కివీస్‌తో రెండో టెస్టు.. జడేజాను ఎందుకు పక్కన పెట్టారు?: గావస్కర్
ABN , Publish Date - Nov 27 , 2026 | 07:16 AM
న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టు ఎంపికపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అసంతృప్తి చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టు ఎంపికపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అసంతృప్తి చేశాడు. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఎందుకు పక్కన పెట్టారని మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించాడు. అందరూ సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడం గురించే మాట్లాడుతున్నారని, జడేజా విషయాన్ని ఎవరూ ప్రస్తావించడం లేదని వెల్లడించాడు.
‘ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ప్రస్తుత సైకిల్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో జడేజా మూడో స్థానంలో ఉన్నాడు. నాలుగు, ఐదో రోజు బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై కూడా బంతిని అద్భుతంగా టర్న్ చేయగల సామర్థ్యం జడేజాకు ఉంది. బౌలర్లకు పెద్దగా సహకరించని పిచ్‌లపైనా అతడి స్పిన్ ఉపయోగపడేది. అందరూ సిరాజ్ గురించే మాట్లాడుతున్నారు కానీ జడేజాను ఎందుకు పక్కన పెట్టా్ల్సి వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో పేసర్ సిరాజ్ కూడా అత్యధిక వికెట్లు తీసిన బౌలరే. అయినప్పటికీ జట్టు ఎంపిక తర్వాత అందరూ టీమ్‌కు మద్దతుగా నిలవాలి. తుది జట్టుపై ఎన్ని సందేహాలు ఉన్నా.. జట్టు ఎంపికయ్యాక అది మన భారత జట్టే. బరిలోకి దిగితే టీమిండియానే విజయం సాధించాలని నేనూ కోరుకుంటున్నా’ అని గావస్కర్ వివరించాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో యువ పేసర్ గుర్నూర్ బ్రార్‌కు అవకాశం కల్పించారు. 26 ఏళ్ల గుర్నూర్ ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. కాగా 38 ఓవర్లకు న్యూజిలాండ్ 1 వికెట్ నష్టానికి 106 పరుగులు చేసింది. క్రీజులో హెన్రీ నికోల్స్(15*), టామ్ లాథమ్(56*) ఉన్నారు. గుర్నూర్ ఒక వికెట్ తీశాడు.
ఇవి కూడా చదవండి:
అన్షుల్ కాంబోజ్‌కు మద్దతుగా నిలుద్దాం: బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్
వైభవ్ బ్యాట్‌లో ఎన్విడియా ఏఐ చిప్స్?.. ఐస్‌లాండ్ క్రికెట్ ఫన్నీ పోస్ట్!