Share News

ప్రముఖ విద్యావేత్త మంగాదేవి కన్నుమూత

ABN , Publish Date - Nov 28 , 2026 | 07:00 AM

ప్రముఖ విద్యావేత్త, సామాజిక ేసవకురాలు, రచయిత్రి డాక్టర్‌ నన్నపనేని మంగాదేవి (89) శుక్రవారం కన్నుమూశారు.

ప్రముఖ విద్యావేత్త మంగాదేవి కన్నుమూత

  • గుంటూరు కేంద్రంగా ఆరు దశాబ్దాలుగా విద్యా, సామాజిక, సాహిత్య సేవలు

  • దేశానికి మేధావుల్ని అందించిన బాల కుటీర్‌

  • మదర్‌థెరెసా స్ఫూర్తితో చేతన ట్రస్టు నిర్వహణ

  • బాలల కోసం విస్తృతంగా సాహిత్య సృష్టి

  • జమ్నాలాల్‌ బజాజ్‌ సహా జాతీయ, రాష్ట్ర అవార్డులు

  • విద్యా మంత్రి లోకేశ్‌ సహా ప్రముఖుల నివాళులు

గుంటూరు(విద్య), నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ విద్యావేత్త, సామాజిక ేసవకురాలు, రచయిత్రి డాక్టర్‌ నన్నపనేని మంగాదేవి (89) శుక్రవారం కన్నుమూశారు. ఆరు దశాబ్దాలకు పైగా గుంటూరు కేంద్రంగా విద్యా, సాహిత్య, సామాజిక ేసవా రంగాల్లో మంగాదేవి విశేష సేవలందించారు. గుంటూరు బ్రాడీపేటలో శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్‌ను ఏర్పాటుచేయడం ద్వారా దేశానికి గొప్ప మేధావులను, ఉన్నత విద్యావంతులను అందించారు.

ఈ విద్యాసంస్థను ఆమె 1965లో ఒక బాలికతో ప్రారంభించారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, స్వతంత్ర ఆలోచన, సృజనాత్మకత పెంపొందించేలా వినూత్న విద్యా విధానాలను ఆ విద్యాసంస్థలో ప్రవేశపెట్టారు. మదర్‌ థెరెసా స్ఫూర్తితో 1990లో చేతన చారిటబుల్‌ ట్రస్ట్‌ను స్థాపించారు. విద్య, ఆరోగ్యం, మహిళా సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి ఈ ట్రస్టు ద్వారా విశేష కృషి చేశారు. బాలల కోసం సుమారు 25 పుస్తకాలు రచించారు. బాలల్ని ప్రొత్సహించడానికి, సంగీత, సాహిత్యాభివృద్ధి కోసం ఏటా రాష్ట్రస్థాయిలో లలిత కళాఉత్సవాలను మంగాదేవి నిర్వహిస్తున్నారు. 1937 జూలై 1న తెనాలిలో జన్మించిన మంగాదేవి ఖ్యాతి గుంటూరు జిల్లాను దాటి దేశమంతా వ్యాపించింది.


ఆమె సేవలకు జమ్నాలాల్‌ బజాజ్‌ పురస్కారం సహా అనేక జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు లభించాయి. ఆమె మృతి పట్ల విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ విచారం వ్యక్తం చేశారు. ‘‘మంగాదేవి మరణవార్త తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. పిల్లల పట్ల అమెకు ఉండే అపారమైన ప్రేమ, వారికి విలువలతో కూడిన విద్య అందించాలనే పట్టుదల స్ఫూర్తిదాయకం.’’ అని ఒక ప్రకటనలో కొనియాడారు. విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య, భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌, ఎంపీ భాష్యం రామకృష్ణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తదితరులు మంగాదేవి మృతి పట్ల సంతాపం తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 07:04 AM