Share News

హిమాలయాల్లో మేఘా మరో ఘనత

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:44 AM

హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) మరో ఘనతను సొంతం చేసుకుంది

హిమాలయాల్లో మేఘా మరో ఘనత
megha

  • చార్‌ధామ్‌ యాత్రికుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు

  • రిషికేశ్‌-కర్ణప్రయాగ్‌ మార్గంలో 6.59 కి.మీ సొరంగం తవ్వకం పూర్తి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) మరో ఘనతను సొంతం చేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని పవిత్ర చార్‌ధామ్‌ క్షేత్రాలైన బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి యాత్రలకు వెళ్లే భక్తుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు రిషికేశ్‌-కర్ణప్రయాగ్‌ రైల్వే ప్రాజెక్టు మార్గంలో 6.59 కి.మీ పొడవైన టన్నెల్‌-14 ప్రధాన సొరంగం తవ్వకాలను ఎంఈఐఎల్‌ విజయవంతంగా పూర్తి చేసింది. హిమాలయ పర్వతాల్లో అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, వాతావరణాన్ని అధిగమిస్తూ తమ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, కార్మికులు చూపిన అసాధారణ నైపుణ్యం, సమష్టి కృషికి ఇది నిదర్శనమని కంపెనీ పేర్కొంది. శ్రీనగర్‌-జమ్మూ మధ్య రాకపోకల సమయాన్ని తగ్గించే జోజిల టన్నెల్‌ పనులను కూడా ఈ కంపెనీయే పూర్తి చేసింది.

చార్‌ధామ్‌ యాత్రకు మెరుగైన రవాణా..

రిషికేశ్‌ నుంచి కర్ణప్రయాగ్‌ వరకు నిర్మిస్తున్న ఈ రైల్వే మార్గం ఉత్తరాఖండ్‌ పర్వత ప్రాంతాల రవాణా ముఖచిత్రాన్ని మార్చనుంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికులకు రైలు మార్గం ద్వారా పర్వత ప్రాంతాలకు చేరుకోవడం సులభతరం కానుంది. అక్కడి నుంచి రహదారి మార్గంలో యాత్రా క్షేత్రాలకు వెళ్లేందుకు మెరుగైన అనుసంధానం లభించనుంది. ముఖ్యంగా యాత్రా సీజన్‌లో రహదారులపై పెరిగే రద్దీ, ప్రయాణ సమయం, రవాణా ఇబ్బందులను తగ్గించేందుకు ఈ రైల్వే ప్రాజెక్టు దోహదపడనుంది.

ఇవి కూడా చదవండి:

అవన్నీ పట్టించుకోవడం మానేశా.. టీమిండియాలోకి రీఎంట్రీపై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు

కివీస్‌తో రెండో టెస్టు.. జడేజాను ఎందుకు పక్కన పెట్టారు?: గావస్కర్

Updated Date - Nov 28 , 2026 | 12:52 AM