విజయంతో ముగించాలని..
ABN , Publish Date - Nov 01 , 2026 | 03:59 AM
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ ముగింపు దశకు వచ్చింది. ఇప్పటికే సిరీస్‌ను ఖాతాలో వేసుకున్న టీమిండియాతో పాటు నాలుగో టీ20లో గెలిచిన...
మ.12.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో..
న్యూజిలాండ్‌తో భారత్ చివరి టీ20 నేడే
వైభవ్, కులదీప్‌లకు చాన్స్!
హామిల్టన్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ ముగింపు దశకు వచ్చింది. ఇప్పటికే సిరీస్‌ను ఖాతాలో వేసుకున్న టీమిండియాతో పాటు నాలుగో టీ20లో గెలిచిన ఆతిథ్య కివీస్ సైతం మరో చక్కటి విజయంతో ధనాధన్ పోరును ముగిద్దామనుకుంటున్నాయి. ఈనేపథ్యంలో ఆదివారం ఇరు జట్ల మధ్య ఆఖరిదైన ఐదో టీ20 జరుగనుంది. అయితే హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టిన టీమిండియాకు ఆక్లాండ్‌లో గట్టి షాకే తగిలింది. బౌలర్లు, బ్యాటర్లు సమష్ఠిగా విఫలం కావడంతో భారీ ఓటమిని ఎదుర్కొంది. సిరీస్‌ను విజయంతో ముగిద్దామనుకుంటున్న వేళ నేటి మ్యాచ్‌లో తమ తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. దీంతో టీమ్ మేనేజ్‌మెంట్ వైభవ్‌ను ఓపెనర్‌గా తిరిగి బరిలోకి దించే ఆలోచన చేస్తోంది. శాంసన్‌కు ఎంత మద్దతు లభిస్తున్నా తను ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అర్ధసెంచరీ మినహా రాణించలేకపోయాడు. అటు కెప్టెన్ శ్రేయాస్ బ్యాటింగ్ కూడా ఆశించిన రీతిలో లేదు. విండీస్‌పై సెంచరీ తర్వాత తను ఆడిన ఎనిమిది టీ20ల్లో చేసింది 155 పరుగులే. చివరి మ్యాచ్‌లోనైనా స్థాయికి తగ్గట్టు చెలరేగాల్సి ఉంది. అయితే తన వైఫల్యాన్ని లోయరార్డర్‌లో నమన్, నితీశ్ తుఫాన్ ఆటతీరుతో భర్తీ చేస్తున్నారు. అటు బౌలింగ్ విభాగంలోనూ లోపాలు కనిపిస్తున్నాయి. నాలుగేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన వెటరన్ పేసర్ భువనేశ్వర్ పూర్తిగా తేలిపోయాడు. మూడు మ్యాచ్‌ల్లో 11.58 ఎకానమీతో ఒక్క వికెట్ తీయగలిగాడు. దీంతో గత మ్యాచ్‌లో వేటు పడింది. ముఖ్యంగా అర్షద్‌పైన జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. నమన్ ధిర్, నితీశ్ బ్యాటింగ్‌లో రాణిస్తున్నా బౌలింగ్‌లో పరుగులను కట్టడి చేయలేకపోతున్నారు. స్పెషలిస్ట్ బౌలర్‌ను ఆడించాలనుకుంటే కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవచ్చు. అదే జరిగితే నమన్ బెంచీకి పరిమితం కావాల్సిందే.
ఆత్మవిశ్వాసంతో కివీస్: ఆతిథ్య కివీస్ మాత్రం ఆత్మవిశ్వాసంతో ఉంది. ఫిలిప్స్, బ్రేస్‌వెల్, ఆలెన్ ఫామ్‌లో ఉండడంతో పాటు బౌలర్లు కూడా పుంజుకున్నారు. దీంతో మరో విజయంతో భారత్ ఆధిక్యాన్ని తగ్గించి ఆతిథ్య జట్టు వన్డే సిరీ్‌సకు సిద్ధం కావాలనుకుంటోంది.
తుది జట్లు (అంచనా)
భారత్: అభిషేక్, వైభవ్/శాంసన్, ఇషాన్, శ్రేయాస్ (కెప్టెన్), తిలక్, అక్షర్, నితీశ్, నమన్/కులదీప్, అర్ష్‌దీప్, ప్రిన్స్, మయాంక్.
న్యూజిలాండ్: సైఫర్ట్, ఆలెన్, మిచెల్, ఫిలిప్స్, జాకబ్స్, బ్రేస్‌వెల్, శాంట్నర్ (కెప్టెన్), స్మిత్, మిల్నే, డఫీ, ఫిషర్.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య
పాక్ విజయంపై పోస్ట్.. ఇంత బిల్డప్ అవసరమా అంటూ ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్!