పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పొడిగింపు.. డిసెంబర్ 2 వరకు అవకాశం
ABN , Publish Date - Nov 28 , 2026 | 07:15 AM
వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా పరీక్షల ఫీజు చెల్లించే గడువును ఎస్ఎస్సీ బోర్డు మరోసారి పొడిగించింది.
హైదరాబాద్, నవంబర్ 28: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా పరీక్షల ఫీజు చెల్లించే గడువును ఎస్ఎస్సీ బోర్డు మరోసారి పొడిగించింది. అసలు అయితే నవంబర్ 26వ తేదీతో ఈ గడువు ముగిసింది. దీనిని డిసెంబర్ 2వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ఎస్ఎస్సీ బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది.