Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Mar 03 , 2026 | 06:51 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Breaking News

Live News & Updates

  • Mar 03, 2026 21:31 IST

    తెరుచుకున్న శ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలు

    • నంద్యాల : చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న శ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలు..

    • ఆలయశద్ది, సంప్రోక్షణ నిర్వహించిన అర్చకులు..

    • రేపు ఉదయం 4:30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతి..

  • Mar 03, 2026 21:17 IST

    ఆటోను ఢీకొన్న డీసీఎం వ్యాన్.. యువకుడి మృతి..

    • పోలవరం జిల్లా: ఎటపాక మండలం లక్ష్మీపురం వద్ద రోడ్డు ప్రమాదం..

    • జాతీయ రహదారిపై ఆటోను ఢీకొన్న డీసీఎం వ్యాన్..

    • పైలా సాయి అనే యువకుడి మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు..

  • Mar 03, 2026 21:05 IST

    మియాపూర్‌లో దారుణ హత్య..

    • హైదరాబాద్‌లోని మియాపూర్ పోగుల ఆగయ్య నగర్‌లో అన్నదమ్ముల మధ్య ఘర్షణ..

    • మద్యం మత్తులో అన్నను బండ రాయితో మోది, కత్తితో పొడిచి చంపిన తమ్ముడు..

    • తరచూ తాగి గొడవ చేస్తూ వేధిస్తున్నాడని హత్య.. పోలీసుల అదుపులో నిందితుడు..

  • Mar 03, 2026 20:43 IST

    విజయవాడ: లిక్కర్‌ స్కాం కేసులో వాసుదేవరెడ్డికి కస్టడీ

    • రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి ఏసీబీ కోర్టు ఆదేశాలు..

    • ఈనెల 5, 6 తేదీల్లో వాసుదేవరెడ్డి(A2)ని ప్రశ్నించనున్న సిట్‌..

  • Mar 03, 2026 20:17 IST

    కాకినాడ: వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనపై విచారణ కమిటీ

    • మున్సిపల్‌ పరిపాలన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేష్‌కుమార్‌..

    • ఈగల్‌ ఐజీ రవికృష్ణ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు

    • నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం..

    • ప్రమాద ఘటనకు బాధ్యులను గుర్తించాలని ఆదేశం..

  • Mar 03, 2026 20:07 IST

    తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్..

    • నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై..

    • చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికులతో కలిసి కవిత ధర్నా..

    • హైడ్రా బుల్డోజర్లు వచ్చే వరకూ ఆందోళన విరమించేది లేదని బైఠాయించిన కవిత

    • కవితను అరెస్ట్ చేసిన పోలీసులు.. నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలింపు..

  • Mar 03, 2026 19:58 IST

    రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

    • రేపు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి ..

    • రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై అధిష్టానంతో చర్చించనున్న సీఎం రేవంత్..

    • రెండు అభ్యర్థిత్వాల్లో ఇప్పటికే అభిషేక్ సింఘ్వీ పేరును ప్రకటించిన కాంగ్రెస్‌..

  • Mar 03, 2026 19:43 IST

    వీడిన సంపూర్ణ చంద్ర గ్రహణం..

    • తెరుచుకున్న తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలు..

    • శుద్ధి, పుణ్యావహచనం అనంతరం కైంకర్యాల నిర్వహణ..

    • రాత్రి 8.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్న టీటీడీ..

  • Mar 03, 2026 19:34 IST

    కామారెడ్డి జిల్లా : సదాశివనగర్ మండలంలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం..

    • మర్కల్ గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి ఢీకొన్న ఆర్టీసీ బస్సు..

    • బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్రగాయాలు..

    • గాయపడిన వారిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలింపు..

    • నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపునకు వస్తుండగా ప్రమాదం..

  • Mar 03, 2026 19:32 IST

    నిజామాబాద్: బోధన్‌లో హోలీ పండుగ వేళ విషాదం

    • పట్టణంలోని ఆచన్‌పల్లికి చెందిన ఇద్దరు యువకుల మృతి

    • మంజీరా నదిలో స్నానానికి వెళ్లిన యువకులు.. నీట మునిగి మృతి..

    • మృతులు రోను చౌదరి ( 19), సాయికుమార్ (20) గా గుర్తింపు..

  • Mar 03, 2026 19:29 IST

    తెలంగాణ నుంచి మరోసారి రాజ్యసభకు అభిషేక్‌ సింఘ్వీ

    • రేపు ఉదయం హైదరాబాద్‌ రానున్న అభిషేక్‌ సింఘ్వీ

    • కాసేపట్లో మరో అభ్యర్థిని ప్రకటించనున్న కాంగ్రెస్‌ అధిష్టానం

    • రేపు ఉ.11 గంటలకు నామినేషన్‌ వేయనున్న కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థులు

  • Mar 03, 2026 19:09 IST

    హైదరాబాద్‌: నాంపల్లిలో HCA ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్న క్రికెట్‌ సంఘాలు

    • HCAలో రూ.70 కోట్ల అవినీతి జరిగిందంటూ నినాదాలు..

    • విశాఖ ఇండస్ట్రీస్‌కి రూ.70 కోట్లు చెల్లించారని ఆరోపణ..

    • చెల్లింపుల వెనుక తన ప్రయేయం లేదన్న HCA ప్రెసిడెంట్‌..

    • ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

  • Mar 03, 2026 19:08 IST

    దేశంలో ముగిసిన చంద్ర గ్రహణం

    • సా.6:47 వరకు కొనసాగిన చంద్రగ్రహణం

    • చంద్ర గ్రహణంతో పలు ఆలయాల మూసివేత

  • Mar 03, 2026 19:07 IST

    ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియన్‌ కీలక ప్రకటన

    • యుద్ధ పరిస్థితుల్లోనూ దేశం ధైర్యంగా నిలిచింది..

    • ప్రభుత్వ యంత్రాంగం అద్భుతంగా పనిచేస్తోంది..

    • ప్రావిన్స్‌ గవర్నర్లతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి..

    • అసాధారణ పరిస్థితులున్నా దేశ కార్యకలాపాలు ఆగలేదు: మసూద్‌ పెజెష్కియన్‌

  • Mar 03, 2026 18:44 IST

    ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి

    • సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భవనంపైనా బాంబులు జారవిడిచాం..

    • సైనికాధికారుల శిక్షణా సంస్థ, మౌలిక సదుపాయలను టార్గెట్ చేశామన్న ఐడీఎఫ్..

  • Mar 03, 2026 18:43 IST

    ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కొత్త రక్షణ మంత్రి సైయద్ మాజిద్ అల్‌-రేజా మృతి

    • రెండ్రోజుల క్రితమే దాడుల్లో రక్షణ మంత్ర అమీర్ నసీర్జాదే మృతి..

    • వెంటనే బాధ్యతలు చేపట్టిన అల్-రేజా..

    పూర్తి కథనం..

  • Mar 03, 2026 18:40 IST

    నెల్లూరు: అంతర్జాతీయ క్రికెట్‌ బుకీలు మహేష్‌, హరికృష్ణ అరెస్టు

    • దుబాయ్‌, బ్యాంకాక్‌ నుంచి క్రికెట్‌ బెట్టింగ్స్‌ నిర్వహణ..

    • నిందితుల బ్యాంక్‌ ఖాతాల్లోని రూ.2.5 కోట్ల సీజ్‌..

    • బ్యాంకాక్‌లో భారీగా భూములు, స్థలాలు, కార్లు, షేర్లు కొనుగోలు..

    • రూ.34 లక్షల నగదు, 17 మొబైల్స్‌, ల్యాప్‌టాప్‌ సహా ఇతర సామగ్రి స్వాధీనం..

  • Mar 03, 2026 18:36 IST

    ఇరాన్‌పై మరోసారి ట్రంప్‌ ఆగ్రహం

    • ఇరాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌, నేవీని నాశనం చేశాం..

    • మాతో చర్చలకు సిద్ధమని ఇరాన్‌ అంటోంది..

    • కానీ ఇప్పటికే ఆలస్యమైంది: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

    పూర్తి కథనం..

  • Mar 03, 2026 18:16 IST

    వివేక హత్య కేసు: నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పిటిషన్..

    • తల్లి ఆరోగ్యం సరిగ్గా లేదని, చికిత్స కోసం నెల రోజులు కడపకు వెళ్లేందుకు..

    • అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు..

    • శివశంకర్ రెడ్డి పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ, సునీతా రెడ్డి.. ఎల్లుండి విచారణ

  • Mar 03, 2026 18:12 IST

    సంగారెడ్డి: ఇస్నాపూర్ మున్సిపల్‌ కౌన్సిలర్ మాధవిపై అనర్హత వేటు

    • 8 వార్డు నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన మాధవి..

    • చైర్మన్ ఎన్నిక సందర్భంగా BRSకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్..

    • BRS మద్దతుతో వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన మాధవి..

    • విప్ ధిక్కరించినట్లు విచారణలో తేలడంతో మాధవిపై అనర్హత వేటు..

  • Mar 03, 2026 18:07 IST

    బహ్రెయిన్‌ ఎయిర్‌పోర్టు లక్ష్యంగా ఇరాన్‌ దాడులు

    • ఇప్పటికే మూడు చోట్ల భారీ విస్ఫోటనాలు..

    • బహ్రెయిన్‌ వ్యాప్తంగా సైరన్‌ అలర్ట్..

    • ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రకటన..

  • Mar 03, 2026 17:43 IST

    వాణిజ్య నౌకలపై దాడులను ఖండించిన భారత్‌

    • గల్ప్‌లో కోటి మందికిపైగా భారతీయులు..

    • భారతీయుల భద్రతే ముఖ్యం..

    • వాణిజ్య, ఇంధన సరఫరా మార్గాలను అడ్డుకుంటే..

    • ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ముప్పు: : భారత విదేశాంగ శాఖ

  • Mar 03, 2026 17:37 IST

    ఇరాన్‌ దాడుల్లో ఆరుగురు అమెరికా సైనికుల మృతి

    • కువైట్‌లోని అమెరికా స్థావరంపై ఇరాన్‌ డ్రోన్ల దాడి

  • Mar 03, 2026 17:36 IST

    కొంతమంది కలెక్టర్లపై సీఎం రేవంత్‌ ఆగ్రహం

    • పలువురు కలెక్టర్లు జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో ఉండడం లేదు: సీఎం రేవంత్‌

    • ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల పాటు..

    • జిల్లా విడిచి వెళ్లొద్దు, నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదు: సీఎం రేవంత్‌

    • ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలి: సీఎం రేవంత్‌ రెడ్డి

  • Mar 03, 2026 17:13 IST

    ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై నోరు విప్పిన పాకిస్తాన్

    • ఇరాన్‌పై యుద్ధాన్ని బలవంతంగా రుద్దారన్న పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్..

    • జయోనిజం మానవాళికి ముప్పు అని వ్యాఖ్య..

    పూర్తి కథనం..

  • Mar 03, 2026 17:13 IST

    ఇరాన్‌లోని నటాంజ్ అణుశుద్ధి కేంద్రంపై దాడిని ధ్రువీకరించిన ఐఏఈఏ

    • హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ ఆధారంగా నిర్ధారణ..

    • ఫెసిలిటీ ఎంట్రన్స్ వద్ద భవంతులకు నష్టం కలిగినట్టు అంచనా..

    • రేడియేషన్ లీక్ అయినట్టు ఎలాంటి సంకేతాలూ లేవని వెల్లడి..

  • Mar 03, 2026 16:52 IST

    ఇరాన్‌కు రష్యా మద్దతు..

    • ఇరాన్ అణ్వాయుధాలు తయారుచేస్తున్నట్లు ఆధారాల్లేవ్‌: రష్యా

    • దాడులతో అరబ్‌ దేశాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం: రష్యా

  • Mar 03, 2026 16:45 IST

    గల్ఫ్‌లో చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇరాన్‌ దాడులు

    • UAEలో పుజైరా ఆయిల్‌ ఫీల్డ్‌పై ఇరాన్‌ డ్రోన్‌ దాడి..

    • ఆయిల్‌ ఫీల్డ్‌ నుంచి భారీగా ఎగసిపడుతున్న మంటలు..

  • Mar 03, 2026 16:34 IST

    సెంట్రల్‌ ఇజ్రాయెల్‌ను తాకిన ఇరాన్‌ క్షిపణి

    • ఫ్రాగ్మెంటేషన్‌ వార్‌హెడ్‌తో ఇరాన్‌ క్షిపణి దాడి

    • క్షిపణి దాడితో పెటా టిక్వా నగరంలో భారీ నష్టం

  • Mar 03, 2026 16:31 IST

    జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ

    • పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ పిటిషన్లు..

    • కేసీఆర్, హరీశ్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ పిటిషన్లు..

    • ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు..

  • Mar 03, 2026 16:27 IST

    అవయవదానంలో ఆరో స్థానంలో ఏపీ: మంత్రి సత్యకుమార్

    • జీవన్‌‌దాన్ కార్యకలాపాలపై మంత్రి సమీక్ష..

    • అవయవదానంపై స్పందన గణనీయంగా పెరిగింది: మంత్రి

    • రెండు నెలల్లో 64 మందికి కొత్త జీవితం: మంత్రి సత్యకుమార్

  • Mar 03, 2026 15:51 IST

    కోనసీమలో ఫైర్ క్రాకర్స్ షాప్స్‌పై పోలీసుల మెరుపు దాడులు

    • అనుమతి లేని షాపుల సీజ్..

    • అమలాపురం డివిజన్‌లో ఉండే ఐదు షాపులను సీజ్ చేసిన డీఎస్పీ ప్రసాద్..

    • అనుమతులు లేకుండా క్రాకర్స్ తయారు చేస్తే కఠిన చర్యలు: డీఎస్పీ

    పూర్తి కథనం..

  • Mar 03, 2026 15:40 IST

    ఇరాన్‌పై అమెరికా దాడులను ఖండించిన చైనా

    • అణు కార్యక్రమంపై మళ్లీ చర్చలు జరపాలని సూచన..

    • చర్చల సమయంలో దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అన్న చైనా..

    • రాజకీయ, దౌత్య మార్గంలోనే పరిష్కారం సాధ్యమని స్పష్టీకరణ..

  • Mar 03, 2026 15:38 IST

    దేశంలో ప్రారంభమైన చంద్రగ్రహణం

    • సా.6:47 వరకు కొనసాగనున్న చంద్రగ్రహణం..

    • చంద్రగ్రహణంతో పలు ఆలయాలు మూసివేత..

  • Mar 03, 2026 15:38 IST

    ఇజ్రాయెల్‌, అమెరికా దాడులపై ఇరాన్ ప్రకటన

    • ఇరాన్‌లో ఇప్పటివరకు 780 మందికిపైగా మృతి..

    • ఇరానియన్‌ రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ ప్రకటన..

  • Mar 03, 2026 15:26 IST

    ప్రధాని మౌనాన్ని వీడాలి: రాహుల్ గాంధీ

    • ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిపై స్పందించాలని డిమాండ్..

    • ఈ సమయంలో మౌనం తగదని వ్యాఖ్య..

    • ప్రపంచంలో భారత్ స్థాయి దిగజారొచ్చని హెచ్చరిక..

    పూర్తి కథనం..

  • Mar 03, 2026 13:54 IST

    ఇరాన్‌లో భూప్రకంపనలు

    • ఇరాన్‌లో భూప్రకంపనలు, 4.3 తీవ్రతగా నమోదు

    • గెరాష్ ప్రాంతం కేంద్రంగా ప్రకంపనలు

    పూర్తి కథనం..

  • Mar 03, 2026 13:51 IST

    ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ రేసులో ఖమేనీ కుమారుడు మొజ్తాబా

    • మొజ్తాబాకు మొగ్గు చూపుతున్న రివల్యూషనరీ గార్డ్స్

    • వారసత్వం విమర్శలు వచ్చే అవకాశముందని వెనక్కి తగ్గిన ఆర్జీసీ

  • Mar 03, 2026 13:32 IST

    హైదరాబాద్: మియాపూర్‌లో ప్రేమ విఫలమైందని నర్స్ ఆత్మహత్య

    • హాస్టల్‌ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని సోనుభాయ్(20) ఆత్మహత్య

    • మృతురాలు మెదక్ జిల్లా నారాయణఖేడ్ వాసిగా గుర్తింపు

  • Mar 03, 2026 13:23 IST

    హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల సరదా రైడ్.. విషాదం

    • నాగోల్ శివారులో ఘోర రోడ్డుప్రమాదం

    • విద్యార్థి మృతి.. మరో విద్యార్థికి తీవ్రగాయాలు

    • స్పోర్ట్‌ బైక్‌పై వేగంగా వెళ్తుండగా ప్రమాదం

    పూర్తి కథనం

  • Mar 03, 2026 13:21 IST

    మహరాష్ట్ర: నాగ్‌పూర్‌లో అర్ధరాత్రి నడిరోడ్డుపై చిక్కుకుపోయిన హైదరాబాదీలు

    • వారణాసి నుంచి హైదరాబాద్‌కు 15మంది హైదరాబాద్‌ వాసుల ప్రయాణం

    • నాగ్‌పూర్‌లో అర్ధరాత్రి రోడ్డుపై దించేసి వెళ్లిపోయిన డ్రైవర్

    • ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్‌ను సంప్రదించగా.. నిర్లక్ష్య సమాధానం

  • Mar 03, 2026 12:48 IST

    అమెరికాను యుద్ధంలోకి లాగడం సరికాదు: డెమోక్రాట్లు

    • ఇరాన్ నుంచి ముప్పు అమెరికాకు కాదు.. ఇజ్రాయెల్‌కే: డెమోక్రాట్లు

    • ఇజ్రాయెల్ చర్యలతో US సైన్యం ప్రమాదంలో పడింది: డెమోక్రాట్లు

  • Mar 03, 2026 12:18 IST

    భారత్ చేరుకున్న స్టార్ షట్లర్ పీవీ సింధు

    • మంగళవారం ఉదయం బెంగళూరుకు చేరుకున్న పీవీ సింధు

    • ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించిన సింధు

    • ఇంగ్లండ్ వెళ్లే క్రమంలో దుబాయ్‌లో చిక్కుకున్న సింధు

    పూర్తి కథనం

  • Mar 03, 2026 11:56 IST

    ఖమేనీ మృతిపై భారత్ మౌనం.. కేంద్రంపై సోనియా ఆగ్రహం

    • భారత ప్రధాని అమెరికా, ఇజ్రాయెల్ నరమేధాన్ని పట్టించుకోవటం లేదు: సోనియా

    • ఖమేనీ హత్యను ఖండించకపోవటం తటస్థ వైఖరి కాదు: సోనియా

    • కేంద్రం తీరు వల్ల భారత్ విశ్వసనీయతపై సందేహాలు: సోనియా

    పూర్తి కథనం

  • Mar 03, 2026 11:55 IST

    ఇరాన్ దాడుల నేపథ్యంలో దుబాయ్‌లో ఉద్రిక్త పరిస్థితులు

    • ఫేక్ న్యూస్ కారణంగా ఇళ్లకే పరిమితం అవుతున్న జనం

    • ప్రజల్లో భయాన్ని పోగొట్టడానికి షాపింగ్ మాల్‌కు వెళ్లిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్

    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

  • Mar 03, 2026 11:54 IST

    ఇండోనేషియాలో భూప్రకంపనలు

    • సుమత్రా ద్వీపంలో పలుచోట్ల కంపించిన భూమి

    • రిక్టర్ స్కేలుపై 6.1గా తీవ్రత నమోదైనట్టు యూజీజీఎస్ ప్రకటన

    • ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని వెల్లడి

    పూర్తి కథనం

  • Mar 03, 2026 11:40 IST

    చంద్రబాబు, పవన్ భేటీ..

    • ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ భేటీ

    • గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ

    • ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కసరత్తుపై చర్చ

  • Mar 03, 2026 11:11 IST

    పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన వ్యాఖ్యలు

    • భారతదేశం మరో యుద్ధానికి సిద్ధమవుతోంది: ఆసిఫ్ అలీ

    • న్యూఢిల్లీ వెనక్కి తగ్గి శాంతియుత చర్చలకు రావాలి: ఆసిఫ్ అలీ

    పూర్తి కథనం

  • Mar 03, 2026 11:10 IST

    కేంద్ర మాజీమంత్రి ఉన్నికృష్ణన్ కన్నుమూత

    • కొన్నిరోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఉన్నికృష్ణన్

    • కేరళ కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన కేంద్ర మాజీమంత్రి

    • కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర క్యాబినెట్‌లో సేవలందించిన ఉన్నికృష్ణన్

    పూర్తి కథనం

  • Mar 03, 2026 11:08 IST

    హైదరాబాద్ బులియన్ మార్కె‌ట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,70,020

    • నిన్నటి ధరతో పోల్చుకుంటే దాదాపు రూ.500 మేర తగ్గుదల నమోదు

    • ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,850

    • నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.450 మేర తగ్గుదల

    పూర్తి కథనం

  • Mar 03, 2026 11:00 IST

    సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

    • తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదలకు డిమాండ్

    • గత ఎన్నికల్లో కాంగ్రెస్ 6 గ్యారెంటీలు, 420 హామీలిచ్చింది: కిషన్‌రెడ్డి

    • హామీలు అమలు చేయమంటే నిధులు లేవని తప్పించుకుంటోంది: కిషన్‌రెడ్డి

  • Mar 03, 2026 11:00 IST

    రాజమహేంద్రవరం బొబ్బిల్లంకలో దారుణం

    • భార్యను అతి కిరాతంగా చంపిన భర్త

    • అడ్డొచ్చిన అత్తను సైతం కత్తితో నరికి చంపిన అల్లుడు సోడదాసి పండు

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీతానగరం పోలీసులు

    పూర్తి కథనం

  • Mar 03, 2026 10:45 IST

    పర్యావరణ, జంతుప్రేమికులకు శుభాకాంక్షలు: పవన్‌ కల్యాణ్‌

    • ఏపీ అటవీశాఖ చరిత్రలో ఇదో కీలక అడుగు: డిప్యూటీ సీఎం పవన్‌

    • వన్యప్రాణులు, మనుషుల మధ్య సంఘర్షణ తగ్గించేందుకే హనుమాన్‌ ఫౌండేషన్‌ ప్రాజెక్ట్‌: పవన్‌ కల్యాణ్‌

    • వన్యప్రాణుల నుంచి మనుషులను రక్షించేందుకు చర్యలు: పవన్‌

    • ఏనుగుల వల్ల పంటలకు నష్టం జరగకుండా చర్యలు: పవన్‌

    పూర్తి కథనం

  • Mar 03, 2026 10:28 IST

    హోర్ముజ్ జలసంధి మూసివేత

    • ముడి చమురు రవాణాకు కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధి మూసివేత

    • ఏ నౌక అయినా దాటడానికి ప్రయత్నిస్తే కాల్చేస్తామని ఇరాన్ హెచ్చరిక

    • ఈ జలసంధిని పూర్తిగా మూసేయడంతో చమురు ధరలు మరింత పెరిగే ఛాన్స్

    పూర్తి కథనం

  • Mar 03, 2026 10:17 IST

    ఏపీలో ఘనంగా ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం

    • మంగళగిరి: ఏపీఎస్పీ బెటాలియన్‌ ప్రాంగణంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం

    • కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

    • అటవీశాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించిన పవన్‌

    • వన్యప్రాణులను కాపాడేందుకు హనుమాన్‌ ఫౌండేషన్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం

    పూర్తి కథనం

  • Mar 03, 2026 09:59 IST

    శ్రీకాహళహస్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు

    • చంద్రగ్రహణం ఉన్నా తెరిచి ఉన్న శ్రీకాళహస్తి ఆలయం

    • గ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల మూసివేత

    • గ్రహణ సమయంలోనూ తెరిచి ఉండే ఏకైక ఆలయం శ్రీకాళహస్తి ఆలయం

    పూర్తి కథనం

  • Mar 03, 2026 09:58 IST

    పాక్-అఫ్గాన్ సరిహద్దులో ఉద్రిక్తత

    • మారూఫ్ జిల్లాలో పాక్-అఫ్గాన్ బలగాల మధ్య కాల్పులు

    • మిలటరీ పోస్టుకు నిప్పంటించిన తాలిబన్లు

    • ఇద్దరు పాక్ సైనికుల మృతి, ముగ్గురికి గాయాలు

    • షోరాబాక్ ప్రాంతంలో పాకిస్థాన్ ఔట్‌పోస్ట్ స్వాధీనం

  • Mar 03, 2026 09:58 IST

    సౌదీలోని అమెరికా పౌరులకు సెక్యూరిటీ అలర్ట్

    • షెల్టర్ ఇన్ ప్లేస్ నోటిఫికేషన్ జారీ చేసిన US

    • తాము సూచించిన ప్రదేశంలోనే ఆశ్రయం పొందాలని ఆదేశం

    • స్మార్ట్ ట్రావెలర్ ఎన్‌రోల్‌మెంట్ ప్రోగ్రామ్‌లో..

    • నమోదు చేసుకోవాలని అమెరికా ప్రభుత్వం సూచన

  • Mar 03, 2026 09:47 IST

    లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి

    • ఘటనలో PIJ కమాండర్ అబూ హమ్జా మృతి

    • హమ్జాను మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన

    పూర్తి కథనం

  • Mar 03, 2026 08:48 IST

    సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్‌ దాడి

    • ఎంబసీ భవనానికి స్వల్ప నష్టం.. ఖాళీగా ఉండడంతో తప్పిన ప్రాణాపాయం

    • ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

    పూర్తి కథనం

  • Mar 03, 2026 08:02 IST

    తిరుపతి: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆలయాల మూసివేత

    • తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం ఉ.9 గంటలకు మూసివేత

    • గ్రహణం కారణంగా పద్మావతి అమ్మవారి ఆలయం మూసివేత

    • ఉ.9 నుంచి రాత్రి 7:30 వరకు మహాద్వారం మూసివేత

  • Mar 03, 2026 08:01 IST

    నా ఫేవరెట్ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్: సంజు

    • అల్లు అర్జున్ అన్నీ సినిమాలను చూస్తుంటాను: సంజు

    • మహేశ్ బాబు అంటే కూడా ఇష్టమే: సంజు

    • మహేశ్ బాబు స్టైల్ బాగుంటుంది: సంజు

    • ర్యాపిడ్ ఫైర్ చిట్ చాట్‌లో వెల్లడించిన సంజు

    పూర్తి కథనం

  • Mar 03, 2026 07:58 IST

    హోలీ శుభాకాంక్షలు..

    • ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్

    • హోలీ పండుగ మనందరి జీవితాల్లో కొత్త రంగులు అద్దుతుంది: చంద్రబాబు

    • చెడుపై గెలిచిన మంచికి సంకేతం హోలీ: నారా లోకేశ్

    పూర్తి కథనం

  • Mar 03, 2026 07:36 IST

    హైదరాబాద్: పాతబస్తీలో కొనసాగుతున్న ఆందోళనలు

    • ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నిరసనలు

    • ఖమేనీ ఫొటోలతో పాతబస్తీలో ముస్లింల ర్యాలీలు

  • Mar 03, 2026 07:35 IST

    నేడు దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు

    • ఉస్మానియా కాలేజీలో పాల్గొననున్న రాంచందర్‌రావు

    • హోలీ సందర్భంగా హైదరాబాద్‌లో వైన్ షాపులు, బార్లు బంద్

    • సాయంత్రం 6గంటల వరకు వైన్స్, బార్లు బంద్

  • Mar 03, 2026 07:21 IST

    శ్రీవారి ఆలయం మూసివేత

    • తిరుమల: నేడు చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేత

    • ఉ.9గంటలకు గర్భాలయంతోపాటు మహాద్వారం తలుపుల మూసివేత

  • Mar 03, 2026 07:08 IST

    బంగారం, వెండి ధరలు ఇవే..

    • ఈరోజు ఉదయం 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,70,500

    • ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,290

    • ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,70,650

    • 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,56,440

    • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3.15 లక్షలు

    పూర్తి కథనం

  • Mar 03, 2026 06:55 IST

    గల్ఫ్‌లో చమురు నౌకలకు ఇన్సూరెన్స్‌ రద్దు

    • నౌకలకు వార్ రిస్క్‌ కవరేజ్‌ ఇన్సూరెన్స్‌ రద్దు

    • దాడులతో ఇప్పటికే 4 ఆయిల్ ట్యాంకర్లు ధ్వంసం

    • హర్‌మూజ్‌ జలసంధిలో నిలిచిపోయిన 150 నౌకలు

    • LNG గ్యాస్‌ ఉత్పత్తిని ఆపేసిన ఖతార్‌

  • Mar 03, 2026 06:54 IST

    ఇరాన్‌లో టీవీ, రేడియో హెడ్‌క్వార్టర్స్‌పై దాడులు

    • టీవీ, రేడియో హెడ్‌క్వార్టర్స్‌ కూల్చేసినట్టు..

    • అధికారికంగా ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటన

    • కువైట్‌లో అమెరికా ఎంబసీపై డ్రోన్లతో దాడులు

    • దాడులతో దెబ్బతిన్న అమెరికా ఎంబసీ భవనం

    • ప్రాణ భయంతో ఇరాన్‌ వీడుతున్న ప్రజలు

  • Mar 03, 2026 06:51 IST

    ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా, ఇజ్రాయెల్ దాడులు

    • ఇప్పటివరకూ 1,240పైగా స్థావరాలపై దాడులు

    • మరిన్ని దేశాలకు విస్తరిస్తున్న యుద్ధం

    • ఇరాన్‌ యుద్ధంతో గల్ఫ్ దేశాలకు భారీ నష్టం

    • ఇరాన్ యుద్ధంతో ఇప్పటివరకూ 600మంది మృతి