దళాల హెడ్‌క్వార్టర్స్‌లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో డీజీపీ

అమరావతి, తాడేపల్లి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను తిప్పికొట్టేందుకు అన్ని దళాలు సంసిద్ధంగా ఉండాలి. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ వంటి ప్రత్యేక దళాలు నిరంతర శిక్షణ, నైపుణ్యాల మెరుగుదలతో ఈ సవాళ్లను మరింత సమర్థంగా ఎదుర్కోవాలి’ అని డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా సూచించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం నులకపేటలోని ఆక్టోపస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో సుమారు రూ.8 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఫిజికల్‌ కండిషనింగ్‌ గ్రౌండ్‌, లాంగ్‌ ఫైరింగ్‌ రేంజ్‌, మాడ్యులర్‌ సీక్యూబీ, కమాండో ఎండ్యూరెన్స్‌ ట్రైనింగ్‌ వంటి సౌకర్యాలను డీజీపీ శుక్రవారం ప్రారంభించారు.

మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ... ‘రాష్ట్ర విభజన తర్వాత ఆక్టోప్‌సకు సొంతంగా పూర్తిస్థాయి శిక్షణ ప్రాంగణం లేదు. ఈ కలను సాకారం చేసుకోవడానికి 42 ఎకరాల భూమిని కేటాయించని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని నిధులు ఆక్టోప్‌సకు సమకూర్చేందుకు కృషిచేస్తా. జాతీయ స్థాయిలో మన ఆక్టోపస్‌... అగ్ని పరీక్ష, విస్పోట్‌ కవచ్‌ లాంటి వాటిలో సత్తా చాటింది.’ అని వివరించారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 06:50 AM